మహారాష్ట్ర దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం తలమానికంగా వున్న రాష్ట్రం.. తొలిసారిగా ఇక్కడ బీజేపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాలన సాగించేందుకు ఇక్కడ గత అనుభవాలు ఆ పార్టీ నేతలకు లేవు, అంతేకాదు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దేవేంద్ర ఫెడ్నవిస్ కూడా యువ కిశోరమే. అతనికి ప్రభుత్వా పాలనను చేపట్టే సామర్థ్యమున్నా, వైరి పక్షాలను మిత్రపక్షాలుగా మార్చుకోవడంలో అనుభవం లేదు. యువకుడిగా దూసుకుపోయే నైజం వున్నా.. మైనారిటీ ప్రభుత్వాన్నినడిపేందుకు అవసమైన శక్తియుక్తులున్నాయా..? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు జరిగిన తరువాత, పాలన సాగుతున్న తరువాత కూడా ఈ ప్రశ్నలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయో తెలుసా..? మహారాష్ట్రలో ఉన్నది మైనారిటీ ప్రభుత్వం కాబట్టి.
మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు రాగానే నాలుగో స్థానంలో వున్నామని తెలుసుకున్న శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ.. ప్రభుత్వానికి బేషరుతుగా బయటి నంుచి మద్దతు ఇస్తామని స్వచ్చంధంగా ప్రకటించింది. ఇందుకు కారణాన్ని కూడా తెలిపింది. ఎన్నికలు జరిగిన కొన్ని రోజుల్లోనే మళ్లీ ఎన్నికలు వస్తే అది రాష్ట్రానికి, ప్రజలకు, రాజకీయ పార్టీలకు కూడా మంచి కాదని స్పష్టం చేసింది. అందుకనే తాము బీజేపి పార్టీకి మద్దతునిస్తున్నామని ప్రకటించింది. అర్ఎస్ఎస్ సహా బీజేపి ముఖ్యనేతలు ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని బాహాటంగానే వెల్లడించారు.
పాత మిత్రపక్షం శివసేన మద్దతు తీసుకుని మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపికి.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అప్పుడే చెప్పింది. ప్రమాణ స్వీకారం చేసే నాటికి అరుణ్ జైట్లీ సహా పలువురు కేంద్రమంత్రులు కూడా శివసేనతో కలిసే ముందుకెళ్తామని ప్రకటించారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ సహా పలువరు నేతలు మాత్రం.. మరో అడుగు ముందుకేసీ ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని పోరబాటున కూడా ఏర్పాటు చేయబోమని ప్రకటించారు. గత పదిహేను ఏళ్లుగా అధికారంలో వున్న ఎన్సీపీ పలు అవినీతి, అక్రమాలకు పాల్పడిందని, ఇప్పుడు ఆ పార్టీతో ఎలా జతకడతామని ఎదురు పశ్నించారు. వారి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అవినీతి కేసుల అరోపణలు తమకు అంటుకుంటాయని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఎన్సీపీతో పొత్తు పెట్టుకుంటే తమను అధికారంలో చూడాలని అతిపెద్ద పార్టీగా అవతరింప జేసిన ఓటర్లతో పాటు, తమను కూడా అవమానపరుచుకున్నట్లేనని జావదేకర్ అభిప్రాయపడ్డారు.
అయితే మహారాష్ట్ర ఎన్నికలకు ముందు శివసేన ఎత్తులు, పై ఎత్తులు వేసి చివరకు చిన్న పార్టీలకు తగు సంఖ్యలో సీట్లను కేటాయించకపోవడంతో.. పాతికేళ్లుగా వున్న మైత్రి ఒక్కసారిగా విఛ్చినమైంది. శివసేన, బీజేపి పార్టీలు ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగాయి. ఎన్నికలలో అతిపెద్ద పార్టగా అవతరించిన బీజేపికి కేవలం పన్నెండు స్థానాలు.. సొంతంగా ప్రభుత్వ ఏర్పాటును దూరం చేశాయి. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న బీజేపి.. శివసేన షరుతులకు తలగ్గవద్దని భావించి అయితే అప్పటి పరిణామాలను గుర్తు పెట్టుకున్న, బీజేపి మైండ్ గేమ్ ఆడింది. శివసేనకు ప్రభుత్వంలో చేర్చుకోకుండానే.. అధికార పీఠాన్ని అధిరోహించింది. పది మంత్రి పదవులతో పాటు ఉప ముఖ్యమంత్రి పీఠాన్ని డిమాండ్ చేసిన శివసేనకు రిక్తహప్తాన్ని చూపింది.
బీజేపి పరిణమాలను నిశితంగా గమనించిన శివసేన.. పరిస్థితిని ముందుగానే అంచనా వేసింది. తమ పార్టీ శాసనసభ్యుడు ఏక్ నాథ్ షిండేకు ప్రతిపక్షనేత హోదా కల్పించాలని మహారాష్ట్ర స్పీకర్ హరిబాహు బగాడేకు లేఖను రాశారు. తమ పార్టీకే ప్రతిపక్ష హోదాను కల్పించాలని లేఖకో కోరారు. అధికారంపై ఆశలు వదులుకున్న శివసేన ప్రతిపక్షంలో కూర్చుకునేందుకు సిద్దమైంది అయినా ప్రభుత్వంలో చేరాలని శివసేనకు.. బీజేపి నుంచి ఎలాంటి అహ్వనం అందలేదు. దీంతో బీజేపిపై ఆ పార్టీ పత్యక్షంగానే పలు ఆరోపణలు సందించింది.
హిందూ తీవ్రవాదం అన్న పదాన్ని తొలి సారి వాడింది శరద్ పవారే నని, అలాంటి పవార్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏలా నడుపుతారని ప్రశ్నించింది. అంతేకాదు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు, మరో మారు ఎన్నికలు వచ్చేందుకు కారణమైన నేషనల్ కాంగ్రెస్ పార్టీతో జతకట్టి ఆ మహానేతను అవమానిస్తారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపింది. అధికారంలో వుంటూ అవినీతి అక్రమాలకు పాల్పడిన ఎన్సీపీ.. ఆ కేసులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకే బీజేపి మద్దతునిస్తుందని విమర్శలు గుప్పించింది. శివసేన అరోపణలపై మౌనం వహించిన బీజేపి.. చిట్టచివరకు ఎన్సీపీ మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
కానీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత నెల రోజులు కూడా గడవక ముందే మరో జలక్ ఇచ్చింది. మహారాష్ట్ర విధాన సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోని పది రోజుల గడవక ముందే బీజేపి ప్రభుత్వానికి ఎన్సీపీ గట్టిగా జలక్ ఇచ్చింది. ఇప్పుడప్పుడే మరోసారి ఎన్నికలు వస్తే మంచిది కాదనే బీజేపికి మద్దత్తు ఇచ్చామని చెప్పిన ఎన్సీపి.. మహారాష్ట్రలో తొలిసారిగా కొలువుదీరిన బీజేపి ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని జలక్ ఇచ్చింది. ఈ వ్యాఖ్యాలు చేసింది కూడా ఎవరో సాధరాణ పార్టీ ఎమ్మెల్యే, నాయకుడో కాదు ఏకంగా అధినేత శరద్ పవారే ఇలా వ్యాఖ్యానించేసరికి బీజికి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది.
ఫడణవిస్ సర్కారు ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని రాయగఢ జిల్లాలోని అలీబాగ్ లో జరిగిన ఎన్సీపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో అనుమానాలను వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావొచ్చని పేర్కొన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎన్సీపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. శరద్ పవార్ ప్రకటనతో మహారాష్ట్ర బీజేపి వర్గాలు షాక్ కు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీని పట్టుకుని ప్రభుత్వాన్ని నడపటం కష్టమని భావించిన బీజేపి శివసేనకు స్నేహ హస్తాన్ని అందించేందుకు సిద్దమైంది.
బుగ్గ గిల్లిన తరువాత నొప్పిగా వుందా అంటే.. ఎవరకికైనా కోపం వచ్చేస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వంలో చోటు కల్పించని బీజేపిపై శివసేనకు కూడా అంతే కోసం వుంది. కానీ అధికారంలో భాగం కావాలని గత పదేహేనేళ్లుగా ఎదురుచూస్తున్న శివసేనకు ఇప్పుడు అవకాశం అందినట్లే అంది దూరం కావడం, అందుకు బీజేపి కారణం కావం కూడా మింగుడు పడటం లేదు. ఎన్నికలు పెట్టిన చిచ్చు నేపథ్యంలో మహారాష్ట్రలో శివసేనతో దాదాపుగా తెగదెంపులు చేసుకున్న బీజేపీ మళ్లీ ఆ పార్టీతో చెలిమికి సిద్ధమవుతున్నట్టుగా కన్పిస్తోంది. ప్రస్తుత పరిణామాలను చూస్తే బీజేపీ-శివసేన మైత్రిబంధం మళ్లీ చిగురించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.
తాజాగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు మరింత బలాన్ని చేకూర్చాయి. శివసేన తో తమకు శత్రుత్వం లేదని ఆయన తెలిపారు. తాము ఎప్పటికీ స్నేహితులమేన్నారు.. భవిష్యత్తుల్లో కూడా మిత్రులుగా కొనసాగే అవకాశం ఉందిని ఫడ్నవీస్ పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తమ మాజీ భాగస్వామి శివసేనతో చర్చల విషయంలో తాము సున్నితంగానే వ్యవహరిస్తామని అన్నారు. ఇరు పార్టీల మధ్య చర్చల్లో సత్ఫలితాలొస్తాయని ఆశాభావం వ్యక్యం చేశారు. ‘శివసేనతో ఎట్టిపరిస్థితుల్లోనూ చర్చలు జరుపుతాం. మంచి ఫలితాలు వస్తాయనే విశ్వాసం మాకు ఉంది.
శివసేనతో సంబంధాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు’అని అన్నారు. రాష్ట్రస్థాయిలో కొన్ని అంశాల విషయంలో విభేదాలు ఉన్నమాట నిజమేనంటూ అంగీకరించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంలో తామిరువురం కలిసే పనిచేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. నెలన్నర రోజుల పాటు పట్టించుకోకుండా.. ఎన్సీపీ జలక్ ఇవ్వడంతో తమ దరికి బీజేపి రావడం స్నేహహస్తం అందించడంపై శివసేన సంబరపడుతున్నట్లు సమాచారం. ఎట్లకేలకు ఇలా తమ పార్టీకి అధికారాన్ని పంచుకునే అవకాశం వచ్చిందని శివసేన వర్గాలు భావిస్తున్నాయని తెలుస్తోంది. కాగా బీజేపి చెలిమి కోసం చేయి చాచడంపై శివసేన అధికారికంగా ఎలా ప్రతిస్పందింస్తుందో వేచి చూడాల్సిందే.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more