Conistable obulesu turned kidnapper in kbr nityanandareddy firing case

nityananda reddy, firing, Aurobindo Pharma vice president, kcr, telangana assembly, ak 47, greyhounds police, firing, kidnap, obulesu

Conistable obulesu turned kidnapper in KBR nityanandareddy firing case

కిడ్నాపింగ్ ను ప్రవృత్తిగా మార్చుకున్న కానిస్టేబుల్..

Posted: 11/20/2014 12:19 PM IST
Conistable obulesu turned kidnapper in kbr nityanandareddy firing case

పోలీసులు అనుమానాలే నిజమయ్యాయి. నగరం నడిబొడ్డున కేబీఆర్ పార్కు వద్ద అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడింది పోలీసు కానిస్టేబులేనని తేలింది. నిందితుడి ఊహాచిత్రాన్ని గీయించడంతో.. ఈ ఘటనకు పాల్పడింది తమ గూటికి చెందిన పక్షేనని ఉన్నతాధికారులు నిర్ధారించారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఘటనలో నిందితుడైన ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసును.... ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అనంతపురంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం నాంపల్లి ఎక్సైజ్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఓబులేసు...15 రోజులుగా సెలవులో ఉన్నాడు. విధులకు సెలవు పెట్టి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

కాగా కాల్పులకు పాల్పడిన ఓబులేసు ....ప్లాన్ ఫెయిల్ కావటంతో నేరుగా ఎస్ ఆర్ నగర్ చేరుకున్న అక్కడ నుంచి బెంగళూరు బస్సు ఎక్కాడు. అనంతపురం వెళుతున్న అతడిని.... సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించిన పోలీసులు అనంతపురం-కర్నూలు జిల్లా సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడిని హైదరాబాద్లో రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. గతంలో ఎక్కడో మిస్ అయ్యిందన్న ఏకే 47 ఆయుధం మళ్లీ ఎక్కడ లభించింది..? ఆయుధం ఎప్పడు లభించింది..? ఆయుధం లభించగానే సమాచారాన్ని ఎందుకు అందించలేదు..? నిత్యానంద రెడ్డిని ఎందుకు టార్గెట్ చేశావు..? దేని కోసం టార్గెట్ చేశావు..? ఈ ఘటన వెనుక ఎవరెవరి ప్రయేయం వుంది..? నిత్యానందరెడ్డిని టార్గెట్ చేయాలని ఎవరైన పెద్దలు పురమాయించారా.? వంటి అనేక అంశాలపై ఓబులేసును పోలీసులు విచారిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఓబులేసు అరెస్ట్ వార్తపై ధ్రువీకరించలేదు.

కాగా నిందితుడు ఓబులేష్ వెనుక పెద్ద చరిత్రే ఉంది. హైదరాబాద్ అంబర్ పేటలోని సీపీఎస్ గ్రౌండ్ లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఓబులేసు... 1998లో మొదట కర్నూలు ఏపీఎస్పీ ఏఆర్ కానిస్టేబుల్ గా డిపార్ట్ మెంట్లో చేరాడు. నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ గ్రేహౌండ్స్ కు బదిలీ అయ్యాడు. విధుల్లో భాగంగా విశాఖ ఏజన్సీలో మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ కు వెళ్లాడు. కూంబింగ్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో ఓబులేసుకు చెందిన ఏకే47 తుపాకీ విజయవాడలో మాయమైంది.

అయితే  అతను గన్ మిస్సయిన  విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టాడు. అయితే  ఆ తర్వాత ఏకే47 మిస్ అయినట్టు అధికారుల తనిఖీల్లో తేలింది.  దాంతో ఈ విషయం బయటకు తెలిస్తే  రచ్చరచ్చ అవుతుందని భావించిన పోలీస్ ఉన్నతాధికారులు... చడీచప్పుడు చేయకుండా ఓబులేసును అంబర్ పేట్ సీపీఎల్ కు బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఎకే 47 లాంటి అధునిక ఆయుధం సంఘవిద్రోహ శక్తుల చేతుల్లో పడితే ఎంతటి విధ్వంసం జరుగుతుందన్న పరిణామాలను ఊహించైనా.. చర్యలు చేపట్టలేదు. ఓబులేసుపై బదిలీ వేటు పడిందే తప్ప..ఆయుధం ఎక్కడ పోయిందని విచారణ మాత్రం జరగలేదని సమాచారం.

అయితే అప్పటి నుంచే పక్కా పథకం వేసుకున్న ఓబులేసు ...బడా బాబులను కిడ్నాప్ చేసి కోట్ల రూపాయలు దండుకునేందుకు ప్రణాళికలు రచించాడు. అందులో భాగంగానే అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిని అపహరించేందుకు యత్నించి విఫలమై అడ్డంగా దొరికిపోయాడు. గతంలోనూ ఓబులేసు ...ఓ ఉన్నతాధికారిని కిడ్నాప్ చేసి రూ.10 లక్షలు వసూలు చేసి, విషయం బయటకు చెబితే ...హతమార్చుతానని ఆ అధికారిని బెదిరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు రెండు కేసులపైనా విచారణ జరుపుతున్నారు. ఇంతకు ముందు వెలుగు చూడని ఘటనలు ఏమైనా వున్నాయా అన్న కోణంలో కూడా విచారణ సాగుతున్నట్లు సమాచారం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles