Is andhrapradesh chief minister chandrababu is totally in the hands of entrepreneurs

politics, AndraPradesh CM, Chandrababu, ambati rambabu, donations, special flights, Ysrcp, Sujana chowdary, Rayapati sambashiva Rao, sujana chowdary, Narayana

Is Andhrapradesh chief minister chandrababu is totally in the hands of Entrepreneurs..?

వ్యాపారవేత్తల కబంధహస్తలలో చిక్కుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..?

Posted: 11/13/2014 06:26 PM IST
Is andhrapradesh chief minister chandrababu is totally in the hands of entrepreneurs

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా వ్యాపార వేత్తల కబంధ హస్తాలలో చిక్కుకున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 2004లో ఉమ్మడి ఎన్నికలకు ముందు చేసిన తప్పిదాలను మరోమారు ఆయన చేస్తున్నారా అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వుండి ఆరు నెలలు కావస్తున్నా.. అయన తాపత్రయం అంతా వాణిజ్య సంస్థల ఏర్పాటుపైనే వుంది. రాష్ట్రానికి అది చేస్తా, ఇది చేస్తా అంటూ బీరాలు పోతున్నారే తప్ప.. అన్నదాతను మరోమారు విస్మరిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోతున్నారు. కేవలం రైతు సాధికారిక సంస్థ ఏర్పాటుతో రైతుల రుణాలు రీషెడ్యూలింగ్ చేస్తామనడంతోనే అంతా అయిపోయిందనుకుంటున్నారు. విపక్షంగా వున్న ఏకైన పార్టీని ఇబ్బందులకు గురిచేస్తూ.. తన ఆటకు అడ్డూ అదుపులేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం సాయంతో త్వరలోనే 24 గంటల నిరంతర విద్యుత్ రానున్న ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు ప్రధానంగా కావాల్సింది పరిశ్రామల స్థాపన, అన్ని రంగాలలో సమున్నతమైన అభివృద్ది. కానీ చంద్రబాబు మాత్రం ప్రజలకు ఒకటి చెబుతూ, తానొకటి ఆచరిస్తూ.. ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం వెయ్యి నుంచి లక్షలు, కోట్ల రూపాయల వరకు విరాళాలు సేకరిస్తున్న చంద్రాబాబు ప్రభుత్వం, అదేస్థాయిలో తమ ఖర్చులను కూడా అదుపుచేసుకుని వుంటే బాగుండేది. కానీ వీ విల్ మేక్ ద రూల్స్.. టు పీపుల్ ఫాలో అన్నట్లుగా తాము చెప్పేది తామే అచరించం, ప్రజలను మాత్రమే ఆచరించమని కోరతామంటే.. ఎవరు మాత్రం అంగీకరిస్తారు. ఎంతకాలమని మౌనంగా వుంటారు.

తమ కష్టార్జితాన్ని విలాసానికి వినియోగించడంపై సామాన్యుడు ఎప్పటికైనా తిరగబడతాడు..? ఉమ్మడి రాష్ట్రంలో విద్యత్ చార్జీల పెంపు జరిగిన నాలుగేళ్ల తరువాత వచ్చిన ఎన్నికలలో సామాన్యుడు తన తీర్పును వెలువరించిన విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం అప్పడే మర్చిపోయినట్లుంది. ప్రజాధనంతో విలాసవంతమైన రెండు ప్రత్యేక విమానాలలో విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు సామాన్యుడిని మర్చిపోరాదు. అటు హస్తిన కొలువుదీరిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కొత్త ప్రభుత్వం దేశ ఆర్థిక పరిస్థతిని పరుగులెత్తించడానికి అనేక పోదుపు చర్యలను తీసుకుంటోంది. మంత్రిత్వశాఖ ప్రధాన కార్యదర్శుల దగ్గరి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఏ అధికారైనా ఏడాదికి నాలుగు సార్లకు మించి విదేశీ పర్యటనలు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. అది కూడా ఎవరైనా దాతలు లభ్యమైన సమయంలోనే విదేశీ పర్యటనలు చేయాలని సూచించింది. అలాగని, ప్రభుత్వ రంగ సంస్థలు దాతృత్వాన్ని కూడా అంగీకరించబోమని తే్ల్చిచెప్పింది. ఇలా కేంద్రం పోదుపు చర్యలతో ముందుకు కదులుతుంటే.. రాజధాని నిర్మాణం కోసం విరాళాలు సేకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం విలాసాలకు డబ్బు తగిలేస్తోందన్న విమర్శలు వినబడుతున్నాయి.

చంద్రబాబు సింగపూర్ పర్యటనపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిది అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు బృందం రెండు ప్రత్యేక విమానాలలో వెళ్లడాన్ని తప్పుపట్టారు.ఒక వైపు ప్రజల నుంచి విరాళాలు అడుగుతూ మరో వైపు ప్రత్యేక విమానాలలో విదేశీ యాత్రలు చేస్తారా అని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు రాష్ట్ర అవసరాల కోసం కాకుండా ,సొంత పనుల కోసం సింగపూర్ వెళ్లారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకు అక్కడ వ్యాపారాలు ఉన్నాయని ఆయన అన్నారు. చంద్రబాబు తన పేరును సింగపూర్ నాయుడుగా మార్చుకోవచ్చనన్నారు. అయినా చంద్రబాబు తన సింగపూర్ పర్యటనకు ఇంత ఆర్భాటం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఒక్కరుగా మొదలై.. రానున్న ఐదేళ్ల కాలంలో జౌరా ఇది నిజమే కదా అని ప్రజలు అనుకునేందుకు, తమ తీర్పును మార్చుకునేందుకు కూడా అవకాశాలున్నాయి.

కొన్ని మాసాల కిందట తన తాత్కాలిక కార్యాలయ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి సహా మంత్రులు యనమల వరకు అనవసరంగా లక్షల రూపాయల డబ్బులు తగిలేసినట్టు కూడా విమర్శలు వచ్చాయి. రాష్ట్రాభివృద్దికి పర్యటనలు అవసరమే.. కానీ వాటిలో ఎంత వరకు ఖర్చు తగ్గుతుందో కూడా ప్రభుత్వం చూసుకోవాలి. రెండేసి ప్రత్యేక విమానాల బదులు ఒక్క విమానంలో చంద్రబాబు బృందం సింగపూర్  పర్యటనకు వెళ్లివుంటే ఖర్చు కాస్తాయనా తగ్గేది కదా..? ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలలో గెలిచిన పార్లమెంటు ఎంపీలను కాదని, కళింకితుడైన సజనా చౌదరికి కేంద్ర మంత్రి పదవిని ఇప్పించడంపై చంద్రబాబు ఇటు రాష్ట్ర ప్రజలలోనూ, అటు కేంద్ర ప్రభుత్వ దృష్టిలోనూ చులకన అవుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు చుట్టూ వ్యాపారవేత్తల కొటారీ ఏర్పడిందని, ఆయన వారి కబంధహస్తాలలో చిక్కుకున్నారని వస్తున్న విమర్శలను ఆయన, ఆయన ప్రభుత్వం ఎలా ఎదుర్కోనుందో వేచి చూడాలి మరి..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles