Baby elephant survives 14 lion attack

elephant, Lion, Africa, World, Zambia, king of the jungle, baby elephant, attack, predator, prey, little pachyderm, kicks, chase

Baby Elephant Survives 14 Lion Attack

గజరాజు వర్సెస్ మృగరాజులు.. గెలుపెవరిదీ..?

Posted: 11/14/2014 09:16 AM IST
Baby elephant survives 14 lion attack

అఫ్రికా దేశంలోని మృగరాజులను విధి వంచిందింది. ఆకలితో వున్న మృగరాజులు వేట కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 మృగరాజులు గుంపుగా వచ్చి కలసి పోరాడినా.. చివరికి ఓటమిపాలయ్యాయి. ఒక్కరుగా వున్నా ప్రత్యర్థే గెలిచారు. పరిస్థితి చూస్తే.. అడవికి రాజు సింహాలు అన్న పదాన్ని మార్చాల్సిన అవసరం ఏర్పడేట్లు వుంది. మొన్న ముళ్లపంది చేతిలో గుంపులుగా వచ్చిన మృగరాజులు ఓటమి పాలయ్యాయి. కాగా ఏడాది వయస్సున్న గజరాజు చేతిలో కూడా మృగరాజులు ఓటమిపాలయ్యాయి.

దక్షిణాఫ్రికాలోని జాంబియా అటవీ ప్రాంతంలో వున్న ఏనుగుల మంద నుండి తప్పిపోయిన ఏడాది వయస్సున్న ఏనుగు తన వారిని వెతుకుతూ వెళ్తోంది. అంతలో ఒక చెరువు కనబడింది. అక్కడ నీళ్లు తాగుదామని వెళ్లిన ఏనుగు పిల్లను 14 సింహాల గుంపు చూసింది. తమకు ఆ పూటకు ఆహారం దొరికిందనుకుని ఒక్కసారిగా వచ్చి వేటు వేశాయి. సింహాలను చూసి తప్పించుకునే ప్రయత్నం చేనిన ఏనుగు పిల్ల చెరువులోకి వెళ్లసాగింది. అయినా ఒక సింహా ఏనుగుపైకి ఎక్కగా, మరో రెండు సింహాలు వెనక కాళ్లను కొరకడం ప్రారంభించాయి. అప్పటి వరకు గమ్మున వున్న ఏనుగు పిల్ల వాటిపై తిరగబడింది. సింహాలు కొంత వెనక్కు తగ్గాయి. ఇంతలో మరో సింహం ఏనుగును వేటాడింది.

ఏనుగు హూంకరించి..వాటిపై తిరగబడింది. మృగరాజులు అంతతొందరగా ఒటమిని అంగీకరిస్తాయా..? అందుకనే మళ్లీ దాడి చేశాయి. కాళ్లతో ఓ సింహాన్ని తన్నిన ఏనుగు. మిగతా వాటిపై దాడి చేస్తానన్నట్లుగా ఉరమిచూస్తూ.. వెనక వెళ్లింది. అలా వెనక్కు తిరిగే సరికి మరో సింహం వచ్చి దాడి చేసింది. ఇక లాభం లేదనుకున్న ఏనుడు దాడాకి తాను సిద్దమంటూ.. చెరువులోంచి ఒడ్డుకు పరుగులు తీసింది. ఇది చూసిన సింహాలు పరుగు లంకించుకున్నాయి. దీంతో మనకెందుకులే అనుకున్నాయో.. ఏమో.. ఒడ్డుకు చేరుకున్నాయి. ఈ తరువాత ఏనుగు తన వారిని వెతుకుతూ అడవిలోకి వెళ్లింది. పోరాడితే పోయేదేమీ లేదు.. ఓటమితో ప్రాణాలను అర్పించడం కన్నా, ఎదురుతిరిగి ప్రాణాలను రక్షించుకోవడం మిన్నా అని తెలుసుకున్నట్లుంది ఆ ఏనుగు
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : elephant  Lion  Africa  World  Zambia  king of the jungle  baby elephant  attack  

Other Articles