Andhra pradesh development along the lines of singapore i am prepared to work hard says chief minister chandrababu

Andhra Pradesh, development, Singapore, prepared to work hard, chief minister, chandrababu, GDP, per capita Income, Technical Knowledge, capital city

Andhra Pradesh development along the lines of Singapore.. I'am prepared to work hard says chief minister chandrababu

సింగపూర్ తరహా అభివృద్దికి శ్రమించడానికి సిద్దం..

Posted: 11/16/2014 04:23 PM IST
Andhra pradesh development along the lines of singapore i am prepared to work hard says chief minister chandrababu

కఠోరశ్రమ, ప్రణాళికాబద్ధ పాలన, పాలకుల చిత్తశుద్ధి వల్లే సింగపూర్ అబివృద్ధి సాధ్యమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా సింగపూర్ తరహాలో అభివృద్ది చేస్తానని చెప్పారు. అందుకోసం శ్రమించడానికి తాను సిద్దంగా వున్నానన్నారు. సింగపూర్ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లోనూ తలసరి ఆదాయం, జీడిపీ వృద్ది రేటు సమకూర్చేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని చంద్రబాబు అన్నారు. సింగపూర్ తలసరి ఆదాయం మనకంటే 20 నుంచి 30 రెట్లు అధికంగా ఉందన్నారు.

తన సింగపూర్ పర్యటన విజయవంతం కావడానికి సహకరించిన అందిరికీ  అభినందనలు తెలిపారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగపూర్ పర్యటన వివరాలను చంద్రబాబు వెల్లడించారు. మన జనాభాలో పదోవంతు ఉన్న సింగపూర్ జీడీపీ 4  రెట్లు ఎక్కువగా ఉందన్నారు. సింగపూర్ జీడీపీ 300 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. సింగపూర్‌కు మనకంటే చాలాకాలం తర్వాత స్వాతంత్య్రం వచ్చినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి సాధించగలిగారన్నారు.

మన నౌకాశ్రయాలు కాలుష్య కారకాలుగా ఉంటే... సింగపూర్ పోర్టులు లాజిస్టిక్ హబ్‌లుగా మారాయన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగపూర్ ప్రభుత్వం, వ్యాపారవేత్తల సహకారం తీసుకుంటామన్నారు. 2022 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోకెల్లా అగ్రస్థానంలో ఉండాలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు వివరించారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం చేపట్టి.. తమ శక్తిని రుజువు నిరూపించుకుంటామన్నారు. రాజధాని అంటే సెక్రటేరియట్, అసెంబ్లీ, కోర్టులు ఇవే కాదు... సామాజిక జీవన నగరంగా ఉండాలని ఆకాంక్షించారు. రాజధాని నిర్మాణంలో భాగస్వామినయ్యాననే భావన ప్రతి తెలుగువాడిలో రావాలన్నారు. సింగపూర్ తరహా రాజధాని అభివృద్ధి చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు చంద్రబాబు గుర్తు చేశారు.
:
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles