Bjp mlas split over maharastra cm candidate

NCP, Maharashtra assembly election, BJP, Narendra Modi, union minister, Nitin Gadkari, Devendra Fadnavis, RSS

Devendra Fadnavis Still Front-Runner for Chief Minister, Say BJP Sources

సీఎం పగ్గాలు.. ఎవరికీ..? కొనసాగుతున్న ‘మహా’ ఉత్కంఠ..

Posted: 10/22/2014 12:33 PM IST
Bjp mlas split over maharastra cm candidate

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కన్ను వేశారు. లేదు లేదు అంటూనే వర్గ రాజకీయాలకు తెరలేపారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో బీజేపి ప్రభుత్వ ఏర్పాటు సాధ్యాసాథ్యాలపై చర్చ సాగుతుండగా, మరో అసక్తికర అంశానికి బీజేపి కేంద్రబిందువైంది. మహారాష్ట్రలో శివసేన మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పావులు కదిపిన బీజేపి.. ఇప్పడు మరో సమస్య వచ్చి పడింది. ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందన్న విషయమై బీజేపి వర్గాల్లోనే హాట్ హాట్ గా చర్చకు తెరలేచింది.

మహారాష్ట్రలో బీజేపి అతిపెద్ద పార్టీగా అవతరించిన ఈ నెల 19నే కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ తాను ముఖ్యమంత్రి రేసులో లేనని స్పష్టం చేశారు. అయితే తన మదిలో మాత్రం మరాఠీ గడ్డ ఫీఠాన్ని అధిరోహంచాలన్న కోరినకు మాత్రం కేవలం తన మద్దతుదారుల వద్ద మాత్రమే ప్రస్తావించినట్లు సమాచారం. దీంతో ఆయన మద్దతుదారులు గడ్కారీకే సీఎం పదవిని కట్టబెట్టాలంటూ నినదించడం ప్రారంభించారు. అంతటితో ఆగకుండా నితిన్ గడ్కరీ నివాసంలోనే సుమారు నలభై మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యి సీఎం పదవిని ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చారు. గడ్కరీనే ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలంటూ మహారాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు సుధీర్ ముంగటివార్ డిమాండ్ చేశారు.

అటు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా తన సన్నిహితులన ఆర్ఎస్ఎస్ ప్రతినిధులతో సమావేశమై సీఎం పీఠం తనకు వచ్చేలా చేయాలని కోరినట్లు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానంపై కూడా ఈ మేరకు ఒత్తిడి తీసుకువచ్చేందుకు పార్టీలని పలువురు పెద్దలను ఆయన ఆశ్రయించినట్లు సమాచారం. మహారాష్ట్ర సీఎం పీఠం తననే వరిస్తుందని ఆశగా వున్న ఆ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర పెడ్నావిస్ తన ప్రయత్నాలను తాను చేస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేదని వ్యాఖ్యానించిన గడ్కరీ.. ఆ పదవిపై ఆశలు పెంచుకోవడంపై బీజేపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ముఖ్యమంత్రి పదవి ఎంపిక విషయంలో మరాఠ బీజేపి ఎమ్మెల్యేలు రెండు వర్గాలు విడిపోయారు. ఇప్పటికే దేవేంద్ర ఫెడ్నావిస్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడంపై పార్టీ అధిష్టానం సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు 40 మంది ఎమ్మెల్యేల మినహా మిగిలిన వారందరూ ఫెడ్నావిస్ వైపునే వున్నట్లు సమాచారం. అయితే నితిన్ గడ్కరీ రేసులో ఉన్నా.. ఫెడ్నావిస్ వైపునే అధిష్టానం మొగ్గుచూపుతోందని బీజేపి వర్గాల సమాచారం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles