Elangana assembly budget session eetala rajender to table the budget

telangana assembly, butget, eetela rajendar, legislative council, DY. cm rajaiah, CM KCR, congress, Telangana TDP

elangana assembly budget session, eetala Rajender to table the budget

ఆశలు చిగురిస్తాయా..? చిదిమేస్తాయా..?.. తొలి బడ్జెట్ పై ప్రజల్లో ఉత్కంఠ

Posted: 11/04/2014 05:27 PM IST
Elangana assembly budget session eetala rajender to table the budget

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరి కొన్ని గంటల్లోనే ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర అవిర్భావం తరువాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ను రాష్ట్ర ఆర్థికమంత్రి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే అదే సమయంలో శాసనమండలిలో డిప్యూటీ సీఎం రాజయ్య బడ్జెట్ను ప్రవేశపెడతారు. సాధరణా ప్రక్రియను కాదని అసెంబ్లీ సమావేశాల తొలిరోజునే అసెంబ్లీ, మండలిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆ తరువాత సాయంత్రం తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం కానుంది. ఈ నెలాఖరు వరకూ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి.

దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ గెలిచింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం ఆసన్నం కావడంతో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ముందుగానే వివిధ శాఖాధిపతులతో విస్తృతంగా చర్చించి, ఈ బడ్జెట్కు రూపకల్పన చేసినట్లు సమాచారం. రాష్ట్ర బడ్జెట్ పై తెలంగాణ ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నేరవేరుతాయా..? అంటూ కోటి ఆశలతో తెలంగాణ ప్రజలు ఎదురుగూస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఎదురుదాడికి సమాయత్నం అవుతున్నాయి.

తమ రాష్ట్ర బడ్జెట్ ఎలా వుండబోతోందనన్న ఉత్కంఠ అటు సంపన్న వర్గాలతో పాటు ఇటు సామాన్యులలోనూ ఉత్కంఠకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి బడ్జెట్‌లో ప్రజలపై వరాల జల్లులే తప్ప పన్నుల వాత ఉండవని స్పష్టం చేశారు.  ప్రజలు గతంలో ఎన్నడూ చూడని బడ్జెట్‌ను చూడబోతున్నారన్నారు. మా రాష్ట్రంలో మా అసెంబ్లీలో మా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అరుదైన అవకాశం తపరే దక్కింది’ అని ఆయన అన్నారు! తెలంగాణ రాదని చెప్పిన చోట.. ‘ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకో పోండి’ అన్న వేదిక నుంచి.. ‘నా ప్రాంతానికి.. నా ప్రజలకు నిధులు కేటాయించబోతున్న అనుభూతిని మాటల్లో చెప్పలేనిదిగా ఆయన అబివర్నించారు.

తెలంగాణ ప్రజానీకం గతంలో ఎన్నడూ చూడని మంచి బడ్జెట్‌ను ఈసారి చూడబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇది కొత్త ఒరవడిని, సంప్రదాయాన్ని సృష్టిస్తుందని.. భవిష్యత్తు తెలంగాణకు బాటలు వేస్తుందని చెప్పారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌ ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. బడ్జెట్‌ ప్రాధాన్యాలు, రాషా్ట్రనికి ఆదాయం వస్తున్న తీరును వివరించారు. నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు బడ్జెట్‌ ప్రతిబింబంగా ఉంటుంది. ఇది లాభ, నష్టాల పట్టిక కాదు. ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ మాదిరి రాబడి.. పోబడి ఉండదు. రాబోయే తెలంగాణను ఆవిష్కరించే పద్ధతిలోనే బడ్జెట్‌ ఉంటుంది.

సంక్షేమానికే పెద్దపీట వేస్తున్నామని చెబుతూనే.. . ఆ తర్వాత వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు, విద్యకు ప్రాధాన్యం ఉంటుంది. ఇన్నేళ్ల స్వతంత్ర దేశంలో.. సమైక్య పాలనలో.. పేదలు, అణగారిన వర్గాల ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. ఆర్థికంగా పెద్దవాళ్లు..  మరింత పెద్దవాళ్లు అయ్యారు. ఆర్థికంగా చిన్నగా ఉన్నవాళ్లు మరింత చిన్నవాళ్లు అయ్యారు. సమాజంలో అంతరాలు తగ్గాల్సిందిపోయి, మరింత పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో అణగారిన వర్గాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో.. మా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేయాలని నిర్ణయించింది. కేవలం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికే వచ్చే ఐదేళ్లలో రూ.50వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని వివరించారు. మరి ఈలెట బడ్జెట్ ప్రజలను ఎలా ఆకట్టుకుంటుందో మరి కోన్ని గంటలు వేచి చూడాల్సిందే

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles