Hyderabad kukatpally police brutally beaten auto driver gopi for not given bribe

hyderabad police, hyderabad traffic police, hyderabad kukatpally dsi kranthi kumar, hyderabad police brutally beaten auto driver for bride, hyderabad police bribe

hyderabad kukatpally police dsi kranthi kumar constables narsing rao gopal brutally beaten auto driver gopi for not given bribe

లంచమివ్వలేదని డ్రైవర్ ను చితకబాదిన పోలీసులు..

Posted: 10/30/2014 07:46 PM IST
Hyderabad kukatpally police brutally beaten auto driver gopi for not given bribe

ఇతరులకు న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయాలకు పాల్పడుతున్నారు. మొన్నీమధ్యే ఒక ఆటోడ్రైవర్ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించాడంటూ ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు నడిరోడ్డుమీద అతనిని దారుణంగా కొట్టారు. రోడ్డుమీద పడేసి మరీ గాయాపాలు చేశారు. ఈసారి దానికంటే ఘోరమైన సంఘటన ఒకటి హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో చోటు చేసుకుంది. తాము అడిగిన లంచం ఇవ్వలేదన్న కోపంతో పోలీసులు ఒక డ్రైవర్ ను ఇష్టమొచ్చినట్లు చావబాదారు. దీంతో బాధితుడు.. తనను కొట్టిన పోలీసులపై డీసీపీకి, మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా కమిషన్ కూకట్ పల్లి ఏసీపీని ఆదేశించింది.

వివరాల్లోకి వెళ్తే... కూకట్ పల్లి రామాలయం వద్ద ఒక ఆటోస్టాండ్ వుంది. స్టాండ్ లో వున్నప్పటికీ ఈనెల 14వ తేదీన పోలీసులు ఆటోడ్రైవర్ గోపీతోపాటు ఇతర మూడు ఆటోలను పోలీసులు తీసుకెళ్లారు. ఆటోకు రూ.5 వేలరూపాయల చొప్పున చెల్లించి, తీసుకెళ్లవచ్చంటూ వాళ్లు డిమాండ్ చేశారు. దాంతో చేసేదేమీలేక పోలీసులు చెప్పినట్లుగానే డబ్బులు రెడీ చేసుకోవడానికి వెళ్లారు. అయితే ఎలాగోలా ఆటోడ్రైవర్ గోపీ చాలాకష్టంగా రూ.4 వేలు పోగుచేసి.. అంతకుమించి ఎక్కువ ఇవ్వలేనంటూ వారితో ఆవేదన వ్యక్తం చేసుకున్నాడు. అంతే! దీంతో ఆగ్రహించిన పోలీసులు అతనిపై తమ ప్రతాపం చూపించేశారు.

తన దగ్గర రూ.4 వేలకంటే ఎక్కువ డబ్బులు లేవని చెప్పినందుకు డీఎస్ఐ క్రాంతికుమార్ కు ఒక్కసారిగా ఆగ్రహం వచ్చేసింది. వెంటనే గోపీ కాళ్లు, చేతులు కట్టేసి పోలీసు మార్క్ ట్రీట్ మెంట్ ఇచ్చాడు. థర్డ్ డిగ్రీ తరహాలో ఎలాబడితే అలా చితకబాదేశాడు. ఎవరికైనా ఈ విషయం గురించి చెబితే తప్పుడు కేసులు పెట్టి జైలుపాలు చేస్తానని బెదిరించాడు కూడా! అయితే తీవ్ర గాయాలపాలైన గోపి ముందుగా చికిత్స చేయించుకున్నాడు. అనంతరం తనను కొట్టి డీఎస్ఐ క్రాంతికుమార్, కానిస్టేబుళ్లు నర్సింగ్ రావు, గోపాల్ లపై ఫిర్యాదు చేశాడు. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలంటూ ఉన్నత అధికారులతో కోరుకున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles