Anantha padmanabha swamy temple in kerala guarded by devotee crocodile for hundreds of years

Historic Temple in Kerala, Anantha padmanabha swamy Temple, devotional Kerala, Devotee Crocodile babia, babia guarding temple, Devotee Crocodile babia, Ananthapura Temple in Kerala

Historic Anantha padmanabha swamy Temple in Kerala Guarded by Devotee Crocodile for Hundreds of Years

వందేళ్లకుపైగా అనంత కోవెలకు మొసలి కాపలా

Posted: 12/07/2014 12:45 AM IST
Anantha padmanabha swamy temple in kerala guarded by devotee crocodile for hundreds of years

కేరళలోని కసరగడ్ లో కొలువైన చారిత్రాత్మక అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ప్రత్యేకత వుంది. అనంతపుర కోనేరు నడిమద్యలో నిర్మితమైన ఈ ఆలయం సుమారు 9వ శతాబ్దంలో నిర్మిచారు. ఈ ఆలయంలోకి వెళ్లాలోని గర్భగుడిలోకి వెళ్లాలంటే కేవలం వంతేనే అధారం. వందల ఏళ్లుగా ఈ ఆలయాన్ని ఒక శాఖాహారి మొసలి కాపాలా కాస్తోంది. వందల ఏళ్ల నుంచి మొసలి కాపాలాకాయమేంటని సందేహం వచ్చినా.. ఇదే నిజం..

ఆలయ విశిష్టచరిత్ర

ఆలయ ఎలా నిర్మితమైందన్న నిగూఢ రహస్యాలు కొందరకి మాత్రమే తెలిసినా.. ముఖ్యంగా అందరి నోళ్లలోనూ నానుతున్న కథ మాత్రం ఒక్కటే. ఆలయం వెలసిన చోట తులు వంశానికి చెందిన బ్రహ్మణ మహర్షి దివకర ముని విల్వమంగళం నివసించేవాడు. తప్పుస్సులు పూజలతో దేవదేవుని మదిని మొప్పించాడు. ఒక రోజు నారాయణుడు బాలుడి రూపంలో ఆయనకు దర్శనమిచ్చాడు. ఆ బాలుడి ముఖం దివ్వ తేజస్సుతో వెలడగం చూసి మహర్షి.. సంతుష్టుడై.. బాలకుడిని నీవు ఎవరు..? ఎందుకు ఇక్కడకు వచ్చావు అని అడిగారట. బాబు తనకు అమ్మా, నాన్న లేరని, తన గురించి అడిగేవారి, బాధపడేవారు కూడా ఎవ్వరూ లేరని చెప్పాడు. దీంతో మహార్షి ఆ బాలుడు పరిస్థితికి జాలిపడి.. తన వద్దే వుండమని చెప్పాడు. మహర్సి ఆజ్ఞ మేరకు ఉండటానికి అంగీకరించిన బాలుడు చిన్న షరుతు విధించాడట. తనకు ఎప్పుడైన పరాభావం ఎదురైందని అనిపిస్తే తాను వెళ్లిపోతాను అని చెప్పాడు. అందుకు అంగీకరించిన మహర్షి బాలుడు చక్కగా చేసుకుంటున్నారు. అదే విధంగా బాలుడు కూడా మహర్షి కొంత కాలం సేవ చేశాడు.

కొంత కాలం తరువాత బాలుడి చిలిపి చేష్టలు అధికం అయ్యాయి. దీనిపై మండిపడిన మహర్షి అతినిపై కోపగించుకున్నాడు. దీంతో దానిని అవమానంగా భావించిన బాలుడు అర్థధానమయ్యాడు. అంతకు ముందు తానను చూడాలనిపిస్తే.. అనంతుడి శేషాచల అడవులకు నిలయమైన అనంతన్ కాట్ కు రమ్మని బాలుడు చెప్పారు. బాలుడు అదృశ్యం కావడంతో తనకు సపర్యలు చేసింది ఆ నారయణుడే నని తెలుసుకని మహర్షి పశ్చాతపపడ్డాడు. బాలుడ మాయమైన స్థలం వద్ద ఓ గుహను కనుగోన్న మహర్షి.. గుహ ద్వారాలోనికి చేరుకున్నాడు. చివరకి వెళ్లగానే అతనికి నది కనిపించింది. అక్కడి నుంచి దక్షిణం వైపుకు పయనమయ్యాడు. అక్కడ సముద్రానికి అనుకుని ఓ అటవీ ప్రాంతం కనిపించింది. అడవిలోని ప్రవేశించిన మహర్షికి కొంత దూరంలో బాలుడు కనిపించాడు. బాలుడు వద్దకు చేరుకుందామని అనుకునే లోపు బాలుడు మరోమారు అదృశ్యమై పెద్ద ఇప్ప చెట్టుగా మారాడు. ఇంతలో నేలకోరిగింది. వరుసగా విచిత్రాలను చూసిన మహర్షికి అప్పుడు నారాయణుడి దర్శనం కలిగింది. శేషాచల సర్పంపై శయనించిన మహావిష్ణువు విల్వమంగళం మహర్షికి దర్శనమిచ్చాడని చర్రిత చెబుతుంది.

ఆలయానికి వందల ఏళ్లుగా బాబ్యా మొసలి కాపలా

పురాతన కాలం నుంచి ఈ ఆలయంలోని కోనేరులో ఒక బాబ్య మొసలి కాపలాగా వుంటోంది. ఈ కోనేరులో భక్తులు స్నానాధులు ఆచరించినా.. ఇప్పటి వరకు బాబ్య ఎవరికీ ఎలాంటి హానీ చేయలేదు. బాబ్య భక్తులు సమర్పించే నైవేద్యాలే తప్ప ఎలాంటి మాంసాహారాన్ని స్వీకరించదని ఆలయ నిర్వహకులు చెబుతున్నారు. ఆలయంలోని మూలవిరాట్టు సమర్పించే నైవేద్యమే తప్ప మరే ఇతర ఆహారం తీసుకోదు. కొనేరులోని చేపలను కూడా ఇప్పటి వరకు ఎలాంటి హాని చేయలేదట.

స్థానికంగా వున్న ఒక సాధవు మొసలి కాపాలకు మరో విష్టత వుందని చెబుతున్నారు. విల్వమంగళం స్వామిని తపోదీక్షలో వున్నప్పడు బాలుడి రూపంలో వున్న శ్రీ కృష్ణుడు..అతని అల్లరి పనులతో వేధిస్తాడు. దాంతో కోపోద్రిక్తుడైన విల్వమంగళం మహర్షి బాలుడిని నెట్టివేస్తాడు. దీంతో బాలుడు గుహలోకి అంతర్థానమవుతాడు. కాగా బాలుడు అదృశ్యమైన స్థానంలో ఇప్పటికే శ్రీకృష్ణుడి వెళ్లిన భీట వుందని దాని ముఖద్వారం వద్దనే బాబ్య కాపాలాగా వుందని, దాంతో పాటు ఆలయానికి కూడా కాపాలాగా వుంటుందని సాధువు తెలిపారు.

కాగా ఆలయ విశిష్టత తెలియని, అర్థం కాని బ్రీటీషు సైనికులు 1945లో వందల ఏళ్ల నుంచి మొసలి కాపాలా కాస్తుందన్న నిజాన్ని పక్కన బెట్టి అవన్నీ కథనాలని కొట్టిపారేశాడు. మొసలి బాబ్యాను తుపాకి గుండు పేల్చి కాల్చాడు. దాంతో మొసలి మరణించింది. అయితే వారం రోజుల్లో ఆ సైనికుడిని పాము కాటు వేసింది. అందరూ అది అనంతుడి శాపం వల్లే పాము కాటు వేసిందని అనుకున్నారు. సైనికుడు మరణించగానే అనంతపుర కోనేరులో మరో మొసలి భక్తులకు కనిపించింది. తాను ఆలయానికి కాపాలా వున్నానని చాటిచెప్పింది. అయితే ఇప్పుడు ఎవరైనా అదృష్టవంతులు భక్తితో ధ్యానం చేస్తే తప్ప బాబ్య ఎవరికీ దర్శనమివ్వడం లేదట.

ఆలయ నిర్మాణం

ఆలయ నిర్మాణం, నిర్మాణంలో వాడిన వస్తువులు, ఆలయాన్ని నిర్మించిన విధానం మొత్తం ప్రత్యేకతతో కూడుకుంది. 302 అడుగుల లోతైన కోనేరులో ఆలయ నిర్మాణం ఎలా జరిగిందన్నది ఇప్పటికీ దైవసంకల్పమనే చెప్పాలి. కోనేరులోకి నిత్యం సహజసిద్దమైన, ఔషదగుణాలున్న నీరు ప్రవహిస్తూనే వుంటుంది. ఆలయ చుట్టూర శిధిలమైన పెద్ద ప్రాకారాలు కనబడటం చూస్తే పురాతన కాలంలో ఇదో ప్రసిద్ద పుణ్యక్షేత్రంగా బాసిల్లిందనడానికి నిదర్శనాలుగా చెప్పవచ్చు. ముఖ్యమైన మూలావిరాటు్ల వుంటే గర్భకుడి, నమస్కార మండపం, జల దుర్గ ఆలయాల నిర్మాణం, గుహలోకి వెళ్లే దారి అన్ని కూడా అ కోనేరు నుంచే వుండడం విశేషం. నమస్కార మండపానికి తూర్పు పర్వతానికి మధ్య ఒక కాలి వంతెన వుంది దాని నుంచే అలయంలోకి వెళ్లాల్సి వుంటుంది.

ఆలయంలో మూలవిరాట్టు మహా విష్ణువు. ఈ ఆలయాంలోని కీలక అంశాలలో ఒకటన మూలవిరాట్టు విగ్రహాలు లోహంతోనో, రాయితోనో చేసినవి కావు. అతి అరుదైన 70 విశిష్టమైన ఔషదాలతో చేసిన కడు శంకర యోగం ద్వారా మూలవిరాటు విగ్రహం తయారు చేశారు. ఈ విగ్రహాలను 1972లో తొలగించి వాటి స్థానంలో కంచికామకోటి మఠాధిపతి స్వామి జయేంద్ర సరస్వతి తిరువాటికల్ సమర్పించిన పంచలోహ విగ్రహాలను పున:ప్రతిష్టించారు. అయితే తాజాగా పలువురు ఆద్యాత్మిక వేత్తలు కడు శంకర యోగంతో రూపోందించిన విగ్రహాలనే ప్రతిష్టంచాలని ఒత్తిడి తీసుకువస్తుండడంతో ఆ ధిశగా చర్యలు చేపడుతున్నారని సమాచారం. మూలవిరాట్టు మహావిష్ణువు పంచముఖ అనంత శేషుడిపై కూర్చని వున్న రూపాన్ని దర్శిస్తే సకల పాప హరణం జరుగుతుందని భక్తుల విశ్వాసం.

ఈ అనంతపుర ఆలయంలోనికి అన్ని వర్గాల ప్రజలు చేరుకుని దర్శనం చేసుకోవచ్చు. కేరళ పర్యాటక శాఖ ఈ ఆలయం ప్రత్యేకతను కాపాడే పనిలో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని పరిరక్షిస్తుంది. ఆలయ పైకప్పుపై శ్రీ మహా విష్ణువు దశావతారాలు, వాటి విశిష్టతలను కళ్లకు కట్టినట్టు పెయింటిగ్స్ వున్నాయి. ముక్త మండపం పైకప్పు పై నవగ్రహాలు చెక్కబడి వున్నాయి, శ్రీ కోవెలకు ఇరువైపులా జయ, విజయలను అద్భుతంగా చెక్కారు. ఈ ఆలయానికి 12 కిలోమీరట్ల దూరంలో కాసరగడ్ ప్రధాన రైల్వేస్టేషన్ వుంది అక్కడి నుంచి ఆలయానికి ప్రతినిత్యం వాహనాలు నడుస్తూనే వుంటాయి.


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles