Aicc general secretaty digvijay singh slams telangana cm kcr on defections

AICC general secretaty, Telangana congress party Incharge, Digvijay singh, slams, telangana CM KCR, Defections, Shamshabad Airport, domestic terminal, NTR name, Court

AICC general secretaty Digvijay singh slams telangana CM KCR on Defections

ఎన్టీఆర్ పేరు, ఫిరాయింపులపై కోర్టులో తేల్చుకుంటాం..

Posted: 11/23/2014 06:14 PM IST
Aicc general secretaty digvijay singh slams telangana cm kcr on defections

శంషాబాద్ ధేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టే అంశంపై న్యాయస్థానంలో తేల్చుకుంటామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఒకే టెర్మినల్ కు, ఒకే బిల్డింగ్ కు రెండో పేరు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు.  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లో నిర్వహించిన మైనారిటీ సమ్మేళనంలో దిగ్విజయ్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేల ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ అంశంపై కూడా కోర్టుకు వెళతామన్నారు. ఫిరాయింపు నిరోధక పిటిషన్ లను స్పీకర్లు, ఛైర్మన్లు గడువులోగా పరిశీలించేలా చట్టాన్ని సవరించాలన్నారు.
 
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎంఐఎం సమర్ధిస్తోందని దిగ్విజయ్ విమర్శించారు. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వాస పరీక్షకు ఎంఐఎం దూరంగా ఉండి బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలిపిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీని గెలిపించేందుకు అక్కడ ఎంఐఎం పోటీ చేసే యోచనలో ఉందన్నారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకూ నేతలంతా ఓటు హక్కు ఉన్న పోలింగ్ బూత్ లోనే సభ్యత్వ నమోదు నిర్వహించాలన్నారు.

వైల్డ్ లైప్ ఫోటో గ్రఫీ అంటే ఇష్టం..

తనకు వైల్డ్ ఫోటో గ్రఫీ అంటే ఇషమని రాష్ర్ట ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. మీడియా ముందు తన మనసు విప్పి పలు ముచ్చట్లు పంచుకున్నారు. వన్య ప్రాణుల సంరక్షణే.. తన ఫోటోగ్రఫీ ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రతి ఒక్కరూ అడవులను కాపాడగలిగితే వన్యప్రాణులను కాపాడుకోగలమని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ వెంకట్ ఫోటో గ్రఫీలో తనకు గురువని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles