Bomb threat to air india flight sparks security alert

Terror, Terrorists, Suicide, Suicide bombing, Kerala, Kochi, Air india, Bomb threat, Air India flight, security alert

Bomb threat to Air India flight sparks security alert

ఎయిర్ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. దేశవ్యాప్తంగా అలర్ట్

Posted: 10/24/2014 05:39 PM IST
Bomb threat to air india flight sparks security alert

ఉగ్రవాదుల దాడులు జరుగొచ్చనే నిఘావర్గాల హెచ్చరికలతో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ విమానాశ్రయం, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, గన్నవరం, రాజమండ్రి విమానాశ్రయాల్లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈ నెల 25న ముంబై నుంచి వచ్చే ఒక విమానాన్ని పేల్చేయడం లేదా వీలైతే ఆత్మాహుతి దాడి చేస్తారని కోచి విమానాశ్రయ అధికారులకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు విమానాశ్రయం డైరెక్టర్ ఏకేసీ నాయర్ చెప్పారు. విమానాన్ని బాంబులతో పేల్చి వేస్తామని, లేదా ఆత్మహుతి దాడులకు పాల్పడతామని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందన్ని ఆయన మీడియాకు వివరించారు.

శనివారం ముంబై నుంచి కోచి వచ్చే విమానం లేదా శుక్రవారం రాత్రి అహ్మదాబాద్-ముంబై వెళ్లే విమానంపై దాడి చేయనున్నట్టు హెచ్చరికలు వచ్చాయి. ఈ మేరకు ఓ ఆగంతకుడు కోల్కతా విమానాశ్రయ అధికారికి ఫోన్ చేసి బెదిరించాడు. ఆయన వెంటనే కోచి విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. సీఐఎస్ఎఫ్ డీఐజీ ఆనంద్ మోహన్ చెన్నై నుంచి కోచి చేరుకుని అత్యున్నత స్థాయి భద్రత సమావేశం నిర్వహించారు. విషయాన్ని పోలీసులతో పాటు పౌరవిమానయాన రక్షణ దళానికి తెలిపామని, వారి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని సంబంధిత వర్గాలు తెలిపాయి. కోచి విమానాశ్రయంలో భద్రత బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. బంబును శోధించి, నిర్వీర్యం చేసే దళంతో పాటు క్విక్ రెస్పాన్స్ టీమ్, సీఐఎస్ఎఫ్ విమానాశ్రయాలపై నిరంతర నిఘాను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతను పెంచారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Terror  Terrorists  Suicide  Suicide bombing  Kerala  Kochi  Air india  Bomb threat  Air India flight  security alert  

Other Articles