గుండెపోటుకు వారసత్వంతో సంబంధం లేదని, అది అసలు వారసత్వంగా సంక్రమించే జబ్బు కాదని అమెరికాలోని ఇంటర్మౌంటేన్ మెడికల్ సెంటర్ హార్ట్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు వెల్లడించారు. గుండెపోటుకు జన్యుపరమైన కారణాలు ఉండే అవకాశం ఉందని, ఒక తరాన్నించి మరొక తరానికి అది విస్తరిస్తుందని ఇప్పటివరకూ భావించిన శాస్త్రవేత్తలు తాజా అధ్యయనాల మేరకు ఈ రెండింటికీ సంబంధమే లేదని తేల్చిచెబుతున్నారు. సమతుల ఆహారం తీసుకోకపోవటం, శారీరక వ్యాయామం చేయకపోవటం, ధూమపానం, మద్యం సేవించడం వంటి అలవాట్ల వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాల్లో తేలింది.
ఇంటర్మౌంటేన్ మెడికల్ సెంటర్కు చెందిన బెంజమిన్ హార్న్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం.. గుండెజబ్బు బాధితులపై పరిశోధన జరిపింది. సుమారు ఏడు లక్షల మంది గుండెజబ్బుగ్రస్థులపై అధ్యయనం చేసిన తరువాత గుండెపోటుకు వారసత్వానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే ప్రధానంగా గుండెధమనుల (గుండెలోపలు వుండే క్తనాళాల) మాత్రం వారసత్వంగా సంక్రమిస్తాయని చెప్పింది. గుండె దమనులకు గుండెపోటుకు చాలా దగ్గరి సంబంధం వుండటంలో ఇన్నాళ్లు గుండెపోటు వారసత్వంగా వస్తుందని వైద్య శాస్త్రవేత్తలు భావించారు.
గుండెధమనుల సమస్యతో బాధపడుతున్న వారిపై బెంజమిన్ హార్న్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దృష్టి సారించి అధ్యయనం చేసింది. ఈ బాధితుల్లో కొందరు గుండెపోటుకు గురైనవారు కాగా.. మరికొందరికి ఆ సమస్య ఎదురు కాలేదు. ఈ పరిశోధన ద్వారా శాస్త్రవేత్తలు.. కరోనరీ వ్యాధి వారసత్వంగా సంక్రమిస్తోందని తేల్చారు. కానీ.. గుండెపోటు ఆ విధంగా రావటం లేదని గుర్తించారు. దీనిపై హార్న్ మాట్లాడుతూ.. ''కరోనరీకి, గుండెపోటుకు మధ్య దగ్గరి పోలికలు ఉండటం వల్ల అవి రెండూ ఒకటేనని ఇప్పటివరకూ భావిస్తున్నారు. కరోనరీ సమస్య ఉందంటే అది గుండెపోటుకు దారితీస్తుందనే అభిప్రాయం నెలకొంది. కానీ ఇది వాస్తవం కాదు. ఇవి రెండూ వేర్వేరు'' అని చెప్పారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more