Defence minister manohar parrikar was at a book launch when jawans were being killed in jammu and kashmir

Jammu militant attack, attack in Baramulla district, four serial attacks, America condemns attack, defense minister Manohar Parrikar, Jammu and Kashmir Elections 2014, Narendra Modi Government, JK millitant attack

Union Defence Minister Manohar Parrikar drew flak on Friday for attending a literature festival in Goa to release a book by a noted journalist, while the militants on Friday struck in a big way in Jammu and Kashmir.

కాశ్మీర్ పై ఉగ్రదాడి.. పుస్తకావిష్కరణలో రక్షణ శాఖ మంత్రి..

Posted: 12/06/2014 11:15 AM IST
Defence minister manohar parrikar was at a book launch when jawans were being killed in jammu and kashmir

జమ్మూకాశ్మీర్ సరిహద్దులో పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు మరోమారు ఉగ్రపంజాను విసిరారు. జమ్మూకాశ్మీర్ ప్రజలు భారత్ దేశ సార్వబౌమాధికారాన్ని కాపాడుతూ.. రికార్డు స్థాయిలో ఓటింగ్ లో పాల్టొంటున్న తరుణంలో.. ఉగ్రవాదులు ఈ ఘాతుకాన్నికి పాల్పడ్డారు. ఒకే రోజున 12 గంటల వ్యవధిలో వరుస క్రమంలో నాలుగు ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డారు. రాష్ట్రంలో కొన్ని చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా అసెంబ్లీ ఎన్నికలు సాగుతున్న తరుణంలో.. కాశ్మీరీలను భయభ్రాంతులకు గురి చేస్తూ కాల్పులకు తెగబడ్డారు.

వేకువ జామును 3 గంటల 10 నిమిషాలకు యూరి సెక్టార్ లో ప్రారంభమైన దాడులు.. ఆ తరువాత శ్రీనగర్, ట్రాల్ షోపియాన్ జిల్లాలోనూ చోటుచేసుకున్నాయి. ఈ దాడులలో ఒక లెఫ్టినెంట్ కన్నల్, జూనియర్ కమీషన్ అధికారి సహా 11మంది భద్రతా సిబ్బంది సహా మొత్తం 21మంది మృతి చెందారు.. జమ్మూకాశ్మీర్ లో ప్రజలు ప్రశాంతతను కోరుకుంటున్నామని, అందుచేతే ఓటింగ్ లో పాల్గొంటున్నామని స్పష్టం చేయడం.. దీనికి తోడు రికార్డు స్థాయిలో ఒటింగ్ నమోదు కావడంతో.. ఇక తమ ఆటలు సాగవని తెలుసుకున్న ముష్కరులు, ప్రత్యేకవాదుల సాయంతో దాడులకు తెగబడ్డారు. జమ్మాకాశ్మీర్ లో ప్రశాంతతను భంగం చేస్తూ.. ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. భారతీయ భద్రతా దళాలు జరిపిన కాల్పల్లో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.

ఎన్నికలను బహిష్కరించాలని తాము ఇచ్చిన పిలుపును లక్ష్య పెట్టకుండా కాశ్మీర్ వాసులు ఓటింగ్ లో పాల్గొనడంతో.. ప్రజలను భయాందోళనకు గురిచేయాలని ముష్కరులు ఈ దాడులకు తెగబడ్డారు. అది కూడా మరో మూడురోజుల్లో మూడోదశ ఎన్నికలు జరుగుతాయనగా ముష్కరులు కాల్పులతో బీభత్సం సృష్టించారు. అది కూడా ప్రధాని మోదీ రాకకు రెండు రోజుల ముందు.. తమ ఆధిపత్యాన్ని చాటి చెప్పేందుకు రక్తపాతం సృష్టించారు. ముష్కరులకు భారత భద్రతా దళాలు కూడా ధీటుగానే సమాధానం చెప్పాయి. బంకర్ లో నక్కిన ఉగ్రవాదులను ఏరివేశాయి.

యురిలో సైనిక శిబిరంపై జరిగిన దాడిలో 11మంది భద్రతా సిబ్బంది చనిపోగా, ఆరుగురు మిలిటెంట్లు హతమయ్యారు. శ్రీనగర్‌లో భారీ దాడులకు కుట్రపన్నిన ఇద్దరు లష్కరే తాయిబా మిలిటెంట్లు సౌరా ప్రాంతంలో భద్రతా దళాల కాల్పుల్లో హత మయ్యారు. షోపియాన్, ట్రాల్‌లలో ఉగ్రవాదులు గ్రనేడ్ దాడులు చేశారు. షోపియాన్ పోలీస్‌స్టేషన్‌పై గ్రనేడ్ దాడి ఘటనలో ఎవరూ గాయపడలేదు. ట్రాల్‌లో మాత్రం ఇద్దరు పౌరులు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. తొలిరెండు దశల ఎన్నికలు ప్రశాంతంగా జరిగి, ఓటింగ్ శాతం పెరగడంతో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని అంతా భావిస్తున్న తరుణంలో ఎవరూ ఊహించని విధంగా ఉగ్రవాదులు రెచ్చిపోయి కశ్మీర్‌లోయలో కల్లోలం సృష్టించారు.

కల్లోలం సృష్టించేందుకే: ప్రధాని మోదీ

ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలను అడ్డుకొనేందుకే జమ్ము కశ్మీర్‌లో కల్లోలం సృష్టిస్తున్నారని ప్రధానమంత్రి మోదీ అన్నారు. దాడుల్లో మరణించిన వీర జవాన్లను 125 కోట్ల మంది భారతీయులు గుర్తించుకుంటారని చెప్పారు. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటుండటాన్ని తట్టుకోలేకే ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ దాడులకు కారణం పాకిస్థానేనని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జమ్ము ప్రాంతంలోని రాజోరిలో ఎన్నికల ర్యాలీలో ఆరోపించారు. ఉగ్రవాదులకు పాక్ సాయమందిస్తున్నదన్నారు. ఎన్నికల సందర్భంగా అల్లర్లు సృష్టించాలన్న ఉద్దేశంతోనే దాడులు చేసి ఉండొచ్చని కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ ఢిల్లీలో శుక్రవారం చెప్పారు. పాక్ ఎన్నికల వేళ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారని జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఒకేరోజు నాలుగు దాడులు జరగడం దారుణమని శుక్రవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఉగ్రదాడులను ఖండించిన అమెరికా

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాద దాడులను అగ్రరాజ్యం అమెరికా ఖండించింది. ఉగ్రవాద నిరోధానికి భారత్ తో కలసి పోరాడుతామని అమెరికా ప్రకటించింది. భారత ప్రధాని మరో రెండు రోజుల్లో కాశ్మీర్ లో పర్యటించనున్న తరుణంలో ముష్కరులు దాడులకు తెగబడటాన్ని అక్షేపించింది. ఉగ్రవాద అంతానికి తాము కట్టుబడి వున్నామని భారత్ తో కలసి తీవ్రవాదులను అంతమోదిస్తమని స్పష్టం చేసింది. దేశ రక్షణకు ప్రాణాలర్పించిన జవాన్లకు, పోలీసు సిబ్బందికి అమెరికా సంతాపం వ్యక్తం చేసింది. కాశ్మీర్ అంశంలో తమ అనుసరిస్తున్న విధానాలలో మార్పు లేదని, అయితే ఉగ్రవాదాన్ని మాత్రం సహించబోమని అమెరికా తేల్చిచెప్పాంది. కాశ్మీర్ అంశంపై భారత్, పాకిస్థాన్ ఇరు దేశాలు సానుకూల చర్చల మధ్య పరిష్కిరించుకోవాలని అభిప్రాయపడింది.

కాశ్మీర్ లో కాల్పులు.. పుస్తకావిష్కరణలో రక్షణ మంత్రి

భారత దేశ రక్షణ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు గోవా ముఖ్యమంత్రి పదవిని త్యాజించిన కేంద్రమంత్రి మనోహర్ పారికర్ వ్యవహార శైలిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. భారత జవాన్లు తమ ప్రాణాలను ఒడ్డి దేశ రక్షణ కోసం కొడి కూతకు ముందు నుంచే పాటుపడుతుంటే.. సంబంధిత శాఖా మంత్రిగా వున్న మనోహర్ పారికర్ కు మాత్రం ఈ విషయం తెలిసిందా..? ఇంత పెద్ద ఎత్తున పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలోకి చోరబడి.. జవాన్లను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక ఘటనలకు పాల్పడుతుంటే పారికర్ ఎక్కడ వున్నారు..? ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

కోడి కూతకు ముందే ప్రారంభమైన కాల్పులతో కాశ్మీరం.. ఆ తరువాత ఏకంగా భారతావని ఉల్లిక్కి పడుతుంటే.. కేంద్ర రక్షణ శాఖా మంత్రి మాత్రం గోవాలో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గోనడం అయనపై విమర్శలకు తావిస్తోంది. పారికర్ లోని నిజాయితీ, నిబద్దతను చూసి ఏరి..కోరి ఆయనకు దేశ రక్షణ భాద్యతలను అప్పటిస్తే.. పారికర్ ఒక ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ రాసిన పుస్తకాన్ని అవిష్కరించేందుకు గోవాలో పర్యటించడం వివాదాస్పదం కానుంది. గతేడాది పాట్నాలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో అప్పటి కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే... బాలివుడ్ మ్యూజిక్ అవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడాన్ని తీవ్రంగా తప్పబట్టిన బీజేపి.. ఇప్పడు అదే తప్పులను పునరావృతం చేస్తే.. మార్పు ఏలా సాధ్యమని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే ఈ విషయమై అనేక మంది నెట్ జనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మనోహర్ పారికర్ నిర్లక్ష వైఖరిపై వారు విమర్శలు గుప్పిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America  jammu and kashmir  militant attack  

Other Articles