Maharashtra muslim people fearing with mim party win

maharashtra assembly elections, mim party maharashtra assembly elections, maharashtra muslims, asaduddin owaisi, akbaruddin owaisi, maharashtra state, bjp party, maharashtra navanirman sena, raj thackrey

maharashtra muslim people fearing with mim party win

MIM పార్టీని చూసి భయపడుతున్న మహారాష్ట్ర ముస్లింలు!

Posted: 10/22/2014 08:23 PM IST
Maharashtra muslim people fearing with mim party win

నిన్న జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఎమ్ఐఎమ్ పార్టీ రెండు సీట్లను గెలుచుకోవడంతోపాటు మరికొన్ని అతితక్కువ ఓట్ల తేడాతోనే ఓడిపోయి.. మరాఠీగడ్డపై సరికొత్త రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే! ఎమ్ఐఎమ్ ఇచ్చిన షాక్ కు అక్కడున్న లోకల్ పార్టీలలకు సైతం దిమ్మతిరిగిపోయింది. అంతేకాదు... రాజ్ థాక్రే నిర్మించిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్ఎన్ఎస్) పార్టీకంటే ఎమ్ఐఎమ్ అధిక మెజార్టీతో సీట్లను గెలుచుకోగలిగింది. మొన్నటివరకు కేవలం హైదరాబాద్ కే పరిమితమైన ఈ పార్టీ.. ఒక్కసారిగా మరాఠీ గడ్డపై తన సత్తా చాటడాన్ని ఆ రాష్ట్రప్రజలతోపాటు దేశవ్యాప్తంగా అందరూ ఆశ్చర్యపోయారు. జాతీయ మీడియా సైతం దీనిపై ప్రత్యేక కథనాలను కూడా ప్రసారం చేశాయి. దీంతో ఒక్కసారిగా ఒక్కసారిగా జాతీయ స్థాయిలో ఎదిగిపోయింది. ఇప్పటికీ ఇందుకు సంబంధించిన చర్చలే కొనసాగుతున్నాయి.

అయితే ఈ పార్టీ మహారాష్ట్రలో గెలవడాన్ని అక్కడున్న ముస్లిం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం! ముస్లిం మజ్లిస్ పార్టీ గెలిచినా కూడా అక్కడ ముస్లింలు మాత్రం ఈ పార్టీ గెలివడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే.. ఇప్పటికే ఎమ్ఐఎమ్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఇతర మతస్థుల వారిపై సంధించిన వ్యాఖ్యలు దేశం మొత్తం పెద్ద దుమారమే రేపాయి. అభివృద్ధి పాలనాపరంగా కంటే ఈ ఇద్దరు సోదరులు కేవలం రెచ్చగొట్టే వ్యాఖ్యలే ఎక్కువ సందర్భాలు వుండటంతో... అటువంటి వ్యాఖ్యలే మహారాష్ట్రంలో కూడా ఎక్కడ చేస్తారనని భయపడుతున్నారు. వీరితోపాటు ఎమ్ఎన్ఎస్ పార్టీలో వుండే ముస్లింలు కూడా ఇతర మతస్థులపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో వాళ్లు భయాందోళనలకు గురవుతున్నారు.

ఒవైసీ సోదరులు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల యువకులు కూడా త్వరగా రెచ్చిపోతారని.. తద్వారా మతతత్వపరంగా గొడవలు తీవ్రతరమయ్యే అవకాశాలు ఎక్కువగా వుంటాయని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. వీరితోపాటు ఎమ్ఎన్ఎస్ వ్యవహారశైలి కూడా అలాగే వుంది కాబట్టి.. ఈ రెండు పార్టీలు కలిసి సంచలన ప్రసంగాలు ఎక్కడ చేస్తారోనని భయడపతున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో విద్యు, ఉద్యోగ, ఆరోగ్యపరంగా చాలా వెనుకబడి వున్న తరుణంలో వాటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒవైసీ పార్టీ గెలవడం తీవ్ర ఆందోళనలకు గురిచేస్తోందని అక్కడి ముస్లింలు భయపడుతున్నారు. ఈ సమయంలో గనుక ఈ ఒవైసీ తమ్ముళ్లు మహారాష్ట్రలో అడుగుపెట్టి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే.. తమకు దక్కాల్సిన హక్కులు దక్కకపోవడంతోపాటు.. ఇరువర్గాల ప్రజలు కొట్టుకుచావాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

గతంలో హైదరాబాద్ లో అక్బరుద్దీన్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే! ‘‘15 నిముషాలపాటు పోలీసులు కళ్లుమూసుకుంటే మా ముస్లింల సత్తాఏంటో చూపిస్తాం’’ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపాయి. అలాగే సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ఒవైసీ బ్రదర్స్ నరేంద్రమోదీతోపాటు ఇతర వర్గాల నాయకులమీద సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో వీరిద్దరు దేశవ్యాప్తంగా సంచలన నాయకులుగానే పేరు సంపాదించుకున్నారు. సంచలనాలను సృష్టించే నాయకులంటూ చాలా వార్తాపత్రికలు, మీడియా కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే మహారాష్ట్రలో వుండే ముస్లిం ప్రజలు ఈ పార్టీ గెలుపుతో అటువంటి పరిస్థితులే తమ రాష్ట్రంలో ఏర్పడుతాయేమోనని భయాందోళనలకు గురవుతున్నారు.

పైగా మహారాష్ట్రలో ముస్లిముల శాతం చాలా తక్కువగా వుంది. మొత్తం మీద కలిపితే కేవలం 11 శాతం మాత్రమే వున్నారు. అటువంటి నేపథ్యంలో ఒవైసీ తమ్ముళ్లు ఇతర వర్గాల మీద రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే.. ఆ వర్గాల ప్రజలు తమ వర్గాల ప్రజల మీద దాడులు చేస్తే.. వాటిని ఎదుర్కోవడం అంత సాధ్యం కాదని.. చాలావరకు ముస్లిం సోదరులను కోల్పోవాల్సి వస్తుందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles