Big chapati and roties making in india and pakistan

big chapati, big chapathi making, big roti in making, big roti chapati making in india, how to make roti chapati, how to make dosa idly, special food recipies, south indian food recipies, north indian food recipies, latest food recipies, latest telugu news updates

big chapati and roties making in india pakistan : in a place of india and as well as a place in bannu in pakistan people makes big chapati also called as roti of man hight

ఇవేం చపాతిలండోయ్.., ఏకంగా మనిషి పొడవున్నాయ్

Posted: 11/17/2014 11:00 PM IST
Big chapati and roties making in india and pakistan

మనం ఇంట్లో చేసుకునే చపాతీలు మహా అయితే ఒక ప్లేటు సైజులో ఉంటాయి. అదే బయట ఫంక్షన్లకు వెళ్తే అక్కడ వంట మాస్టర్లు చేసే చపాతి (రుమాలి రోటి) పెద్దగా ఉంటుంది. దాన్ని చూస్తేనే మనం ఆశ్చర్యంగా భావిస్తాం. ఇంత పెద్దగా ఎలా చేస్తారు అని తయారీ విధానంను తదేకంగా చూస్తుంటాం. కాని ఈ చపాతి (రోటి) గురించి తెలిస్తే మాత్రం నోరు తెరవకుండా ఉండలేరు. ఏకంగా మనిషి పొడవైన చపాతిని ఇక్కడ తయారు చే్స్తున్నారు. ఎలాంటి యంత్రాలు, పరికరాలు లేకుండా పూర్తి సాంప్రదాయ, పురాతన పద్దతుల్లో రాతి బండపై పిండిని కొట్టి దాన్నే మనిషి పొడవు గల చపాతీగా క్షణాల్లో మార్చేస్తున్నారు. పలచగా ఉండటమే కాకుండా కాస్త కూడా చినుగు పోకుండా ఈ రోటి ఉండటం ప్రత్యేకత. కావాలంటే మీరు ఈ వీడియో చూడండి.

ఇదెక్కడో కాదు మన దేశంలోనే.. మన భారతీయులే ఈ  పెద్ద రోటిని చేస్తున్నారు. వీటిని స్థానికంగా జరిగే ఫంక్షన్లలో తినటానికి ఉపయోగిస్తారట. అంత పెద్దవి ఎలా తింటారు అని ఆశ్చర్యపోకండి. పెద్ద రోటీని ముక్కలుగా కోసి వడ్డిస్తారు. ఇక సోదర దేశం పాకిస్థాన్ లో కూడా అచ్చం ఇలాంటి చపాతీలే చేస్తున్నారు. ఎంతయినా వారు మన నుంచి విడిపోయిన వారే కదా.., ఇక్కడి ఆచారాలు, సాంప్రదాయాలే దాదాపు అక్కడా అమల్లో ఉంటాయి. ఆ ప్రకారంగా పాక్ లోని ఖైబర్ జిల్లా బన్ను ప్రాంతంలో జరిగే వేడుకలకు ఇలా పెద్ద చపాతీలే ఉపయోగిస్తారట.

సాధారణంగా దొరికే గోధుమ లేదా మైదా పిండినే తీసుకుని ఎలాంటి కృత్రిమ పధార్ధాలు కలపకుండా వీటిని తయారు చేస్తారు. కేవలం ఒక తయారీదారుడు, ఒక అసిస్టెంట్ ఈ చపాతీ తయారికి సరిపోతారు. వీరిద్దరూ కలిసి ఫంక్షన్లకు వచ్చే వందల మందికి చపాతిలు తయారుచేసి పెడతారట. వాహ్.., ఆరు గజాల చీరను అగ్గిపెట్టెలో పెట్టిన ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసినా.., ఇలా అతిపెద్ద చపాతీలు చేతితో సునాయసంగా చేసినా.., అది భారతీయులకే చెందుతుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : roti making  big roti chapati  indian foods  latest news  

Other Articles