Pjr son vishnu vardhan reddy police have also issued notice to vishnu on the scuffle

MLA Vamshi and Vishnu Fight At Wedding, police questioned ex-MLA P Vishnuvardhan Reddy, police issued notice to vishnu, ex mla pjr son got a notice from police, police issued a notice to ex mla pjr son

The Madhapur police questioned ex-MLA P Vishnuvardhan Reddy on Wednesday regarding his scuffle with Kalvakurthy MLA Vamshi chander Reddy at the wedding of Vishnu's brother-in-law in Hyderabad last week.

పి.జె.ఆర్ కొడుకు విష్ణుకు నోటీసులు

Posted: 12/17/2014 02:57 PM IST
Pjr son vishnu vardhan reddy police have also issued notice to vishnu on the scuffle

ఒకరు శాసన సభ మాజీ సభ్యుడు అదీ కాకా సమాజం లో ప్రజల్లో పేరొందిన నేత సుపుత్రుడు కూడా..!! ఇంకొకరు ప్రస్తుత శాసన సభ సభ్యుడు. ఇద్దరు కలిసి ఇటీవల జరిగిన ఒక వివాహ కార్యక్రమంలో బాహాబహి కి దిగారు. ఈ విషయం కాంగ్రెస్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇద్దరూ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు కూడా. దాంతో ఇద్దరి పైన దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సి.సి టి.వి పుటేజిలు, 37 మంది ప్రత్యక్ష సాక్షుల విచారణ అనంతరం పోలీసులు విష్ణుకు నోటీసులు జారీ చేశారు. సి.సి టి.వి పుటేజిలు, 37 మంది ప్రత్యక్ష సాక్షులు జరిగింది చెప్పక పోలీసులు వంశీ చంద్ రెడ్డి పై దాడికి దిగినట్లు గుర్తించారు. దాంతో పోలీసులు నోటిల్సు లు ఇవ్వాల్సి వచ్చింది.

మొదటి నుండి విష్ణు ప్రవర్తన కొంత వివాదాస్పదంగానే ఉండేది. 2007 లో ఆయన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుటుంబం పై దాడి కి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఎం.ఎల్.ఏ వంశీచంద్ రెడ్డి విలేకరుల ముందు కూడా చెప్పాడు. అప్పుడు ఏదో పార్కింగ్ విషయం లో తలెత్తిన తగాదా చివరికి చిలికి చిలికి గాలివాన అయ్యింది. స్వయంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్ ఏ జోఖ్యం చేసుకోవాల్సి వచ్చిందని చెప్తారు. అప్పుడే విష్ణు వివాదాస్పద వైఖరి బాహ్య ప్రపంచానికి తెలిసింది. తర్వాత ఎన్నో సందర్భాల్లో ఎం.ఎల్.ఏగా ఉన్నప్పుడు కూడా పలు అధికారులతో గొడవ పడ్డట్లు కొన్ని వర్గాలు చెప్తాయి. తన తండ్రి చనిపోయిన తర్వాత మొదటిసారి  పి.జె.ఆర్ కొడుగ్గా 2009 సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొని గెలిచాడు. తర్వాత మళ్ళి ఇటీవల జరిగిన ఎన్నికలలో పోటి చేసి ఓడిపోయాడు. ఇప్పుడు విష్ణు సోదరి విజయా రెడ్డి తెరాస పార్టీ లో ఉండటం గమనార్హం. ఒకప్పుడు పి.జె.ఆర్ కొడుగ్గా ప్రజాభిమానం చూరగొన్న విష్ణు తర్వతాతర్వాత ప్రజల్లో.., తండ్రి అడుగుజాడల్లో నడవలేకపోయాడనే విమర్శలు ఉన్నాయి.  ఏది ఏమైనా పేద ప్రజల హృదయాలలో ఇప్పటికి కొలువున్న పి.జె.ఆర్ కొడుగ్గా కొన్ని భాద్యతలు ఉంటాయని ఆ నేత గుర్తేరెగాలని కొన్ని వర్గాలు కోరుకుంటున్నాయి.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles