Memory power improvement technics and tips

memory loss patients, memory loss problem, memory loss treatment, memory power improve technics, memory power improve tips, memory power improve secrets, memory power improve treatment, psychological problems and solutions, latest news

memory power improvement technics and tips : memory loss become a major problem for everyone but scientists not found permanant remedies for this. psychologists had given some suggitions for memory improvement like meditation and sleeping and other tips

జ్ఞాపకశక్తి పెరగాలంటే ఇలా చేయండి

Posted: 11/15/2014 01:15 AM IST
Memory power improvement technics and tips

మనిషి మేధస్సు ఎంతో శక్తివంతమైనది అని తెలుసు. విశ్వాన్నే జయించగల సత్తా మానవ మెదడుకు ఉంది. అయితే ప్రస్తుత యాంత్రిక జీవితంలో వివిధ కారణాల వల్ల మనుషులకు మతిమరుపు వస్తోంది. ఇదో జబ్బు అని చెప్పలేము కాని తీవ్రమైన సమస్య అని నిర్దారించగలము. చిన్న చిన్న విషయాల నుంచి ముఖ్యమైన అంశాలను కూడా మర్చిపోయి బాధపడేవారు చాలా మంది ఉన్నారు. ఒక నిమిషం క్రితం జరిగిన, మనం చేసిన పనిని కూడా మర్చిపోతుంటాం. మతిమరుపు అవమానాలు ఎదుర్కోవటంతో పాటు ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది. ఎన్నో వ్యాధులకు మందులు కనుక్కున్న శాస్ర్తవేత్తలు జ్ఞాపకశక్తి పెంచేందుకు మాత్రం ఏం చేయాలో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అయితే మనిషికి ఇంత ఇబ్బంది కల్గిస్తున్న ఈ సమస్యకు సైకాలజిలో కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

బాగా నిద్రపోవటం

నిద్రలేమి వల్ల చాలా సమస్యలు వస్తాయని తెలిసిందే.., అందులో జ్ఞాపకశక్తి లోపించటం కూడా ఒకటి. సరైన నిద్ర లేకుండా.., ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచించటం, ఏదో ఒక పని చేస్తుండటం వల్ల మెదడు ఎప్పుడూ పని చేయటానికే అలవడుతుంది తప్ప గుర్తుంచుకోవటానికి ప్రయత్నించదు. హడావుడిగా పనులు చేస్తూ, మరో పని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అలా కాకుండా సరైన నిద్ర ఉంటే మెదడు విశ్రాంతి తీసుకుని, ప్రశాంతంగా ఉంటుంది. లేచిన తర్వాత కొత్తగా ఆలోచించేందుకు అవకాశం ఉంటుంది అని సైకాలజిస్టులు చెప్తున్నారు.

క్రమం తప్పకుండా వ్యాయాయం చేయటం

వ్యాయామం చేయటం శరీరధారుడ్యానికి ఉపయోగపడటంతో పాటు జ్ఞాపకశక్తి పెంచుకునేందుకు కూడా ఉపయోగపడుతుందని సైకాలజిస్టులు చెప్తున్నారు. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల చేస్తున్న పనిపై ఏకాగ్రత పెరుగుతుంది. దీనికి తోడు వ్యాయామం చేసే సమయంలో అంటే జాగింగ్, రన్నింగ్, ఆసనాలు వేసే సమయంలో మనం ఇతర పనులు చేయలేము. కాబట్టి వ్యాయామం చేసే సమయంలో మెదడు ఇతర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించదు. దీనికి తోడు వ్యాయామం తర్వాత శరీరంలో రక్తప్రసరణ వేగంగా జరుగుతుంది. ఫలితంగా మెదడు చురుకుగా పని చేస్తుందని చాలా సర్వేల్లో నిరూపించబడింది.

రోజూ 2కప్పుల కాఫీ

మీరు కాఫీ ప్రియులా.., అయితే మీకు ఇది శుభవార్తే. ఒకవేళ కాఫీ ఫ్రెండ్స్ కాకపోతే.. ఇప్పటినుంచే టీ నుంచి కాఫీకి షిఫ్టవండి. ఎందుకంటే కాఫీ తాగటం వల్ల మెమోరీ పవర్ పెరుగుతుందట. కాఫీ పొడిలో ఉండే ప్రత్యేక ఉత్తేజితం కెఫైన్ వల్ల మెదడు చురుకవుతుందని సర్వే పరశోధన చెప్తోంది. రోజుకు రెండు కప్పుల కాఫీ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుందట. ఎక్కువగా కాఫీ తాగితే మరీ ఎక్కువగా జ్ఞాపకశక్తి వస్తుందనుకుంటే పొరపాటే. ఎక్కువగా కాఫీ తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయని సర్వేలు నిరూపించాయి. డాక్టర్లు కూడా చెప్తున్నారు. కాబట్టి రోజుకు రెండు సార్లు చాలు.

ఇవి మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి పెంచుకోవటానికి సులవైన మార్గాలు వీటిని పాటిస్తే... మతిమరుపు తగ్గటంతో పాటు క్రమంగా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతంది. సో ట్రై చేసి చూడండి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : memory power  science  psychologist  disease  latest news  

Other Articles