Another snake gang pretends like moral police and then rape caught in city outskirts

another snake gang, moral police, rape, city outskirts, sanghi Temple, Hayathnagar, photos, internet, crime against women, violence on women, crime, gang rape, Nude scenes

another snake gang pretends like moral police and then rape, caught in city outskirts

మోరల్ పోలీసింగ్ @ సామూహిక అత్యాచారం..

Posted: 12/04/2014 05:31 PM IST
Another snake gang pretends like moral police and then rape caught in city outskirts

రాజధానిలో మరో దారుణం చోటు చేసుకుంది. నగరంలో మహిళలపై స్నేక్ గ్యాంగ్ దురాగతాలు మరచిపోక ముందే శివార్లలో ఇలాంటి దారుణమే మరోటి చోటుచేసుకుంది. ఢిల్లీలో నిర్భయ ఘటన తరహాలో... స్నేహితుడితో కలిసి సంఘీ ఆలయానికి వెళ్తున్న ఓ యువతిపై మృగాళ్లు పైశాచికత్వం ప్రదర్శించారు. బెదిరించి మరీ సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. నగర శివార్లలోని హయత్ నగర్ పెద్దఅంబర్‌పేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నగరానికి చెందిన 22 ఏళ్ల యువతి... తన స్నేహితునితో కలిసి ఆ ప్రాంతానికి వచ్చింది. వారిద్దరే ఉండటాన్ని గమనించిన శ్రీనివాసరెడ్డి, లింగారెడ్డి అనే యువకులు వారి వద్దకు వెళ్లారు.

తాము పోలీసు ఇన్ఫార్మర్లమని చెప్పి అటకాయించారు. పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లారు. నిర్మానుష్య ప్రాంతం కావడంతో అటుగా ఎవరూ రారని నిర్ధారించుకున్న దుండగులు... ఆ యువకుడిని కొట్టి, ఆమె స్నేహితురాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అనంతరం ఆమె నుంచి ఫోన్ నంబరు తీసుకున్నారు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న చిత్రాలను మొబైల్ లో వీడియో తీశామని, అదీకాక అకృత్యాల దృశ్యాలను కూడా షూట్ చేశామని చెప్పారు. తాము ఎప్పుడు పిలిచినా రావాలనీ... లేకుంటే తమ మొబైల్ లో వున్నా చిత్రాలను ఇంటర్ నెట్ లో అప్ లోడ్ చేస్తామని బెదింరించారు. పోలీసులకు చెబితే చిత్రాలను బయటపెట్టి పరువు తీస్తామని గట్టిగా హెచ్చరించారు.

వారి తీరుతో తీవ్ర భయాందోళనలకు గురైన యువతీ పోలీసులను ఆశ్రయించకుండా ఇంటికి వెళ్లింది. పోయారు. ఆ మరుసటి రోజే యువతికి ఫోన్‌చేసి తమ దగ్గరికి రావాలని బెదిరించారు. నిందితుల నుంచి వరుసగా ఫోన్ కాల్స్ రావడంతో ఆమె హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై ఏసీపీ బాస్కర్ స్పందించారు. ఆ జంట ఏకాంతంగా ఉన్న సమయంలోనే ఇద్దరు వ్యక్తులు వారిని సెల్ ఫోన్ లో చిత్రీకరించిన అనంతరం బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. ఈ క్రమంలోనే ఆ యువతి కూడా వచ్చిన యువకుడు పారిపోయాడని తెలిపారు. దీంతో ఇద్దరు నిందితులు అత్యాచారానికి ఒడిగట్టారన్నారు.

తొలుత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడిందని.. ఆ తరువాత ఆమె ఫిర్యాదుతోనే కేసు నమోదు చేశామన్నారు. ఆ నిందితుల నుంచి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రస్తుతం సెల్ ఫోన్ ను ఫోరెనిక్స్ ల్యాబ్ కు పంపామని.. ఆ నివేదిక వచ్చాక చార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు. ఆ నిందితులు పెద్ద అంబర్ పేటకు చెందిన వెల్డర్ నల్లబోను శ్రీనివాస్ రెడ్డి, మెకానిక్ బండి లింగారెడ్డిలుగా గుర్తించామన్నారు. వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని ఏసీపీ భాస్కర్ తెలిపారు.

‘మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మా కోరిక తీర్చాలి, లేకుంటే నీ ఫొటోలు ఇంటర్‌నెట్‌లో పెడతాం’ అని బెదిరించారు. నిందితులిద్దరినీ పెద్దంబర్‌పేటకు చెందినవారిగా గుర్తించారు. ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఫోన్‌లో చిత్రీకరించిన దృశ్యాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వీటిని ఎవరికైనా పంపారా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధిత యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles