Isi shifts underworld don dawood ibrahim to pakistan afghanistan border

US, Pakistan-Afghanistan border, ISI, India, Dawood Ibrahim, anti terrorist agreement, mumbai bombblast, underground, America, Karachi's Clifton area

ISI shifts underworld don Dawood Ibrahim to Pakistan-Afghanistan border

ఫాక్-అఫ్ఘన్ సరిహద్దులో తలదాచుకున్న దావూద్..

Posted: 10/29/2014 11:12 AM IST
Isi shifts underworld don dawood ibrahim to pakistan afghanistan border

భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను కంటికి రెప్పలా కాపాడుకునే విషయంలో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఎప్పటికప్పుడు తన స్వామి భక్తిని చాటుకుంటూనే ఉంది. ఎప్పుడైతే తన శత్రువుగా భావిస్తున్న భారత్ కు అతను శత్రువుగా మారాడో, అప్పటి నుంచే అతడు ఆ సంస్థకు అత్యంత విలువైన వ్యక్తిగా మారిపోయాడు. దావూద్ విషయంలో ఐఎస్ఐ ఎవరేమన్నా పట్టించుకునే స్థితిలో లేదు. ఎప్పటికప్పుడు అతడికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్న ఆ సంస్థ, తాజాగా మునుపెన్నడూ లేనిరీతిలో భద్రతను పెంచిందట. భారత్ సహా అమెరికా అతనిప నిఘా పెట్టిన తరుణంలో అతడిని పాకిస్థాన్ లోని కారాచీ క్లిప్టన్ ప్రాంతం నుంచి అప్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతంలోకి తరలించింది.

భారత భద్రతావిభాగాలు దావూద్ అబ్రహం కార్యకలాపాలపై దృష్టి సారించిన దరిమిలా అతడిని పాకిస్థాన్-అప్ఘనిస్థాన్ సరిహద్దులోని ఓ ప్రాంతానికి తరలించింది. అయితే ఎక్కడికి తరలించదన్న విషయాలను కూడా ఐఎస్ఐ వెల్డించడం లేదు.
అంతర్జాతీయ సమాజం హెచ్చరికలను తోసిరాజని, అతడు కోరిన కోర్కెలన్నింటినీ తీరుస్తూ తరిస్తోందని, ఈ నేపథ్యంలో అతని రహస్య ప్రదేశానికి తరలించిందని మీడియా కథనాలు వెలువడుతున్నాయి. భారత్ లో నరేంద్రమోడీ అధ్యక్షతన గల ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. దావూద్ ఇబ్రహీం పూర్తిగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లాడని, కనీసం అతని సన్నిహతులతో  కూడా మాట్లాడటం, కలవడం లేదని సమాచారం. దావూద్ కు రక్షణ కల్పించడంలో ఐఎస్ఐ సహా దావూద్ కూడా భయాందోళనకు గురవుతన్నట్లు తెలుస్తోంది.

భారత్- అమెరికాలు తీవ్రవాద అణిచివేతపై ఒప్పందాలు చేసుకున్న దరమిలా.. దావూద్ సహా ఐఎస్ఐలు జంకుతున్నాయని సమాచారం. ఇందులో భాగంగా ముందుగా దావూద్ ఇబ్రహీం, అతని గ్యాంగ్, డీ కంపెనీపై నిఘా పెట్టిందన్న సమాచారంతో దావూద్ రక్షణను మరింత పెంచిన ఐఎస్ఐ.. అతడిని కంటికి రెప్పలా చూసుకుంటోంది. అతనిపై ఏ క్షణానైనా భారత్ అమెరికా దళాలు దాడి చేయవచ్చుననే పాకిస్థాన్-అప్ఘనిస్థాన్ సరిహద్దులో.. తాలిబన్ల ప్రభావిత ప్రాంతంలోని రహస్య ప్రదేశంలో దాచినట్లు తెలుస్తోంది.

దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన దావూద్, 1992 బొంబాయి బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఒక్కసారిగా ఐఎస్ఐకి కీలక భాగస్వామిగా మారాడు. అప్పటి నుంచి కరాచీలోనే మకాం వేసిన దావూద్, ఎప్పడు బయటికెళ్లినా, ఐఎస్ఐ అతడి వెన్నంటే ఉంటోంది. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను రక్షించుకోలేకపోయిన ఐఎస్ఐ, దావూద్ పై ఈగ వాలితే కూడా సహించడం లేదు. ఐఎస్ఐలో పదవీ విరమణ పొందిన సీనియర్ అధికారులను దావూద్ కు వ్యక్తిగత భద్రత సిబ్బందిగా పనిచేసేందుకు అనుతిస్తున్న ఐఎస్ఐ, అతడికి భారత్ నుంచి నకిలీ పాస్ పోర్టులను అందించే పనిని కూడా చేసి పెట్టింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles