Mamata s key aide srinjoy bose held in saradha scam tmc hits back calls cbi a political tool

Central Bureau of Investigation, CBI, Saradha scam, All India Trinamool Congress, Rajya Sabha MP, Srinjoy Bose, Mamata Banerjee

Mamata's key aide Srinjoy Bose held in Saradha scam, TMC hits back, calls 'CBI a political tool'

తవ్విన కోద్ది బయట పడుతున్న పెద్దలు

Posted: 11/21/2014 09:30 PM IST
Mamata s key aide srinjoy bose held in saradha scam tmc hits back calls cbi a political tool

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన శారదా చిట్ఫండ్స్ స్కాంలో తవ్విన కోద్ది కుంభకోణం వెనకనున్న పెద్ద మనుషులు భయటకు వస్తున్నారు. తాజాగా ఈ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు శృంజయ్ బోస్ పాత్ర వుందని సీబీై అదికారులు నిర్ధారించుకున్నారు. ఆయనను అరెస్టు చేశారు. ఎంతో మంది అమాయకులకు చెందిన డబ్బును స్వాహా చేసిన బోర్డు తప్పిన కుంభకోణంలో పలువురు నిందితులను ఇప్పటికే అరెస్టు చేశారు.

ఇటీవల తృణముల్ కు చెందిన ఆ పార్టీ బహిష్కృత ఎంపీ జైల్లో ఆత్మహత్యకు యత్నించారు. అంతకు ముందు ఈ కేసులో వున్న ఓ పోలీసు ఉన్నతాధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోట్లాది రూపాయల మొత్తంతో కూడిన ఈ స్కాంలో ఆయనతో పాటు మరికొందరు నాయకులను కూడా సీబీఐ వర్గాలు గత కొన్నాళ్లుగా ప్రశ్నిస్తున్నాయి. అయితే.. స్కాంలో వాళ్ల పాత్ర కూడా ఉన్నట్లు నిర్ధారించుకోవడంతోనే బోస్ను అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. పశ్చిమ బెంగాల్ రవాణా శాఖా మంత్రి మదన్ మిత్రా సహా బోస్ లన ప్రశ్నించడంతో మరికొందరి పేర్లు బయటకు వస్తాయని విపక్ష పార్టీలు వ్యాఖ్యానించాయి. అందరినీ విచారిస్తే మరి కొందరు అసలు సూత్రదారులు దోరుకుతారని పర్కోన్నాయి.

అయితే తృణముల్ కాంగ్రెస్ మాత్రం అరెస్టును ఖండించింది. గత ప్రభుత్వాల తరహాలోనే సీబీణి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వినియోగిస్తున్నారని ఆ పార్టీ విమర్శించింది. ఈ వ్యవహరాంపై మశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివరణ ఇవ్వాలన్న విపక్ష నేతల డిమాండ్ను తృణముల్ కాంగ్రెస్ సభ్యుడు దెరెక్ ఒ బ్రియాన్ తోసిపుచ్చారు. గత ప్రభుత్వాల మాదిరిగానే బీజేపి కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తమపై సీబిఐ ని వినియోగిస్తుందని ఆయన విమర్శించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles