Dera sacha sauda sect has come under scanner

Dera Sacha Sauda baba arrest, Dera Sacha Sauda ashram, Dera Sacha Sauda latest news, Dera Sacha Sauda allegations, ramphal baba case, rape and murder allegations on Dera Sacha Sauda, haryana court on Dera Sacha Sauda, haryana court on baba, duplicate baba's in india, latest news updates

Dera Sacha Sauda sect has come under the scanner : after ramphal baba Haryana High Court says that activities of the Sirsa-based sect should be monitored periodically by the top brass of Haryana, including government and police.

ఆ బాబా జైలుకెళ్తే.., ఈ బాబా టార్గెట్ అయ్యాడు

Posted: 12/01/2014 04:22 PM IST
Dera sacha sauda sect has come under scanner

వివాదాస్పద బాబా రాంపాల్ హర్యానా జైలులో ఊచలు లెక్కపెడుతుండగా.., పోలిసులు మరో బాబాను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. హర్యానా హైకోర్టు ఆదేశాల ప్రకారం, డేరా సచ్చా సౌధ మతాధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ పై పోలిసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం (నవంబర్ 28)న రాంపాల్ కేసు విచారణ సందర్బంగా, డేరా బాబా కదలికలపై నిఘా పెట్టాలని ప్రభుత్వం, పోలిసులను ఆదేశించింది. ప్రత్యేకించి బాబా సన్నిహితులు, ముఖ్య వ్యక్తుల కదిలికలపై దృష్టి సారించాలని.., ఆశ్రమంలో తనిఖీుల జరపాలని స్పష్టం చేసింది. రాంపాల్ ఆశ్రమంలో శక్తివంతమైన ఆయుధాలు లభించిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా సోదాలు చేయాలని ఆదేశించింది. దీంతో తర్వాతి టార్గెట్ డేరా బాబా అని స్పష్టం అవుతోంది.

ఓ మాజి ఆర్మీ ఉన్నతాధికారి డేరా బాబా ఆశ్రమంలో ప్రైవేటు కమెండోలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు, వీరి వద్ద అక్రమంగా భారీ ఎత్తున ఆయుధాలు ఉన్నట్లు కోర్టు దృష్టికి రావటంతో సోదాలు చేయాలని ఆదేశించింది. గతంలో గుర్మీత్ పై అత్యాచారం, హత్యారోపణలు వచ్చిన విషయం గుర్తు చేస్తూ నిఘా పెట్టాలని స్పష్టం చేసింది. హత్య నేరంలో గుర్మీత్ రామ్ రహీమ్ పై ఐపీసీ సెక్షన్ 302, రేప్ కేసులో ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం అభియోగాలు ఎదుర్కుంటున్నారు. ఈ రెండు అభియోగాలు రుజువయితే జీవిత ఖైదు వంటి కఠిన శిక్ష పడే అవకాశం ఉంది.

దేశంలో దొంగ స్వామీజీలకు కొదువేలేదు. భక్తుల అమాయకత్వం, గుడ్డి నమ్మకాలను క్యాష్ చేసుకునేందుకు మాయమాటలు చెప్పి మోసం చేసే బాబాలు, స్వామిజిలు ఊరికొకరు పుట్టుకొస్తున్నారు. వీరిపై అప్పుడప్పుడూ పోలిసులు దాడులు చేసి అరెస్టు చేస్తుండగా.. కొన్ని సమయాల్లో ఇలా కోర్టులు కూడా జోక్యం చేసుకుని ఆటకట్టిస్తున్నాయి. అయితే కొందరు బాబాలకు రాజకీయ అండదండలు ఉండటంతో వారిని ఎవరూ ఏమి చేయలేకపోతున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి. బాబాల కంటే ముందు వారి వెనక ఉన్న బడాబాబులకు బడితపూజ చేయాలి అని ప్రజలు భావిస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dera Sacha Sauda  ramphal baba  gurmeet ram rahim  haryana high court  latest news  

Other Articles