ఆసియా అత్యంత శృంగార పురుషుడిగా రికార్డులకెక్కిన బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్.. తాజాగా ఇబ్బందుల్లో పడ్డాడు. తన అందచెందాలను చూపుతూ ఓ యువతి తన నగ్న చిత్రాలను, వీడియోలను అతని ఈ మెయిల్ ఐడీకి పంపడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అమె ఫోటోలు, వీడియోలతో తనకు ఎక్కడ ముడిపెడతారోనంటూ హృతిక్ తెగ బాధపడుతున్నారు. యువతి చేసిన పనికి తాను తట్టుకోలేక ఏకంగా పోలిస్ స్టేషన్ కే వెళ్లి పిర్యాదు చేశాడంటే నమ్మశక్యంగా లేదా..? అయితే యువతి గురించి కాదు కానీ ఒక మోసగాడి వ్యవహరంపై మాత్రం ఆయన తెగ కంగారు పడుతున్నారట.
వివరాల్లోకి వెళ్తే..హృతిక్ రోషన్ పేరుతో ఒక మోసగాడు This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. అనే పేరున ఈ మెయిల్ క్రియేట్ చేశాడు. అచ్చం హీరో హృతిక్ మాదిరిగానే ఫోజులిస్తూ..హృతిక్ అభిమానులను మోసగిస్తూ.. వారిని ఆటపట్టిస్తూ వస్తున్నాడు. ఇలా మోసగాడి చేతిలో అనేక మంది మోసపోతూ వస్తున్నారు. తన నకిలీ అకౌంట్ నే నిజమని బావించిన ఓ యువతి కూడా హృతిక్ పైనున్న అభిమానంతో, లేక వ్యామోహంతోనో మొత్తానికి అమె నగ్న ఫోటోలు, వీడియోలు మోసగాడి ఈ మెయిల్ కు పంపింది. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న హృతిక్.. మోసగాడిని పట్టుకోవాలని ఏకంగా పోలిసులనే అశ్రయించాడు.
ముంబయ్ పోలిస్ కమీషనర్ కార్యాలయానికి వెళ్లిన హృతిక్ రోషన్ తన పేరుతో అకౌంట్ ను నడుపుతున్న మోసగాడిని ఎలాగైనా పట్టుకోవాలని అభ్యర్థించాడు. యువతి పంపిన ఫోటోలు, వీడియోలను మోసగాడు ఎదేని వినియోగించరాని చోట వినియోగిస్తే.. అది తన ఇమేజ్ ను దెబ్బతీస్తుందని ఆయన అందోళన వ్యక్తం చేస్తున్నారు. తన అభిమానులతో తాను అధికారిక ఈమెయిల్ ఐడి This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. ద్వారానే గత కొన్నేళ్లుగా మాట్లాడుతానని, తన సెలబ్రిటీ ప్యాన్స్ తోనూ తాను ఇదే ఈమెయిల్ ఐడీ నే వినియోగిస్తానని పోలీసుల పిర్యాదులో పేర్కోన్నాడు. హృతిక్ ఇచ్చిన పిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more