World most aged saint 170 years old hanuman das baba story

hanuman das baba, hanuman das baba age, hanuman das baba history, hanuman das baba biography, hanuman das baba life history, world most aged persons, world aged man and woman, indian preists, indian saints powers, naga saints, saints in himalaya, latest news updates

world most aged saint 170 years old hanuman das baba story : hanuman das baba with his 170years age become wolrd most aged saint still living in vrindavan, localities of vrindavan treats hanuman das baba as a holy saint and wents to his home often for blessings

పుణ్యభూమిలో పుట్టిన 170 ఏళ్ల మహాసాధువు

Posted: 12/03/2014 12:10 AM IST
World most aged saint 170 years old hanuman das baba story

ప్రపంచంలో భారత దేశమంత పవిత్ర, పుణ్యభూమి మరొకటి లేదు. ప్రపంచ ఉద్దరణకు దోహదం చేసిన ఎందరో మహానుభావాలకు జన్మనిచ్చిన ఘనత దేశానిది. మత ఆచారాలు, సాంప్రదాయాలతో ప్రపంచంలోనే భారత్ ప్రత్యేక గుర్తింపు పొందింది. టెక్నాలజీ, సంస్కృతి దేశానికి బొమ్మ బొరుసుగా ఉన్నాయి. పవిత్ర దేశంలో సాధువులు, సన్యాసులు, రుషులు ఇప్పటికీ ఉన్నారు. అలాంటి సాధువుల్లో హనుమాన్ దాస్ బాబా ఒకరు. అరవై ఏళ్లు బ్రతకటం అంటే గొప్పగా భావిస్తున్న ఈ తరుణంలో.. ఈ బాబా ఏకంగా 170 సంవత్సరాలు బ్రతికారు. ఇప్పటికీ జీవించి ఉన్న ఈ బాబా జీవిత విశేషాలు తెలుసుకుందాం.

బృందావనంలో ఉండే హనుమాన్ దాస్ బాబా వయస్సు గురించి స్పష్టంగా చెప్పలేడు. అయితే ఝాన్సి రాణి యుద్దం చేసిన సమయంలో (1857) తనకు 12 సంవత్సరాలుగా గుర్తున్నట్లు చెప్తున్నాడు. తన తల్లి ఝాన్సిరాణి దగ్గర పనిచేసేదని కూడా వెల్లడించాడు. ఇక యుక్త వయస్సులో ఉండగా కృష్ణుడి భక్తుడిగా మారాలనే ఉద్దేశ్యంతో బృందావనంకు చేరుకున్నాడు. అక్కడ గోశఆలను స్థాపించి వాటి ఆలనా పాలనా చూడటం మొదలు పెట్టాడు. నాడు స్థాపించని ఈ గోశాలలో ప్రస్తుతం వెయ్యి ఆవులున్నాయి.

క్రిష్ణ బలరామ మందిర్ సమీపంలోని బృందావన్ పరిక్రమ పథ్ ఆశ్రమంలో చిన్న గది ఈయన ఇళ్ళు. ఒక మనిషికి కూడా పూర్తిగా సరిపోని ఇంట్లోనే జీవిస్తున్నాడు. బృందావనంకు వచ్చే భక్తులు, యాత్రికులు ఈయన గురించి తెలిసినవారు చూడకుండా వెళ్లరు. దేవుడి సేవకే జీవితం అంకితం ఇచ్చిన హనుమాన్ దాస్ బాబాను స్థానికులు పవిత్ర సాధువుగా గౌరవించి, ఆశీర్వాదాలు తీసుకుంటారు. వృద్దాప్యంలో అందర్లాగే నోట్లోని అన్ని పళ్లు ఊడిపోవటంతో పాటు తిరిగి వచ్చాయి. ఇప్పటికీ పూర్తి ఆరోగ్యంగా ఉన్న హనుమాన్ దాస్ బాబా.., హరే రామ హరే కృష్ణ మంత్రం పఠించనిదే కాలు కదపరు, నిద్ర పోరు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hanuman das baba  old age  saint  india  latest news  

Other Articles