Water resource on mars planet

water on mars, mars water source update, curiosity rover mars water photos, mars surface photos videos, mangalyaan rover updates, mom latest updates, ISRO latest rocket testings, science and technology updates, planet astrology updates

water resource on mars planet : curiosity rover finds water source on mars planet photos sent by rover tells that lakhs of years ago mars surface have water

అంగారకుడికి మానవుడి నిచ్చెన..

Posted: 12/09/2014 07:02 PM IST
Water resource on mars planet

ఏళ్ళ నిరీక్షణ ఫలించింది. భూమితో పాటు సోదర గ్రహాల్లో ఎక్కడో ఓ చోట నీరుంటుంది అన్న ఆశకు ఆయువు లభించింది. వేల కోట్లు ఖర్చు చేసి అరుణ గ్రహంపైకి అమెరికా పంపిన క్యూరియాసిటీ రోవర్ మనిషికి అనుకున్న ఫలితాలు ఇస్తోంది. అంగారక గ్రహంపై నీటి జాడలు ఉన్నాయనే వాదనకు బలం చేకూరుస్తూ ఫోటోలు పంపింది. దీంతో నీటి ఆనవాళ్ళకు సంబంధించిన ఆనవాళ్లతో పాటు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాబోయే తరాలకు కాబోయే భూ గ్రహం అని శాస్ర్తవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో అరుణ గ్రహంపై నీరు ఉండేదని కొందరు.., లేదు అని మరికొందరు వాదించుకునేవారు. ఈ క్రమంలోనే అంగారకుడిపైకి చేరిన క్యూరియాసిటీ., గ్రహం ఉపరితల ఫోటోలను తీసింది. సరస్సల్లోకి నీరు ప్రవహించినట్లుగా నీటి జాడలు ఉండే ఈ ఫోటోల ద్వారా గ్రహంపై ఖచ్చితంగా నీటి ఆనవాళ్లు ఉండేవని స్పష్టం అవుతోందని భారత సంతతికి చెందిన శాస్ర్తవేత్తలు అంటున్నారు. మానవాళికి కాకపోయినా గతంలో  సూక్ష్మ జీవులకైనా ఈ గ్రహం ఆవాసంగా ఉన్నట్లు భావిస్తున్నారు.

గ్రహంలోని మౌంట్ షార్ప్ శిలలు వేల లక్షల సంవత్సరాల పాటు  నీటిలో తడిసినట్లు ఆధారాలు తెలుపుతున్నాయని అంటున్నారు. ఈ పరిశోధన ఫలించి గ్రహంపై నీటి ఆధారాలు లభ్యం అయితే గత మానవ మనుగడ గురించి పక్కనబెడితే భవిష్యత్తులో అరుణ గ్రహంపై ఆశ్రయం పొందటానికి మాత్రం ఆస్కారం ఉంటుంది. భూమిపై నిత్యం రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని రెండవ మానవ గ్రహంగా మార్చుకునే అవకాశం ఉంది. ఇదంతా జరగటానికి కొన్ని పదుల సంవత్సరాలు పట్టవచ్చు కానీ.., త్వరలో మానవుడి మొబైల్ రింగ్ టోన్  అంగారకుడిపై కూడా మోగటం ఖాయం.

అయితే ఇక్కడే కొన్ని ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంగారకుడిపై నీరు ఉన్నది నిజమైతే.., ఏలియన్స్ ఉన్నది కూడా నిజమే అని కొందరు వింత వాదన తెరపైకి తీసుకొస్తున్నారు. గ్రహాంతర వాసులుగా, మానవ జాతి సోదర జీవులుగా గుర్తించబడ్డ వీరు ఉన్నట్లు, లేనట్లు ఆధారాలున్నాయి. ఏలియన్స్ ఉన్నాయనే వారి వాదన ప్రకారం ఇవి మానవుల కంటే చాలా రెట్లు టెక్నాలజి పరంగా ముందంజలో ఉన్నవి. ఈ క్రమంలో అంగారకుడిపైకి వెళ్ళే మానవులపై ఇవి దాడులు చేస్తే మానవ మనగడకే ముప్పు ఏర్పడుతుంది. కాబట్టి అంగారకుడిపై ఆవాసం అంటే వెంటనే రెడి అయిపోకుండా కాస్త ముందు వెనకా ఆలోచించాలి. అప్పటివరకు అంగారకుడిపై నీరున్నా.., బంగారం ఉన్నా అది పరాయి గ్రహపు సొత్తే.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mars water photos  curiosity latest  earth planet latest  

Other Articles