ఎన్ని తరాలు మారినా.., క్యాలెండర్ లో సంవత్సరాలు అలా వెళ్ళిపోతున్నా.. మన జీవితంలో మాత్రం కొన్ని విషయాలు ఎల్లపుడూ గుర్తుండిపోతాయి. ఒక వ్యక్తి గురించో.., లేక వస్తువు, మనం చూసిన సంఘటన, ఎదురైన ఘటన ఇలా ఏదో ఒకటి ఎప్పటికీ గుర్తుంటుంది. పేరు చెప్పగానే ఠక్కున వివరాలన్ని చెప్పేలా చెరగని ముద్ర వేస్తుంది. అలాంటిదే వాషింగ్ పౌడర్ నిర్మా. ఈ పేరు చెప్పగానే ముందుగా అందరికి ఆ ఉత్పత్తికి సంబంధించి వచ్చే పాట గుర్తుకు వస్తుంది. ‘వాషింగ్ పౌడర్ నిర్మా.. వాషింగ్ పౌడర్ నిర్మా. పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది’ అంటూ సాగిపోయే ఈ పాట నాటికి., నేటికీ మరువలేని యాడ్ సాంగ్.
యువకుడి ప్రయత్నమే ‘నిర్మా’
తుఫాను చిన్న చినుకు నుంచి మొదలవుతుంది. చిన్న ప్రయత్నంను కష్టపడి చేస్తే అది పెద్ద విజయంగా మారుతుంది అనేందుకు నిర్మా ఉత్తమ ఉదాహరణ. దేశాన్ని ఒక ఊపు ఊపేసిన ఈ ఉత్పత్తి సృష్టికర్త గుజరాత్ కు చెందిన కేశుభాయ్ పటేల్. చిన్నగా మొదలైన ప్రయత్నం మల్టినేషనల్ కంపనీతో కలిసి వ్యాపారం చేసే స్థాయికి తీసుకెళ్ళింది. స్వయంగా రసాయన శాస్ర్తజ్ఞుడు అయిన కేశుభాయ్ పటేల్ మొదట్లో ఈ ఉత్పత్తిని తయారు చేసి స్థానికంగా అమ్మేవాడు. క్రమంగా ఉత్పత్తిని పెంచటంతో పాటు.. విశేష ప్రాచుర్యం కల్పించారు. దీంతో అనేక ప్రాంతాల్లో నిర్మా వాడకం మొదలయింది. అన్ని కంపనీలకు వచ్చినట్లే నిర్మాకు కూడా ఇబ్బందులు వచ్చాయి. వాటిని ఎదుర్కుని అగ్రగామిగా నిలిచింది.
మల్టీనేషనల్ కంపనీ అయిన హిందుస్థాన్ యుని లివర్ తో కలిసి ఒప్పందం చేసుకున్న తర్వాత నిర్మా వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. ముఖ్యంగా ఇంటింటికి తిరిగి అమ్మకాలు చేపట్టడం ద్వారా ప్రజలకు బాగా చేరువయింది. 1969లో మొదలైన ఈ ఉద్యమం ఉత్పత్తికి విశేష పాపులారిటీ తీసుకొచ్చింది. కంపనీ నుంచి డిస్ర్టిబ్యూటర్లు వారి నుంచి నేరుగా రిటైల్ షాపులకు వెళ్ళటంతో డీలర్లు, స్టాకు నిర్వాహకులు అనే మద్యవర్తులు లేకుండా ఎక్కువ లాభాలు వచ్చేవి. ఫలితంగా సర్ప్ ను అప్పట్లో కేజీ రూ.3కే విక్రయించారు. ముడి సరుకుల ధరలు పెరిగిన కష్టకాలంలో కూడా కంపనీ తమ ఉత్పత్తిని గరిష్టంగా రూ.14కు కేజీ చొప్పన విక్రయించింది.
నిర్మా విశేష ప్రజాదరణ పొందటంతో పాటు సంస్థ ఈ స్థాయిలో ఎదిగేందుకు నిర్మా ప్రకటన పాట ఎంతగానో సహకరించిందని అందరికి తెలిసిందే. తెలుగు, హిందీతో పాటు దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ పాటను అనువదించి టీవీలు, రేడియోల్లో ప్రసారం చేశారు. ఇక ఈ పాటలో కూడా అన్ని ప్రాంతాల సాంప్రదాయాలు, సంస్కృతులు కలిపి చూపించటం జరిగింది. ప్రకటనను పరిశీలిస్తే.., స్ర్తీ, పురుషులు కలిసి పాడుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇక పాటకు ఇంత క్రేజ్ రావటానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి అని కంపనీ సహ వ్యవస్థాపకుడు సంతోష్ పాధి చెప్తున్నారు.
{youtube}GFeI8QJMiuk|620|400|1{/youtube}
అందులో మొదటిది పాటలోని క్యాచీ జింగిల్స్, పాటలో ఉంటే మహిళల పేర్లు- హేమ, రేఖ, జయ మరియు సుష్మా. ఈ పేర్లంతా సాధారణంగా పాపులర్ అయిన, ఎక్కువగా ఉండే మహిళల పేర్లు. దీనికి తోడు నిర్మా సబ్సు, సర్ఫ్ పై ఉండే అమ్మాయి ఫొటో. ఈ మూడు యాడ్ కు ప్రజాదరణ తీసుకొచ్చాయి. సినిమాల్లో, సాధారణంగా బయట కూడా ఇప్పటికీ ఈ పాటను సరదాగా ఉపయోగిస్తుంటారు. మిగతా సబ్బులు, సర్ఫుల ప్రకటనల్లో మహిళలు వారి బాత్ రూంలలో బట్టలు ఉతికేవిధంగా చూపిస్తారు. అయితే నిర్మాలో మాత్రం ఆరుబయట బట్టలు ఉతుకుతున్నట్లు చూపించటం జరుగుతుంది. సాధారణంగా దేశంలో చాలా చోట్ల ఇలా బయట మాట్లాడుకుంటూ బట్టలు ఉతకటం మనం చూస్తుంటాం. అంటే ఇది సాధారణ ప్రజలకు చేరువగా ఉండే సబ్బు అనే సంకేతాలు జనాలకు పంపుతుందని ప్రముఖ యాడ్ ఏజన్సీ నిర్వాహకులు తెలిపారు.
ఇక నిర్మా అనే పేరు సంస్థ వ్యవస్థాపకుడు అయిన కేశుభాయ్ పటేల్ కూతురు నిరుపమ నుంచి తీసుకుని పెట్టడం జరిగింది. 1985కాలంలో నిర్మా డిటర్జెంట్- సర్ఫ్ రంగంలో అగ్రగామిగా ఉంది. అయితే ధరలు తక్కువ చేయటం వల్ల వినియోగదారులకు చేరవ కావటం సంగతి పక్కనబెడితే.., ఉత్పత్తిపై మార్కెట్ లో వ్యతిరేక ముద్ర పడే అవకాశం ఉంది అని గ్రహించిన సంస్థ యాజమాన్యం ఆ దిశగా ఏ మాత్రం చర్యలు తీసుకోవద్దని హిందుస్థాన్ యుని లీవర్ పై ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలోనే 1988లో ‘వీల్’ సర్ఫ్ ప్రవేశపెట్టారు. అప్పటికి మార్కెట్ లో 60శాతం వాటా కలిగి ఉన్న నిర్మా ఏటా 1.72లక్షల టన్నుల సర్ఫ్ అమ్మకాలు జరిపేది. మార్కెట్ లోకి వచ్చిన వీల్ సామాన్య, మద్యతరగతి వారి సర్ఫ్ గా పేరు పొందింది. ఇక నిర్మా అన్ని వర్గాల ప్రజల ఎంపికగా ఉండేది. ఇలా కొంత కాలం రారాజుగా ఎదిగిన నిర్మాకు కష్టం వచ్చింది.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మార్కెట్ అంటే పోటియే. రోజుకో ఉత్పత్తి వస్తూ పోటి ఇస్తుంది. ఈ క్రమంలోనే నిర్మాకు గట్టి పోటి ఇచ్చింది. ‘ఘడీ’. నిర్మాలాగే ఇది కూడా సర్ఫ్, డిటర్జెంట్ సబ్బుల అమ్మకాలు మొదలు పెట్టింది. ఈ దెబ్బతో క్రమంగా నిర్మా అమ్మకాలు తక్కువ అయ్యాయి. వీల్ మార్కెట్ వాటాకు ఇబ్బంది లేకపోయినా.., నిర్మా మాత్రం చాలా కష్టాలు పడింది. కొత్తగా వచ్చిన ‘ఘడీ’ ప్రతి ఒక్కరికి చేరువయింది. ముఖ్యంగా గ్రామాల్లో ప్రతి ఇంటికి చేరిపోయింది. దీంతో బ్రాండ్ కు పునర్వైభవం తీసుకురావాలని యాజమాన్యం ఆలోచించింది. అప్పుడే కొత్తగా సంస్థ సారధ్య బాధ్యతలు స్వీకరించిన హిరన్ పటేల్, కొత్త ప్రకటనల సృష్టిపై దృష్టి పెట్టారు. వినియోగదారులకు కొత్తగా చేరువయ్యే మార్గాలు అన్వేషించారు. దీంతో జయ, రేఖ, సుష్మ పేర్లు మారిపోయాయి. అంతేకాకుండా కొత్త ట్యూన్ మెలోడి తదితర మార్పులతో సరికొత్త ప్రకటన రూపొందించారు.
దీనికి తోడు సంవత్సరాల తరబడి నిర్మా ప్రకటనలో తెల్లగా మెరిసిపోయే బట్టలతో గింగిరాలు తిరిగిన అమ్మాయి కన్పించకపోవటానికి మరొక కారణం కూడా ఉంది. ఈ ప్రకటనలో ఉండే అమ్మాయి, దురదృష్టవశాత్తు ఓ ప్రమాదంలో చనిపోయింది. దీంతో ఆమె తండ్రి ఇకపై తన కూతురి ఫొటోను ప్రకటనల కోసం ఉపయోగించవద్దని విజ్ఞప్తి చేశారు. దీంతో కొత్త అమ్మాయితో పాటు, తాజా మార్పులతో మరో యాడ్ షూట్ చేశారు. అయితే నిర్మా గర్ల్ కు ఉన్న ప్రజాదరణ కారణంగా కంపనీ ఉత్పత్తిపై మాత్రం ఆమె ఫొటో ఇప్పటికీ కన్పిస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో పదిశాతం వాటా కలిగి ఇప్పటికి తన ఉనికి చాటుతోంది. ఇది ఒక చిన్న సంస్థగా మొదలై.., దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వాషింగ్ పౌడర్ నిర్మా వెనక ఉన్న కథ.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more