నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించడం దురదృష్టకరమని మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. అయినా విధి రాతను ఎవరూ తప్పించుకోలేరని ఆయన పేర్కోన్నారు. సీటు బెల్ట్ పెట్టుకోకుని వుండి వుంటే మరణం సంభవించి వుండేది కాదేమోనని అభిప్రాయపడ్డారు. సీటు బెల్టు పెట్టకోకపోవటం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. సామాజిక బాధ్యత గల వ్యక్తులుగా .. సీటు బెల్ట్‌ను పెట్టుకోగలిగితే ...ఇలాంటి ప్రమాదాలను ఎంతోకొంత తప్పించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.
చిరంజీవి ఆదివారం ఉదయం జానకిరామ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. నందమూరి హరికృష్ణను పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి ఉండే హరికృష్ణకు... ఇది రాకూడని కష్టమన్నారు. ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదన్నారు. జానకిరామ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యం చేకూరాలని కోరుకుంటున్నట్లు చిరంజీవి చెప్పారు.
ఇటువంటి సంఘటనలు చూసి అయినా సరే కారు నడుపుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ పెట్టుకోవాలని ఆయన తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రమాదాల బారిన పడినవారి కుటుంబాలు ఎంతలా మనోవేధనకు గురవుతాయో.. తెలుసుకోవాలన్నారు. తల్లిదండ్రులు, కుటంబ సభ్యులు కన్నీళ్లు ఇంకిపోయేలా శోకంలో మునిగినా.. పోయినవారు తిరిగి రారన్నారు. కారు ఎక్కగానే ముందుగా సీటు బెల్టు పెట్టుకోవడం అలవర్చుకోవడం మంచిదని చిరంజీవి సూచించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more