Cpm would organize a day long sit in here to protest against government policies

CPM will take to the streets to protest, CPM is planning to organize an agitation, left parties has decidet to do protests againist government.

CPM will take to the streets to protest the "dilution" of the rural employment.., The CPM plans to go strongly against the government through protests by ... The Left front will decide to protest against the government's policies...

ఎర్ర జెండాలోస్తున్నాయి....ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి......!!

Posted: 12/13/2014 05:08 PM IST
Cpm would organize a day long sit in here to protest against government policies

ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని వాటిపై ప్రభుత్వాన్ని నిలదీయటానికి క్షేత్ర స్థాయిలో ఉక్కు పిడికిలి బిగించి ఉద్యమించాలని పది వామపక్ష పార్టీలు కలిసి నిర్ణయించాయి. సి పి ఎం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో అన్ని వామపక్ష పార్టీ ల నాయకులు హాజరై పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందిచటం లేదని, ఎలాంటి నివారణ చర్యలు చేపట్టటం లేదని విమర్శించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల దయనీయ పరిస్థితులు, చేపట్టాల్సిన చర్యలపై నివేదిక రూపొందించి, ముఖ్యమంత్రి కి అందజేయాలని నిర్ణయించారు ఆయనను స్పందనను బట్టి, భవిష్యత్ కార్యాచరణను రూపొందిచాలని అభిప్రాయ పడ్డారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజా, వ్యతిరేక విధానాలకు  నిరసనగా ఈ నెలలో భారి ర్యాలి, బహిరంగ సభ ను నిర్వహించి నిరసన కార్యక్రమాలను చేపట్టబోతున్నామని సి పి ఐ రాష్ట్ర శాఖ ప్రకటించింది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు పెట్టుబడి దారులకు ఊతాన్నిచ్చే విధంగా ఉంటున్నాయని, రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఎండగడతామని ప్రకటించారు. ఈ ఎర్ర చొక్కాల రాక పట్ల ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles