First phase crop loan waive from december 10 says chandrababu

chandrababu naidu, AP Government, chief minister, crop loan waive, official statement, ys jagan, ysrcp, chandrababu naidu, pressmeet, loan weiver, Andhra pradesh

first phase crop loan waive from december 10 says chandrababu, oppositions alleges government turned plate

రుణమాఫీ విధాన ప్రకటనపై టీడీపీ హర్షం.. విమర్శించిన విపక్షం

Posted: 12/04/2014 08:51 PM IST
First phase crop loan waive from december 10 says chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీపై చేసిన విధాన ప్రకటనపై పలువరు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. గత పదేళ్లుగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అందుకనే రుణవిముక్తి కోసం రుణమాఫీ అమలు చేస్తున్నామని ప్రకటించారు. రైతుల ఆత్మహత్యలు ఆగాలని.. ప్రతి రైతు తలెత్తుకుని తిరగాలని అన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా ఇచ్చిన హామీకి కట్టుబడి రుణమాఫీ అమలు చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. రుణ విముక్తిపై కోటయ్య కమిటీ ఆధ్వర్యంలో నివేదిక రూపొందించామని, రైతు రుణవిముక్తి పథకం కోసం జీవో కూడా జారీ చేశామని తెలిపారు.

కుటుంబానికి రూ. 1.5 లక్షల పంటరుణాల మాఫీ చేస్తామని చెప్పామన్నారు. బ్యాంకర్ల నుంచి సమాచారం కోసం ఎంతో కసరత్తు చేశామని తెలిపారు. బ్యాంకుల సమాచారంతో ఆధార్, రేషన్‌కార్డులను అనుసంధానం చేశామని పేర్కొన్నారు. రేషన్ కార్డులు లేని వారి సమాచారం మళ్లీ సేకరించి సవరించామన్నారు. గ్రామ కమిటీల ద్వారా లబ్ధిదారులను క్రోడీకరించి జాబితాలు తయారు చేశామని, ఇప్పటివరకు అన్ని ఆధారాలు సమర్పించిన రైతుల జాబితాలు రూపొందించినట్లు వెల్లడించారు. అన్ని ఆధారాలు సమర్పించిన వారికి రుణ విముక్తి చేస్తున్నామని ప్రకటించారు.

ఈ నెల 6న రుణవిముక్తి లబ్ధిదారుల తొలి జాబితా ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు. రుణ మాఫీ అర్హుల జాబితాను ఆన్‌లైన్లో పెడుతున్నామని వివరించారు. రుణ మాఫీ అర్హుల జాబితాను ఆన్‌లైన్లో పెడుతున్నామని వివరించారు. రూ.50 వేల లోపు రుణ విముక్తి అయిన రైతులకు లేఖలు పంపుతున్నామని చెప్పారు. జన్మభూమి గ్రామ సభల్లో జాబితాలు చదివి వినిపిస్తారన్నారు. డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకు రెండో విడత జాబితా పరిశీలన ఉంటుందన్నారు. రెండో విడత జాబితాలో రైతులకు జనవరి 14 నుంచి 22 వరకు తుది చెల్లింపు చేస్తామని ప్రకటించారు. జనవరి 22 లోపు అన్ని జాబితాల రైతులకు రుణవిముక్తి లభిస్తుందని వెల్లడించారు.

ఎన్నికలు అయిన తర్వాత ప్రజలతో పనిలేదని అన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికలు ముగియగానే ఆయన ప్లేటు ఫిరాయించారని విమర్శించారు. మొట్టమొదటిగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టిన దాంట్లో ప్రధానపాత్ర చంద్రబాబుదేనన్నారు. పార్లమెంటులో తన ఎంపీల చేత తానే ఓటు వేయించిన ఘటన బాబుదని దుయ్యబట్టారు. సీమాంధ్రకు, తెలంగాణకు చంద్రబాబు వేర్వేరుగా మేనిఫెస్టోలు ప్రకటించారని గుర్తుచేశారు. తన మేనిఫెస్టోలో తానే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ అని ప్రకటించారు.

ఏప్రిల్ 11న చంద్రబాబు ఈసీకి రాసిన లేఖలో రెండో లైన్లోనే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని పేర్కొన్నారు. ఆరోజు ఆయన అన్నది పంట రుణాలు కాదు, వ్యవసాయ రుణాలేనని గుర్తు చేశారు. ప్రధాని మోదీగారితో కలిసి చంద్రబాబు పక్కనే ఉన్న కరపత్రాలు చాలా విడుదల చేశారు. ఇందులో మొట్టమొదటి పాయింటే..వ్యవసాయ రుణాల మాఫీ. ఇక రెండోది డ్వాక్రా రుణాల మాఫీగా వుందని వాటిని చూపారు. అధికారంలోకి వచ్చిన తరువాత తాను వ్యవసాయ రుణాలని అని చెప్పలేదని, కేవలం పంట రుణాలని మాత్రమే చెప్పానని పేట్లు పిరాయించారని జగన్ దుయ్యబట్టారు. 2014 మార్చి నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లుగా వున్నాయి

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles