Maharashtra chief minister devendra fadnavis today allocated portfolios kept crucial departments with bjp

Maharashtra ministers portfolios allocated, maharastra CM allocated portfolios, Devendra Fadnavis allocated portfolios, twenty-member ministers, portfolios allocated to Shiv Sena, BJP keeps crucial portfolios, Shiv Sena not got crucial portfolios

Maharashtra Chief Minister Devendra Fadnavis today allocated portfolios to the twenty-member council of ministers, including 10 of the Shiv Sena, who did not get any crucial portfolios

‘మహా’ స్నేహబంధం ఎన్నాళ్లు కోనసాగేనూ..

Posted: 12/06/2014 06:50 PM IST
Maharashtra chief minister devendra fadnavis today allocated portfolios kept crucial departments with bjp

మహారాష్ట్రలో కొలువుదీరిన ఫెడ్నవిస్ ప్రభుత్వం ఐదేళ్లు ప్రజలకు అధికారాన్ని అందిస్తుందా..? అధికారం కోసం బలవంతంగా కలిసిన మిత్రులు చివరి వరకు కొనసాగుతారా..? అన్న సందేహాలు మళ్లీ ఉత్పన్నమవుతున్నాయి. మహారాష్ట్రలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపి.. శివసేనతో బలవంతంగా కలిసిందని.. ఈ కలయిక చివరి వరకు కొనసాగదన్న విమర్శలు అప్పుడే వినిపించడం ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా చాయ్ వాలా నరేంద్రమోడీ ప్రధాని కాగా, లేనిది తాను ముఖ్యమంత్రి అయితే తప్పేంటని ఎన్నికల ప్రచార సందర్భంగా శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే చేసిన వ్యాఖ్యల దరిమిలా ఈ సందేహాలు రేకెత్తుతున్నాయి

దీనికి తోడు దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో తాజాగా కేబినెట్ విస్తరణ జరిగినా.. కీలక శాఖలు మాత్రం బీజేపీకే పరిమితమయ్యాయి. దాదాపు రెండు నెలల క్రితం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరక విడిపోయిన శివసేన పార్టీ తిరిగి కలిసినా మంత్రి పదవుల విషయంలో మాత్రం సరైన ప్రాధాన్యత కల్పించలేదు. దీంతో పాతికేళ్ల మైత్రిని కాదనుకుని ఒంటిరిగా ఎన్నికల బరిలోకి దిగిన పార్టీలు.. అధికారం కోసం కలిసినా.. అవి ఐదేళ్ల పాటు కొనసాగుతందా అని రాజకీయ విశ్లేషకులలో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మహరాష్ట్ర లో అసెంబ్లీ ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఉమ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిస శివసేనకు అది అందని ద్రాక్షాగానే మారింది. ఉప ముఖ్యమంత్రి పీఠం ఎక్కడ శివసేను ఇవ్వాల్సి వస్తుందోనని ముఖ్యమంత్రి దేవేంద్ర పెడ్నవిస్ ముందునుంచి వ్యూహాత్మకంగా పావులు కదిపారు. అటు శివసేనతో తమ మైత్రి కోనసాగుతుందని, వారితో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చే్స్తామని చెప్పిన ఆయన చివరకు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష వరకు అదే మాటకు కట్టుబడ్డారు. కానీ ప్రభుత్వంలో వారిని చేర్చుకోకుండా తాను మాత్రమే ముఖ్యమంత్రిగా, మరికోందరు బీజేపికి చెందిన నేతలను మంత్రలుగా ప్రమాణస్వీకారం చేయించి శివసేన లేకుండానే ప్రభుత్వం బలాన్ని నిరూపించుకుంటుందని పరోక్ష సంకేతాలు ఇచ్చారు.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలతో అప్పటి వరకు దూరంగా వుంచిన శివసేన చేతిని మళ్లీ అందుకుని ప్రభుత్వంలో భాగం కావాల్సిందిగా కోరారు. దీంతో అధికారంలో పాలు పంచుకోవడం కోసం ఎప్పటి నుంచో తహతహలాడుతున్న శివసేన ఎట్టకేలకు బీజేపి ఇచ్చిన పుష్పాన్ని అందుకుంది. అందుకు ఐదు క్యాబినెట్ ఐదు సహాయ మంత్రుల పోస్టులను కూడా పొందింది. కానీ ఎప్పటి నుంచో ఆశ పెట్టుకున్న ముఖ్యమంత్రి పదవి దక్కలేదు సరికాదా.. ఓటరు తీర్పుతో కళ్లు తెరుచున్న శివసేన ఉపముఖ్యమంత్రి పదవిపై పెట్టుకున్న ఆశలు కూడా దక్కలేదు. దీంతో ఈ పాతికేళ్ల మిత్రుల కలయిక సుస్థిరంగా మరో పాతికేళ్లు కోనసాగుతుందా..? కనీసం ఐదేళ్ల వరకైనా గ్యారంటీగా వుంటుందా..? లేక మధ్యలోనే తెగిపోతుందన్న అన్న సందేహాలు తెరమీదకు వస్తున్నాయి.

కనీసం హోం శాఖ మంత్రి, రెవెన్యూ, జలవనరులు వంటి కీలక శాఖలనైనా ఇస్తుందోమోనని ఆశగా చూసిన శివసేనకు ఆశాభంగమే ఎదురంది. అన్ని కీలక పదవులను బీజేపీ తమ వద్దే ఉంచుకుంది. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన శివసేన సభ్యులకు అంతగా ప్రాధాన్యత లేని శాఖలను కట్టబెట్టింది. ఇది కూడా వారి మైత్రి బంధం ఏన్నాళ్లు కొనసాగుతుందన్న సందేహానికి తావిస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maharastra  Devendra Fadnavis  portfolios  BJP  ShivSena  

Other Articles