Delhi crime news 6 years boy ganesh died iphone mobile controversy fruit seller son police investigation

delhi crime news, iphone controversy, 6 years old boy ganesh died, iphone 6 years boy ganesh died, delhi police investigation, delhi juvenile court, delhi parks, fruit seller son ganesh died, iphone mobile controversy, iphone mobile news

delhi crime news 6 years boy ganesh died iphone mobile controversy fruit seller son police investigation

ఐఫోన్.. ఆరేళ్ల బాలుడి ఆయుష్షును మింగేసింది!

Posted: 12/01/2014 05:32 PM IST
Delhi crime news 6 years boy ganesh died iphone mobile controversy fruit seller son police investigation

విశ్వవ్యాప్తంగా ‘ఐఫోన్’ క్రేజీ ఎంతమేరకు వుందో అందరికీ తెలిసిందే! చిన్నపిల్లల నుంచి పెద్ద వయస్కులవారు ఈ మొబైల్ ఫోన్’ను కొనుగోలు చేసుకోవడం కోసం వెంపర్లాడుతున్నారు. అలాంటి ఈ ఐఫోజ్ మోజు ఓ ఆరేళ్ల పిల్లాడి ప్రాణాన్నే బలితీసుకుంది. నిజానికి ఆ పిల్లాడికి, ఐఫోన్’కి ఎటువంటి సంబంధం లేదు. అసలు విషయమేంటో మేటర్’లోకెళ్లి తెలుసుకుందాం!

సెంట్రల్ ఢిల్లీలోని రంజిత్‌నగర్‌కు చెందిన ఓ పండ్ల వ్యాపారి ఆరేళ్ల కొడుకు గణేష్ ఆడుకోవడానికి ఇంటినుంచి బయటికెళ్లాడు. అంతే! ఆ బాలుడు ఎంతకీ తిరిగి ఇంటికి రాలేదు. దాంతో అతని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో వుండగా.. సాయంత్రానికి వాళ్లకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. గణేష్‌ని కిడ్నాప్ చేశామని, విడిచిపెట్టాలంటే లక్షన్నర రూపాయలు ఇవ్వాలని కిడ్నాపర్ తెలిపాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని గణేష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసుల స్పందించి రంగంలోకి దిగేసరికి దారుణం జరిగిపోయింది. సదరు కిడ్నాపర్ ఆ అబ్బాయిని చంపేసి, శవాన్ని ఓ పార్క్’లో పడేసి వెళ్లిపోయాడు.

గణేష్ మృతదేహాన్ని కనుగొన్న అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వేగంగా తమ విచారణను ముగించేశారు. బాలుడు మృతిచెందడానికి ముందు ఎవరితో ఉన్నాడనే విషయంపై ఖాకీలు తమదైన శైలిలో దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యాపారి ఇంటి సమీపంలోనే వుంటున్న ఇంటర్ చదివే 17 యువకుడితో గణేష్ చివరిసారిగా ఆడినట్లు వాళ్లు గుర్తించారు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అందరూ విస్తుపోయే సమాధాన్ని తెలిపాడు. తనకు ఎప్పటి నుంచో ఐఫోన్ కొనుక్కోవాలని ఉండేదని, ఆ కోరిక తీర్చుకోవడం కోసమే గణేష్‌ని కిడ్నాప్ చేసి లక్షన్నర డబ్బులు డిమాండ్ చేశానని పేర్కొన్నాడు. అయితే వ్యవహారమంతా ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో గణేష్’ని హతమార్చానని ఒప్పుకున్నాడు. ఆ యువకుడ్ని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కి తరలించారు. ఇలా ఈవిధంగా ఒకరి ఐఫోన్ మోజు కోసం అనవరసరంగా ఆరేళ్లబాలుడు బలైపోయాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : iphone  6 years old boy ganesh  fruit seller son  delhi crime news  telugu news  

Other Articles