An australian comes by plane to get bear from pub

plane journey, plane near pub, plane journey for beer, charterd flights, rented flights, small planes, two seated flights, australian went by plane for getting beer, beer rates in india, pubs in hyderabad, latest news

an australian comes by plane to get bear from pub : an austarlian parked his plane at a pub for getting beer inside, police enquiring issue of man come by plane to get beer in the pub in australia

ఏమనాలి : బీర్ కోసం విమానం వేసుకెళ్ళాడు

Posted: 11/03/2014 03:42 PM IST
An australian comes by plane to get bear from pub

ఎవరైనా వైన్ షాప్ కు నడిచి లేదా బైక్, కారులో వెళ్తారు కానీ విమనంలో వెళ్తారా. అది కూడా ఒక్క బీర్ కోసం. కాని ఆస్ర్టేలియాలో ఓ వ్యక్తి మాత్రం కేవలం ఒక్క బీర్ కోసం విమానం వేసుకెళ్ళాడు. నగరం మద్యలో ఉన్న పబ్ ముందు పార్క్ చేసి లోపలికి వెళ్లీ చల్లని బీర్ తాగి బయటకు వచ్చాడు. పిల్బరా పట్టణంలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు హడిలిపోయారనుకొండి. విమానం రోడ్డుపైకి వచ్చి... మనుషుల పక్కనుంచి వెళ్తుంటే అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఎక్కడ పేలుతుందో.., ఏ ప్రమాదం జరుగుతుందో అని స్థానికులంతా భయపడుతుంటే..., అందులోని వ్యక్తి మాత్రం తాపీగా పార్క్ చేసి పబ్ లోపలికి వెళ్ళాడు.

దీంతో కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం కోపంతో ఊగిపోయారు. విమానం ఎవరికైనా తగిలితే ఏంటి పరిస్థితి.., అయినా బీర్ కోసం విమానంలో రావటం ఏంటని వారికి చిర్రెత్తుకొచ్చింది. వీరిలో కొందరు పోలిసులకు ఫిర్యాదు చేయగా.., పబ్ దగ్గరకు వచ్చిన ఆస్ర్టేలియా పోలిసులు విమానం చూసి ఆశ్చర్యపోయారు. తీసుకొచ్చిన వ్యక్తి గురించి వెతగ్గా..., మహానుభావుడు లోపల పానియం సేవిస్తూ సేదతీరుతున్నాడట. విమానం వేసుకురావటాన్ని తీవ్రంగా పరిగణించిన పోలిసులు బీరు బాబుపై కేసు నమోదు చేయటంతో పాటు విమానం అద్దెకు ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామంటున్నారు.

విమానం దగ్గరగా వచ్చినపుడు తమ అనుభవాన్ని కొందరు మీడియాతో వెల్లడించారు. ల్యాండింగ్ సమయంలో తన తలపై నుంచి చాలా దగ్గరగా విమానం వెళ్లిందనీ... అది చూడటంతోనే తన పని అయిపోయింది అనుకున్నట్లుగా ఓ వ్యక్తి తెలిపాడు. ఇక స్థానికులు అయితే ఎక్కడ పేలుతుందో అని వణికిపోయారట. ఇంతకీ బీరు కోసం విమానం వేసుకెళ్ళాలనే ఆలోచన ఎలా వచ్చిందో.., అసలు అంత ధైర్యం ఏమిటో అర్ధం కావటం లేదు. ఇలాంటి వారిని ఏమనాలో కూడా ఆస్ర్టేలియా పోలిసులకు తెలియటం లేదట.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : plane  beer  pub  australia  

Other Articles