కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ లో ఇటీవల జరిగిన సంఘటన తీవ్ర దూమారాన్ని సృష్టిస్తుంది. ప్రజా సమస్యలకు వేదికైన శాసన సభ జరుగుతున్నపుడు బి జె పి శాసన సభ్యులు అసెంబ్లీ లో మొబైల్ ఫోన్ ని అసభ్యంగా ఉపయోగిస్తూ అడ్డంగా దొరికిపోయారు. అందులో ఒక శాసన సభ్యుడు తన మొబైల్ ఫోన్ లో ప్రియాంకా గాంధీ ఫోటో ను అసభ్యకర రీతిలో తాకుతూ మీడియా కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు.
శాసన సభ సమావేశాలు జరుగుతున్నపుడు బీదర్ జిల్లా ఔరాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభూచౌహాన్, బెంగళూరులోని బసవనగుడి ఎమ్మెల్యే రవిసుబ్రహ్మణ్య ఒకరి పక్కన మరొకరు కుర్చొని ఉన్నారు. జేడీఎస్ ఫ్లోర్‌లీడర్ కుమారస్వామి చెరుకు రైతుల సమస్య పై మాట్లాడుతున్న సమయంలో ప్రభుచౌహాన్ తన సెల్‌ఫోన్‌ను తీసి అందులోని కొన్ని ఫొటోలను చూస్తున్నారు. ఈ క్రమంలోనే సహచర ఎమ్మెల్యే అయిన రవిసుబ్రహ్మణ్యకు తన ఫోన్‌లోని కొన్ని ఫొటోలను చూపించడం మొదలు పెట్టారు. అయితే సభలో కెమెరాలు ఉన్నాయని ఫోన్‌ను పక్కన పెట్టాలని సూచించిన రవిసుబ్రహ్మణ్యము ఫోన్ చూడకుండా పక్కకు తప్పుకున్నారు. కాని ప్రభు చౌహాన్ మాత్రం సెల్‌ఫోన్‌లోని ఫొటోలను చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభుచౌహాన్ తన సెల్‌ఫోన్‌లో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ, యోగా గురువు బాబారామ్‌దేవ్‌ల ఫొటోలను చూసి ఆ తర్వాత ప్రియాంకాగాంధీ ఫొటోను తాకుతూ జూమ్ చేయడం మీడియా కంటపడింది. ఈ విషయం ప్రసారం అవుతున్న విషయం తెలుసుకున్న రవిసుబ్రహ్మణ్య మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు.
కాని లాభమేముంది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఉంది ఆ ఎం.ఎల్.ఏ గారి వ్యవహారం. అంత మీడియా లో బ్రేకింగ్ న్యూస్ లుగా వేసి ప్రసారమైన తర్వాత వివరణ ఇచ్చుకొని ఎం లాభం. పైగా ఆ వివరణలో నేను ప్రియాంకా గాంధీ ని ఆ ఉద్దేశం తో చూడలేదని చెప్పుకొచ్చాడు. మరి ఇంకే ఉద్దేశం తో చూసాడో మరి...!! ఇదిలా ఉంటె ఈ సంఘటన పై కర్ణాటక ముఖ్య మంత్రి సిద్దరామయ్య స్పందిస్తూ ఆ ఎం.ఎల్.ఏ గారు చేసిన దానికి బాధ పడుతూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అమ్మాయిల చిత్రాలను అసభ్యంగా చూడటం వాళ్ళ సంస్కృతి అని ఆ ఎం.ఎల్.ఏ పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
ఏది ఏమైనా ప్రజలకు పారదర్శక పాలన అందిస్తూ జవాబు దారితనంగా ఉండాల్సిన మన గౌరవనీయ ప్రజా ప్రతినిధులు ఇలాంటి అసభ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండాలనే ఆలోచన ని ఎప్పుడు తెలుసుకుంటారో అని పలు మేధావి వర్గాలు చర్చించుకుంటున్నాయి.
హరి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more