Google shopping through online gosf

google online shoping, google graet online shopping festival, GOSF , gosf.in, online shopping festival, nexes 6 mobile, nexes 5 mobile, google nexes

google online shopping through google great online shopping festival. in this festival we can buy houses also

గూగుల్ లో ఇల్లు కూడా అమ్ముతారట..!!

Posted: 12/10/2014 10:15 AM IST
Google shopping through online gosf

ఆన్ లైన్ షాపింగ్ సందడి తో గూగుల్ ఒక సరికొత్త ట్రెండ్ ని సృష్టించ బోతుంది. గూగుల్ గ్రేట్ ఆన్ లైన్ షాపింగ్ సందడి (జి ఓ ఎస్ ఎఫ్) ఈ రోజు నుండి మొదలు కాబోతుంది. 2012 నుండి ప్రతి సంవత్సరం గూగుల్ ఈ ఆన్ లైన్ షాపింగ్ నిర్వహిస్తుంది. ఈ ఆన్ లైన్  కొనుగోళ్ళ పండగ 12 వ తేది వరకు జరుగుతుంది. ఈ షాపింగ్ లో వినియోగదారులు ఇల్లు కూడా కొనుక్కోవచ్చంట...!! ఈ షాపింగ్ లో పాలు పంచుకోబోతున్న విక్రయ కంపెనీ టాటా హౌసింగ్ ఈ విషయాన్నీ వెల్లడించింది. బెంగళూర్ తో పాటు తనకు దేశ వ్యాప్తంగా ఉన్న ఏడు ఇతర ప్రాజెక్ట్ లలో నిర్మించిన గృహాలను ఈ ఆన్ లైన్ కొనుగోళ్ళ పండగ లో మనం కొనుక్కోవచ్చని తెలిపింది. ఇంతకు ముందే ప్రకటించినట్లుగా గూగుల్ నెక్సస్ మొబైల్ అమ్మకాలను కూడా కంపెనీ ఈ రోజు నుండే ప్రారంభిస్తుంది. 2012 లో మొట్ట మొదటిసారి గూగుల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు 90 విక్రయ కంపనీ లు పాల్గొన్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య 450 కు చేరింది. భారత వినియోగదారులు రోజు రోజుకు ఆన్ లైన్ కొనుగోళ్ళ పట్ల ఎంతో అమితాసక్తి ని కనబరుస్తున్నారు. గత కొన్ని రోజులలో గూగుల్ జి.ఓ.ఎస్.ఎఫ్.ఇన్ వెబ్ సైట్ ను 50 లక్షల మంది సందర్చిచుకోవటమే దానికి తార్కాణం.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : google online shopping  online shopping festival  google  tata housing  online trading  

Other Articles