Ganta srinivas rao criticises kcr behaviour on inter exams

telangana inter exams timetable, andhra pradesh inter exams time table, inter exams time table, inter exams issue between telangana and andhra pradesh, ganta srinivas rao in kcr, kcr on andhra pradesh, kcr latest commens, telugu latest news updates

ganta srinivas rao criticises kcr behaviour on inter exams : andhra pradesh minister ganta srinivas rao criticises kcr behaviour and telangana government way on intermediate exams to held seperate. ganta says with seperate inter exams for two states will risk for inter board and also gives bad results to students asks kcr to change his behaviour

నువ్వేంటయ్యా సీతయ్యలా ఎవరి మాట వినటం లేదు

Posted: 11/15/2014 10:52 AM IST
Ganta srinivas rao criticises kcr behaviour on inter exams

తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుపై ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఇంకా ఉద్యమ నేతగా వేర్వేరు ఆలోచనలు చేస్తున్నారు తప్ప.., సీఎంగా రాష్ర్టానికి ఉపయోగపడే, ఇతరులతో సన్నిహితంగా ఉండేలా ఆలోచించటం లేదన్నారు. ఇంటర్ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం వేరుగా నిర్వహించటం సరికాదన్నారు. తెలంగాణ వైఖరి వల్ల, విద్యార్థులు ఇబ్బందులు పడతారని చెప్పారు.

ఉమ్మడిగా పరిక్షలు నిర్వహించాలన్న తమ ప్రతిపాదనపై తెలంగాణ పునరాలోచించాలని సూచించారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అవసరమైతే న్యాయపోరాటానికి కూడా సిద్ధమని ప్రకటించారు. గతంలో ఎంసెట్ విషయంలో కూడా ఇలాగే మొండిగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఎవరి మాట వినకుండా తాను చెప్పిందే వేదం అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరించటంపై చాలాసార్లు విమర్శలు వచ్చాయి. సీతయ్య సినిమాలో హరికృష్ణలా ఎవరి మాట వినడు అని పలువురు ఎద్దేవా చేశారు కూడా.  

ఇంటర్ పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించాలని ముందుగా భావించినా.., తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అనటంతో వేర్వేరుగా నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది. ఇక వచ్చే ఏడాదిలో మార్చ 9నుంచి 27వరకు తెలంగాణలో, మార్చి 11నుంచి 31వరకు ఏపీలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో విభేదించటానికి ప్రధాన కారణం జేఈఈ మెయిన్స్ అని ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. మార్చి 9న పరీక్షలు జరిగితే ఏప్రిల్ 4న జరిగే జేఈఈ మెయిన్స్ కు సన్నద్ధం అయ్యేందుకు విద్యార్థులకు ఎక్కువ సమయం ఉంటుందని చెప్తున్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  andhrapradesh  kcr  ganta  inter exams  

Other Articles