ఇంటర్ నెట్ లో అశ్లీల చిత్రాలను చూసే విషయంలో మన తెలుగు వారు చాల బెటర్ అంటున్నాయి సర్వేలు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెటిజన్లే కాస్త బుద్ధిమంతులని, ఆ తరువాత కేరళ రాష్ట్ర వాసులు నిలుస్తున్నారని తాజా సర్వే ఒకటి చెబుతోంది. ప్రపంచంలో అతి పెద్ద నీలి చిత్రాల వెబ్‌సైట్ ఒకటి భారతీయ వీక్షకుల నుంచి తనకు వస్తున్న రద్దీని విశ్లేషించి ఈ విషయాన్ని చెప్పింది. ఈ దారిపట్టిన వాళ్లు ప్రపంచ వ్యాప్తంగా సగటున 8.56 నిమిషాల పాటు నీలి ప్రపంచంలో మునిగి తేలుతున్నారని వెల్లడించింది.
కాగా భారతీయులు సగటున 8.22 నిమిషాలతో ప్రపంచ నీలిచిత్రాలు చూసే వారితో పోటీ పడుతున్నారు. భారత దేశవ్యాప్తంగా ఈ జాబితాలో ముందు నిలిస్తున్నాయి ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాలు. సగటున 10-12 నిమిషాలతో ఆ రాష్ట్ర యువత పెడదారిలో ముందుందని తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేరళ మాత్రమే ఐదు నిమిషాల వ్యవధితో ఈ అప్రతిష్ఠ జాబితాలో అట్టడుగున నిలిచాయి. పేజీ వీక్షణాల ప్రకారం చూస్తే దక్షిణాది రాష్ట్రాల నెటిజన్లు చాలా బుద్ధిమంతుల కిందే లెక్క.
పాశ్చాత్య దేశాల్లో నీలి వెబ్‌సైట్లకు రద్దీ సోమవారం అమాంతం పెరుగుతుండగా, భారత నెటిజన్లలో శనివారం ఆ మూడ్ ఎక్కువగా ఉంటోంది. కుటుంబాలతో గడిపే దీపావళి, దసరా, వినాయక చతుర్థి లాంటి సంప్రదాయ పండగల రోజుల్లో భారతీయ నెటిజన్లు ఆ సైట్ల జోలికే పోవడం లేదు. ఏమీ తోచని ఆగస్టు 15, జనవరి 26 లాంటి సెలవు దినాల్లో ఈ సైట్ల రద్దీ బాగా ఎక్కువగా ఉంటోంది. నీలి చిత్రాల వీక్షణకు 50 శాతం మంది మొబైల్ ఫోన్లను, 47.5 శాతం మంది డెస్కుటాప్ పీసీలను వాడుతున్నారు. భారతీయ పోర్న్ వీక్షకులకు అత్యంత ఇష్టమైన అన్వేషణ పదం సన్నీ లియోనేనని కూడా వైబ్ సైట్ తెలిపింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more