Plus size models skinny girls with padding

oval pads, body shape perfection pads, body shape pads, woman body shape, latest news, technology updates, perfect body shaped woman

plus size' models skinny girls with padding : models uses pads for their body changes and size increase according to clothes and dressing style. models using oval pads for their body shape at breast, hip and in other places for inreasing body size

ప్యాడ్ లతో మగాళ్ళను పడేస్తున్న మోడళ్ళు (ఫొటోలు)

Posted: 11/15/2014 11:00 PM IST
Plus size models skinny girls with padding

అందం అనగానే గుర్తుకు వచ్చేది అమ్మాయిలే. అమ్మాయి శరీరంలోని ఒక్కో భాగాన్ని ఒక్కోవిధంగా కవులు వర్ణించటం జరుగుతుంది. అందంతో పాటు ఆకర్షణ అమ్మాయిల సొంతం. మామూలు అమ్మాయిల మాటే ఇలా ఉంటే మోడళ్ళు ఇంకెలా ఉంటారో చెప్పనక్కర్లేదు. గ్లామర్ విషయంలో లోపం ఎత్తి చూపలేనట్లుగా శిల్పి జీవిత కాలంలో చెక్కి అద్బుత శిల్పంగా మోడళ్ళు కన్పిస్తారు. శరీరం ఒక ఆకారంలో ఉంచుకునేందుకు ఎంతో కుస్తీ పడతారు. పర్ ఫెక్ట్ అమ్మాయి అంటే సినిమాల్లో చెప్పిన ప్రకారం 36*24*36 సైజులో ఉంటుందని తెలుసు.

skinny-girls1

ఇక మోడళ్లు సన్నగా స్లిమ్ముగా రెండు చేతులతో నడుం మొత్తాన్ని బంధించేంత నాజూకుగా కన్పిస్తారు. దీనికి జీరో సైజు, మైనస్ అని పేర్లు పెడతారు. ఎన్నో ఎక్సర్ సైజులు, జిమ్ ఫీట్లు, యోగా, డైట్ పాటిస్తే ఇలా అవుతారు. ఇక మోడళ్ళకు ఏ డ్రస్సులు వేసినా చాలా బాగా సూట్ అవుతాయి. ప్రతి డ్రస్ లో వారు ఒదిగిపోయి కన్పిస్తారు. దీనికి కారణం ఏమిటో తెలిసిపోయింది. అవసరాన్ని బట్టి వీరు ప్యాడ్లు వాడతారు అని తెలుస్తోంది. ఫొటోలో చూపించిన ప్రకారం మోడల్ కతై గ్రీన్ మామూలుగా అయితే 12 సైజులో ఉంటుంది. అయితే అవసరాన్ని బట్టి అమ్మడు 16నుంచి ఆ పైన సైజులకు మారుతుంది.

skinny-girls2

ఇలా నాజూకుతనం నుంచి తిప్పుకుంటూ నడిచే ఒంపులు ఈ ప్యాడ్ల వల్లే సాధ్యమని ఆమె చెప్తోంది. కొన్ని సార్లు షోలు, ఆడిషన్లు, ప్రమోషన్లు, షూటింగ్ ఇతర అవసరాల వల్ల ఒకరకమైన డ్రెస్ లు వేయాల్సి ఉంటుంది. అయితే అన్ని శరీరానికి పూర్తిగా సూట్ కావు. కాని మోడళ్ళు కాబట్టి వీరు ప్రమోషన్ కోసం తప్పనిసరిగా చాలాబాగా కన్పించాలి. అందుకోసమే ఇన్నర్ వేర్స్ లో ప్యాడ్లు ఉపయోగిస్తామని చెప్తోంది. మామూలు సూపర్ మార్కెట్ లలో కాకుండా ప్రత్యేకించి హై రేంజ్ బట్టలు అమ్మే మార్కెట్లు, మాల్స్ లో ఈ ప్యాడ్లు లభిస్తాయట. తొడలు, నడుం, వక్షోజాల భాగంలో వీటిని అవసరమైన సైజుల ప్రకారం తీసుకుని పెట్టేసుకుని వాటిపై డ్రస్సులు వేసుకుంటే శరీరం ఆకృతి బట్టలకు బాగా సెట్ అవుతుందని చెప్తోంది. ఇన్నాళ్ళు వీరిని చూసి మనం ఏ బట్టలు వేసినా ఎలా సెట్ అవుతుంది అనుకునే వాళ్ళం.. కాని అసలు రహస్యం ప్యాడ్లది అని తెలిసింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : body shape  oval pads  models  latest news  

Other Articles