Doordarshan anchor s governor of india video from iffi goa goes viral on social media

Doordarshan, anchor, 'Governor of India' IFFI Goa, viral, social media, Prasar Bharti, officials,

Doordarshan anchor's 'Governor of India' video from IFFI Goa goes viral on social media, Prasar Bharti asks officials to look into it

తప్పులతో ‘దూర’మవుతున్న ‘దర్శన్’

Posted: 11/29/2014 03:52 PM IST
Doordarshan anchor s governor of india video from iffi goa goes viral on social media

దూరదర్శన్ గత తరానికి వున్న ఏకైన వార్త వీక్షణ స్రవంతి. ప్రారంభం నుంచి ఏకచక్రాధిపత్యాన్ని అనుభవించి.. కొడితే దూరదర్శన్ లోనే ఉద్యోగం కోట్టాలి అనేలా చేసిన దూరదర్శన్.. ఈ తరంలో అనేక అటుపోట్లను ఎదుర్కొంటోంది. ఒక వైపు పాత కాలపు కార్యక్రమాలతో ఆదరణను నోచుకోకపోవడం.. చూసే కొద్ది మందికి తప్పడు సమాచారం అందించడంతో దూర్శదర్శన్ పేరు చెప్పగానే ప్రజలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. శాంతి స్వరూప్, రోజా రమణి వంటి న్యూస్ రీడర్లు తెరపై చెప్పే వార్తలను తీక్షణంగా చూసి.. ఆదరించిన చోటే.. ప్రస్తుత న్యూస్ రీడర్లు, యాంకర్ తప్పడు సమాచారంతో వీక్షకులు బెంబేలెత్తిపోతున్నారు.

తాజాగా, గోవాలో ఈ నెల 20 నుంచి జరగుతున్న అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆప్ ఇండియాలో ముగింపు ఉత్సవాలకు రెండు రోజుల ముందు ప్రత్యక్ష ప్రసారంలో 'గవర్నర్ ఆఫ్ ఇండియా'- అంటూ దూరదర్శన్ యాంకర్ నోటి నుంచి జాలువారిన మాట. అంతేకాదు మహిళా గవర్నర్ ను 'అతడు' గా సంబోధించిడంతో మరోసారి దూరదర్శన్ కు తలనొప్పి తెచ్చిపెట్టింది. ప్రసారభారతిని చిక్కుల్లో పడేసింది. వేదికపైనున్న అతిధులను పలకరిస్తూ.. లైవ్ కవరేజ్ చేస్తున్న దూరదర్శన్ యాంకర్ అటుగా వచ్చిన గోవా గవర్నర్ మృదులా సిన్హాను చూసి... 'గవర్నర్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. ఆయన అభిప్రాయాలు మనతో పంచుకుంటారు' అని వ్యాఖ్యానించింది.

ఈ వీడియా సోషల్ మీడియాకు ఎక్కడంతో దూరదర్శన్ పై విమర్శలు రేగాయి. అయితే పొరపాటును సరిచేసి నాలుగు నిమిషాల తర్వాత పునఃప్రసారం చేశామని డీడీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జరిగిన తప్పుకు గల కారణాలు తెలుసుకునేందుకు ఏడీజీ స్థాయి అధికారిని ఆదేశించినట్టు చెప్పారు. 'గవర్నర్ ఆఫ్ ఇండియా' వ్యాఖ్య చేసిన యాంకర్ కాంట్రాక్టు ఉద్యోగిని అని వెల్లడించారు. అయితే కాంట్రాక్టు పద్దతిలో కొత్తవారిని తీసుకుని ఎక్స్ పరిమెంట్ చేయడంతోనే ఈ తప్పలు జరుగుతున్నాయని, గవర్నర్ వంటి స్థాయి వ్యక్తులను చూడగానే వారు ఏం చేస్తున్నారో..? ఎలా మాట్లాడుతున్నారో తెలియకపోవడం కూడా ఇందుకు ఓ కారణంగా ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇంతకుముందు కూడా దూరదర్శన్ కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పేరులోని ఎక్స్ఐ(XI)ని రోమన్ సంఖ్య అనుకుని ఓ యాంకర్ ఎలెవన్ గా పలకడంతో డీడీపై విమర్శలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయనకు సంబంధించిన వార్తలు చదువుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంబంధించిన దృశ్యాలు ప్రసారం చేసి ప్రసారభారతి అభాసుపాలైంది. కాగా రాజ్ దీప్ సర్దేశాయ్, సాగరిక ఘోష్, బుర్ఖా భట్ లకన్నా ఈ యాంకర్ చేసింది పెద్ద తప్పిదమేమీ కాదంటూ పలువురు కామెంట్ చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Doordarshan  anchor  'Governor of India' IFFI Goa  viral  social media  Prasar Bharti  officials  

Other Articles