Rajnath singh flags off unity rally in hyderabad and urges people to live as indians

Sardar Vallabhbhai Patel, Sardar Patel birth anniversary, Run for Unity, rajnath singh, hyderabad, ips passing out parade, unity rally, Union Home Minister

Rajnath Singh flags off unity rally in Hyderabad and urges people to live as Indians

పటేల్ కృషి వల్లే హైదరాబాద్ భారత్ లో విలీనం

Posted: 10/31/2014 10:51 AM IST
Rajnath singh flags off unity rally in hyderabad and urges people to live as indians

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్లో జాతీయ సమైక్యతా పరుగును ప్రారంభించారు.  అంతకు ముందు ఆయన అసెంబ్లీ ముందున్న పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ ఐకమత్య సూత్రానికి కట్టుబడి ఉంటామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి చేత తెలుగులో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ జయంతి హైదరాబాద్లో జరుపుకోవటం సంతోషకరంగా ఉందన్నారు.

పటేల్ కృషివల్లే హైదరాబాద్ భారతదేశంలో విలీనమైందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్వాతంత్ర్యానంతరం దేశంలోని 562 సంస్థానాలను భారత్లో విలీనం చేసేందుకు పటేల్ తీసుకున్న నిర్ణయాలు స్పూర్తిదాయమని కోనియాడారు.దేశ విభజన సమయంలో పటేల్ కీలక పాత్ర వహించారని కొనియాడారు. మోదీ సంకల్పించిన జాతీయ ఐక్యతా పరుగును విజయవంతం చేయాలని రాజ్నాథ్ కోరారు. ఐక్యతా రన్‌ పటేల్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ వరకు కొనసాగింది. పటేల్ జయంతిని జాతీయ ఏక్తా దివస్‌గా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ప్రజల్లో సమైక్యతా భావాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశంలో ఎక్కడి వారైనా, ఎక్కడున్నా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయుల్లా కలసిమెలసి మెలగాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరూ అన్నదమ్ముల్లా కలసి మెలసి.. ఐక్యత ప్రదర్శించేందకు పటేల్ జయంతిని స్ఫూర్తిగా తీసుకుని కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.

అనంతరం రాజ్నాథ్ సింగ్ రాజేంద్ర నగర్ లోని సర్దార్ పటేల్  పోలీస్ అకాడమీలో  పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్నారు. 66వ బ్యాచ్ ఐపీఎస్ లు శిక్షణ పూర్తి చేసుకోగా, ఈ ముగింపు కార్యక్రమంలో రాజ్ నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 66వ బ్యాచ్‌లో 128 మంది ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకోగా వారిలో 19మంది మహిళా ఐపీఎస్‌లు, 15మంది విదేశాలకు చెందిన పోలీసు అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతే.. దేశ ప్రజల ఆకాంక్షలను శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్లు నేరవేర్చాలన్నారు. పటేల్ జన్మదినం రోజునే ఐపీఎస్ లు శిక్షణ పూర్తి చేసుకోవం సంతోషకరమని పేర్కోన్నారు. ఐపీఎస్లు పరస్పరం సహకరించుకుని సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles