రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం, పాలనపగ్గాలు చేతబట్టి ఆరుమాసాలు కావస్తున్నా.., రుణమాఫీ అంశంలో అనేక మల్లగుల్లాలు పడింది. ఎట్టకేలకు విడుదల చేసిన రుణమాఫి విధానంలో పదేళ్లుగా రైతులు అనేక అవస్థలు పడ్డారని చెబుతూనే.. రుణాలను మాత్రం కేవలం 2007 నుంచే మాఫీ చేస్తామని చెప్పడం, అసలు వడ్డీ కలిపి లక్షన్నర రూపాయల లోపు వున్న వారికి మాత్రమే వర్తింపజేస్తామని చెప్పడంతో రుణమాఫీ విధానంలో స్పష్టత కొరవడింది.
రుణమాఫీపై తొలి సంతకం చేసి అమలుపరుస్తామనన ప్రభుత్వం కాస్తా.. క్రమంగా తమ విధానంలో మార్పలను తీసుకువచ్చి ముందుగా 50 వేలు, ఆ తరువాత లక్ష రూపాయలు, ఆ తరువాత లక్షన్నర రూపాయల రుణాలను మాఫీ చేస్తామని చెప్పడం కూడా రైతులకు మింగుడు పడటం లేదు. 2007 నుంచి రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. అక్కడి నుంచి రుణాలను మాఫీ చేయాల్సింది పోయి.. రుణమాఫీలో కూడా డబ్బునే ప్రధానంగా పేర్కొంటూ మాఫీ చేయడంపై రైతులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
ఇది చాలదన్నట్లు హైదరాబాద్ నగరంలో జీవనం సాగించేందుకు వలస వచ్చిన అనేక మంది రైతులు.. వారి పోలాలపై రుణాలను పొంది.. ఆ డబ్బుతో హైదరాబాద్ కు వలసవచ్చి చిరు వ్యాపారాలు పెట్టుకుని, లేదా చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరందరూ వారి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులను జతపర్చినప్పటికీ వారికి రుణాలు మాఫీ కాలేదు. దీనికి కారణం సదరు వలసవాదులు హైదరాబాద్ లోనే మకాం వేయడం, సంబంధిత గ్రామాల్లో అధికారులు జరిపిన సర్వే జాబితాలలో వారి పేర్లు నమోదు కాకపోడమే కారణం.
అయితే ఇలా వలసవాదుల పేర్లను జాబితా నుంచి తోలగించి, వాటిని సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేలకు అందజేసింది ప్రభుత్వం. ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గాల్లోని ప్రజలు తెలుపుతున్న నిరసనల నేపథ్యంలో మరోమారు ముఖ్యమంత్రి చంద్రబాబును ఈ విషయమై అభ్యర్థించారు. వలస వెళ్లిన వారికి కూడా రుణాలను మాఫీ చేయాలని, వారు జీవనోపాధి కోసం మాత్రమే వలస వెళ్లారని వారు చంద్రబాబుకు వివరించారు. దీనిపై తరుణోపాన్ని అలోచించిన చంద్రబాబు.. వలసవెళ్లిన వారిలో అధిక శాతం మంది హైదరాబాద్ లోనే తాత్కాలికంగా స్థిరపడిన నేపథ్యంలో వారందరికీ తెలంగాణ ప్రభుత్వమే రుణమాఫీ చేయాలన్న డిమాండ్ ను తెరపైకి తీసుకురానున్నారు. హైదరాబాద్కు వచ్చిన వలసవాదుల రుణాలను మాఫీ చేశారా లేదా..? అంటూ ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరనున్నారు. రుణమాఫీలో అంశంలో హైదరాబాద్ కు వలసవచ్చిన రైతల అంశాన్ని తేల్చాలని పట్టుబట్టనున్నారు. మరి ఈ అంశమై తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు విన్నపంపై సానుకూలంగా స్పందింస్తుందో లేదో..? వేచి చూడాలి మరి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more