Devineni uma challenges kcr for power water crisis in telangana

kcr, telangana, power crisis, devineni uma, chandrababu naidu, Telangana CM, AP CM, Krishna River, Srisailam project, power generation

devineni uma challenges kcr for power water crisis in telangana

ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవి నుంచి తప్పుకుంటా..

Posted: 10/25/2014 12:24 PM IST
Devineni uma challenges kcr for power water crisis in telangana

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పచ్చి అబద్ధాల కోరని, ఆయన చేతగానితనం వల్లే తెలంగాణకు విద్యుత్ సంక్షోభం నెలకొందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముందుచూపుతో విద్యుత్ను కొనుగోలు చేశారన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం చంద్రబాబు ప్రకాశం బ్యారేజ్పై చేసిన మహాధర్నాను కేసీఆర్ వక్రీకరించారన్నారు. అది వాస్తవం అని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని దేవినేని సవాల్ విసిరారు. కేసీఆర్ ఆరోపణలు నిజమైతే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు.

కేసీఆర్ అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వాడుతున్న పదజాలం తెలుగుప్రజలు సిగ్గుతో తలదించుకొనేలా చేస్తోందన్నారు. తెలుగు రాష్ట్రాల రైతుల సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు వ్యవహరిస్తుంటే...కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మూడు ప్రాంతాల రైతుల సంక్షేమం కోసమే గతంలో చంద్రబాబు ప్రకాశం బ్యారేజీపై బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌కు వ్యతిరేకంగా మహాధర్నా చేశారన్నారు..శ్రీశైలం ప్రాజెక్ట్లో నీటిమట్టం తగ్గితే రాయలసీమ వాసులకు తాగునీటి కష్టాలు తప్పవన్నారు.

పై రాష్ట్రాల నుంచి ఒక్క టీఎంసీ నీటిని కూడా తెచ్చుకునే పరిస్థితి లేదన్నారు. ఎగువ నుంచి ఒక్క టీఎంసీ నీరు వచ్చే పరిస్థితి లేదని, శ్రీశైలంలో నీటిమట్టం తగ్గితే తాగడానికి కూడా నీళ్లుండవన్నారు. చంద్రబాబు ముందుచూపుతో విద్యుత్‌ కొన్నారని వివరించారు. కేసీఆర్‌ మొద్ద నిద్రపోయి చంద్రబాబును నిందించడం తగదని మండిపడ్డారు. కేసీఆర్‌ మాట్లాడే ప్రతి మాట అబద్దమే అని విమర్శించారు. తాము కరెంట్‌ ఇస్తామన్నా పట్టించుకోని కేసీఆర్‌ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని ఉమా అన్నారు. కేసీఆర్‌ తిట్లు తమకే చెందుతాయని వ్యాఖ్యానించారు. సెంటిమెంట్‌తో ప్రజలను మభ్యపెట్టడం సరికాదని, వారి సంక్షేమం కోసం కృషి చేయాలని హితవు పలికారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles