30 thousand crore for development of roads in the hyderabad capital city

KCR, telangana, hyderabad, review, international airport, outer ring roads, airport, skyways, capital city

30 thousand crore for development of roads in the Hyderabad capital city

రాజధానిలో ఆకాశవీదులు..కళ్లెంలేని ప్రయాణానికి ప్రతిపాదనలు..

Posted: 11/16/2014 12:52 PM IST
30 thousand crore for development of roads in the hyderabad capital city

తెలంగాణ రాష్ర్ట రాజధానిలోని రోడ్ల రూపురేఖలను సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్ అవసరాలకు అనుగూణంగా మార్పలకు శ్రీకారం చుట్టనుంది. మరో నాలుగు దశాబ్దాల వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ చిక్కులు లేకుండా చర్యలు తీసుకోవాలని కంకణం కట్టుకుంది. హైవేలు, స్కైవేలు, మల్టీలేయర్ ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌హైవేలతో రహదారులను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధిపరిచేందుకు పక్కా ప్రణాళికను రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంలో అధికారులు కదిలారు. ఔటర్ రింగ్‌రోడ్డు అవతలి ప్రాంతాలను కలుపుతూ రీజనల్ రింగ్‌రోడ్డు, నగరానికి ఉత్తర భాగంలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో హైదరాబాద్‌కు కొత్త హంగులు కల్పించాలని నిర్దేశించారు. టర్కీలోని ఇస్తాంబుల్ తరహాలో చారిత్రక కట్టడాలను పరిరక్షించుకుంటూనే నగర రహదారుల వ్యవస్థను మెరుగుపరచాల్సి ఉందన్నారు. ఇందుకోసం 25 వేల నుంచి 30 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.  
 
రాజధానికి నిత్యం బయటి నుంచి 15 లక్షల మంది వరకు రాకపోకలు సాగిస్తుంటారని, అలాగే నగరంలో నివసించే వారి సంఖ్య కూడా ఏటా పది లక్షలు పెరుగుతోన్న నేపథ్యంలో ప్రస్తుతమున్న రోడ్లు ఏమాత్రం సరిపోవడం లేదని ప్రభుత్వం నిర్థారించింది. రహదారుల వ్యవస్థను మెరుగుపరచకపోతే భవిష్యత్తులో తీవ్ర గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయన్నారు. భవిష్యత్ అవసరాల కోసం తగిన ప్రణాళికలతో రహదారులను అభివృద్ధి చేసుకుంటున్నాయన్నారు. హైదరాబాద్ ఎప్పుడో గ్రిడ్‌లాక్ దశకు చేరుకున్న గత ప్రభుత్వాలు సమస్యపై దృష్టి సారించలేదని, అందువల్లే తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కోంది.

 ఇప్పటికైనా మేల్కొని ఈ దుస్థితిని చక్కదిద్దకపోతే పరిస్థితి మరింత జఠిలమవుతుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండేందుకు చాలా నగరాల్లో 6, 8, 10 లైన్ల రోడ్లను నిర్మిస్తారని, అయితే హైదరాబాద్‌లో అది సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎక్కువ లైన్లతో రోడ్లు వేయాలంటే చాలా ప్రాంతాల్లో ఎన్నో కూల్చివేతలు జరపాల్సి ఉంటుందని, అది అయ్యే పని కాదన్నారు. ఇస్తాంబుల్ తరహాలో చారిత్రక కట్టడాలను పరిరక్షించుకుంటూనే నగరంలోని రహదారుల వ్యవస్థను మెరుగుపరచాల్సి ఉందన్నారు. కొత్త ఫ్లైఓవర్లను ఇప్పుడున్న వాటి మాదిరిగా కాకుండా మల్టీ లేయర్లతో ఏర్పాటు చేయాలన్నారు. నాలుగుదిక్కులా ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణంతోపాటు స్కైవేలు నిర్మిచాలని, స్కైవేల్లోనూ జంక్షన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
 
ఎల్‌బీనగర్-మియాపూర్, ఉప్పల్-హైటెక్‌సిటీల మధ్య ట్రాఫిక్ రద్దీ తీవ్రత దృష్ట్యా ఆ మార్గాల్లో హైవేలు నిర్మించాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. జిల్లాల నుంచి నగరంలోకి వచ్చే వాహనాలు శివార్లలోనే ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఉండేందుకు ఇదివరకే ఆలోచించినట్లుగా పరేడ్‌గ్రౌండ్, తూముకుంట, ఎల్బీనగర్, హయత్‌నగర్, ఉప్పల్, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం జరగాలన్నారు. పాతబస్తీలోనూ రహదారులను మెరుగుపరచడానికి అక్కడి రోడ్ల పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేయాలన్నారు. అలాగే ఔటర్ రింగ్‌రోడ్డుకు అవతల రీజనల్ రింగ్‌రోడ్డు కూడా రావాలని కేసీఆర్ చెప్పారు. సంగారెడ్డి, వికారాబాద్, షాబాద్, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్, భువనగిరి, జగదేవ్‌పూర్, గజ్వేల్, తూప్రాన్‌ల మీదుగా ఈ రింగ్‌రోడ్డును నిర్మించాలన్నారు. ప్రస్తుతమున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి తోడుగా నగరానికి ఉత్తర భాగంలో మరో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  telangana  hyderabad  review  international airport  outer ring roads  airport  skyways  capital city  

Other Articles