Revanth reddy criticises harish rao and revanth reddy criticises kcr

Revanth Reddy press meet on lands Controversy, revanth reddy criticises harish rao, tdp leader revanth reddy criticises harish rao, revanth reddy criticises kcr, tdp leader revanth reddy, kcr, telangana goverment, revanth reddy comments on kcr government, revanth reddy affairs, revanth reddy afaair with heroine, revanth reddy affair with heroines, harish rao affairs with heroines

Revanth Reddy Criticises Harish Rao For thier government policies.. TDP Leader Revanth Reddy press meet on lands Controversy.. Revanth Reddy strongly criticise CM KCR...

అల్లుడు ఆణిముత్యమైతే.., మామ స్వాతి ముత్యమట... మరి తనేముత్యమో..!!

Posted: 12/13/2014 11:59 AM IST
Revanth reddy criticises harish rao and revanth reddy criticises kcr

హరీష్ రావు ఆణిముత్యమైతే.., కెసిఆర్ స్వాతి ముత్యమంట...!! ఈ మాటలు అన్నది ఎవరో కాదు అధికార పార్టీని తన విమర్శలతో, తన అదరగొట్టే మాటలతో అనునిత్యం ఎండగడుతున్న టి డి పి నేత రేవంత్ రెడ్డి... గిరిజనులు, దళితులు, పేదల భిక్షతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వారి సంక్షేమం విషయంలో మాట తప్పారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే దళితుడినే సీఎం చేస్తానని, దళితులకు మూడు ఎకరాల భూమి, మైనార్టీలకు 12 శాతం  రిజర్వేషన్  కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, రూ.3.5 లక్షలకే ఇల్లు కట్టిస్తానని చెప్పిన ఆయన.. పేదల ఎజెండాను పక్కన పెట్టి దొరల ఎజెండాను అనుసరిస్తున్నారని విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో దళిత, గిరిజన భవనాలను నిర్మిస్తానని చెప్పిన సీఎం గ్రామాల్లో అదే దళిత, గిరిజనులు నివసిస్తున్న గుడిసెల స్థానంలో పక్కా ఇళ్లు నిర్మిస్తానని ఎందుకు చెప్పడంలేదని విమర్శించారు.

ట్యాంక్‌బండ్ చుట్టూ 100 అంతస్తుల భవనాలను నిర్మిస్తామని చెబుతున్న కేసీఆర్.. అలాంటి అద్దాల మేడలు దొరల కోసమేనన్నది తేటతెల్లమవుతోందన్నారు. వాటర్‌గ్రిడ్ పథ కం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికేనన్నారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ అమరుల విగ్రహాలు పెట్టాలని, లేకుంటే తాము అధికారంలోకి వచ్చాక విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలకు తెరాస ఎం బదులిస్తుందో చూడాలి మరి...!! ఇదంతా పక్కన పెడితే అధికారంలోకి "వచ్చాక" అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇంతకి "తామెప్పుడు" అధికారంలోకి వస్తామో చెప్పలేదు మరి....!!

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harish rao  kcr  revanth reddy  trs  tdp  

Other Articles