Mamata banerjee saradha chit fund scam cm post resign

mamata banerjee news, mamata banerjee interview, mamata banerjee firebrand, cm mamata banerjee interview, mamata banerjee press meet, sarada chit fund scam

mamata banerjee said that she will resign the cm post if anyone can prove her name involved in saradha chit fund scam

ఆరోపణలు రుజువైతే రాజీనామాకు సిద్ధమన్న ‘సీఎం’

Posted: 11/18/2014 08:59 PM IST
Mamata banerjee saradha chit fund scam cm post resign

భారతదేశంలో ఇప్పటికే ఎన్నోరకాల స్కాంలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే! అయితే ఇటువంటి స్కాములు విచ్ఛలవిడిగా జరగడానికి బడాబాబుల జోక్యం కూడా వుందిలెండి! ఆ వ్యవహారాలను కాస్త పక్కనపెడితే.. ప్రస్తుతం శారదా చిట్ ఫండ్ స్కాంకు సంబంధించి వ్యవహారాలు రచ్చరచ్చగా మారుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ లో అయితే ఈ విషయం మరింత వేడెక్కుతోంది. ఈ స్కాంలో పశ్చిమబెంగాళ్ సీఎం, ఫైర్ బ్రాండ్ నాయకురాలు మమతాబెనర్జీ పాత్ర కూడా వుందనే ఆరోపణలు జోరందుకున్నాయి. దీంతో ఆగ్రహానికి గురైన మమతా.. శారదాస్కాంలో తన పాత్ర వున్నట్టు రుజువైతే తక్షణమే తన సీఎం పదవికి రాజీనామా చేస్తానని బహిరంగంగా తెలిపారు.

ఈ వ్యవహారంలోనే ఆమెను.. ‘‘శారదా గ్రూపుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయా?’’ అని ప్రశ్నించగా ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలమైపోయారు. అందుకు బదులుగా ఆమె.. ‘‘ఎవరన్నారు? ముందు మీరు ఆరోపణలు నిరూపించండి. అందుకు సాక్ష్యాలు చూపించాలి. శారదస్కాంలో నా పాత్ర వుందని రుజువు చేస్తే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేస్తా’’ అని ఆమె పేర్కొన్నారు. శారదా స్కాం మూలాలు లెఫ్ట్ఫ్రంట్ ప్రభుత్వంలో ఉన్నాయని ఆమె ఆరోపించారు. తాము ఆ స్కాంకు బాధ్యుడైన వ్యక్తిని అరెస్టు చేశామని, జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయించామని అన్నారు. ఐదు లక్షల మందికి డబ్బులు కూడా వెనక్కి ఇచ్చినట్లు తెలిపారు. అసలు తమమీద ఆరోపణలు చేయడం పూర్తిగా తప్పని చెప్పారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mamata banerjee  sarada chit fund scam  west bengal news  telugu news  

Other Articles