Sydney operation success

Sydney cafe siege incident, major police operation, hostage-taking incident, Chocolat Cafe in Sydney

Gunman and two hostages killed in Sydney siege

సిడ్నీ కమెండో ఆపరేషన్ విజయవంతం బందీలు క్షేమం

Posted: 12/16/2014 10:55 AM IST
Sydney operation success

ఆస్ట్రేలియా వాణిజ్య రాజధానిలో సంచలనం సృష్టించిన సిడ్నీ ఉదంతానికి ఎట్టకేలకు భద్రత దళాలు ముగింపు పలికాయి. సిడ్నీలో సాయుధ దుండగుడొకరు కేఫ్ లోకి చొరబడి పలువురిని బందీలుగా నిర్బంధించి తీవ్ర కలకలాన్ని సృష్టించిన విషయం విదితమే. సాయుధ పోలీస్ బలగాలు కేఫ్ లోకి ప్రవేశించి బందీలను విడిపించటం తో  ఆపరేషన్ ముగిసినట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. బందిలందరూ ఇద్దరు భారతీయులుతో సహా అందరు క్షేమంగానే ఉన్నట్లు ప్రకటించారు. అందులో ఒకరు తెలుగు వాడు కూడా ఉండటం గమనార్హం (గుంటూరు జిల్లా వాసి) అతను కూడా క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి క్షేమంగానే ఉన్నట్లు తెలియజేసాడు.

సాయుధ పోలీసు బలగాలు కేఫ్ ని ఆకస్మికంగా చుట్టుముట్టి దున్దగుదితో సాయంత్రం వరకు చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోవటం తో ఒక్కసారి గా కేఫ్ లోకి సాయుధ బలగాలు చొచ్చుకొని పోయి ఆ దుండగుడి పై దాడి కి దిగటం తో దాదాపు 17 గంటల పాటు సాగిన ఉత్కంట కు తెర పడినట్లు అయ్యింది. పోలీస్ బలగాలు సన్ గ్రెనేడ్ల తో విసరటంతో పాటు కాల్పులు కూడా జరిపారు.గుంటూరు కు చెందిన అంకిరెడ్డి విశ్వ కాంత్, మరో భారతీయుడు పుష్పెందు సురక్షితంగా బయట పడ్డారు. ఈ పోలీస్ ఆపరేషన్ లో ఒక బందీ మరణించటంతో పాటు మరో ముగ్గురు గాయపడినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి కాని పోలీసులు మాత్రం అధికారికంగా ధ్రువికరించలేదు.

సాయుధ దుండగుడిని ఇరాన్ కి చెందిన హారన్ మోనిస్ గా  గుర్తించారు. ఇతను ఆస్ట్రేలియా లో 1996 నుండి ఉంటున్నట్లు సమచారం. ఆపగానిస్తాన్ లో ప్రాణాలు కోల్పోయిన ఆస్ట్రేలియా సైనికుల కుటుంబాలకు మోనిస్ గతం లో ఒక లేఖ రాసినట్లు సమాచారం. ఆ సైనికులను హంతకులుగా ఆ లేఖలో పేర్కొన్నాడు. అతను బందీలతో బలవంతంగా అరబిక్ లో రాసి ఉన్న నల్ల జెండాను ప్రదర్శింప జేశాడు. ఇంకొన్ని వివరాలు ఆస్ట్రేలియా ప్రభుత్వం నుండి అధికారికంగా వెలువడాల్సి ఉంది. ఏది ఏమైనా ఆపరేషన్ విజయవంతం పట్ల ఆస్ట్రేలియా ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

హరి 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles