ఓ వృద్ధురాలును చూసి ఏమోలే అనుకున్నాడో ఏమో ఆనుకున్నాడనుకుంటా ఆ కాంట్రాక్టరు.. ఇప్పుడామె పేరేత్తితే.. వామ్మె ఆమేనా.. వృద్దురాలు కాదు.. మహా ఘటికురాలు అంటూ బిత్తరపోతున్నాడు. టాయిలెట్ కట్టినందుకే ఇంత చేసింది.? ఇక ఇల్లు కడితే ఇంకెత చేస్తుందోనంటూ ఆందోళన చెందుతున్నాడు. ఇంతకీ కాంట్రాక్టరునే బెదరగోట్టిన ఆ వృద్దురాలు కథ ఏంటో మీకు తెలుసా..? ఇంతకీ అమె ఎవరో కూడా మీకు తెలియదు కదూ..?
తన ఇంట్లోని టాయిలెట్ లో జారిపడినందుకు కాంట్రాక్టరు నుంచి 28 వేల యూరోలు ( భారత కరెన్సీలో రూ.99 లక్షలు) నష్ట పరిహారం పొందిందావిడ. అదేంటి మేము జారిపడతాం.. మాకూ కోటి రూపాయలు ఇస్తారా అనేగా మీ సందేహం.. అవిడలా పోరాడే పటిమే వుంటే మీకు కోటి రూపాయలు కాకపోయినా.. ఎంతో కొంత మాత్రం వస్తుందనుకోండి. అదెలా అంటారా..? సో రీడ్ ది స్టోరీ
ఐర్లాండ్ లో ఇసాబెలా సుల్లివాన్ అనే వృద్ధురాలు తన ఇంటి టాయిలెట్ లో జారిపడటంతో కోర్టును ఆశ్రయించింది. తన ఇంట్లో టాయిలెట్ ను అమర్చే క్రమంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే తాను జారిపడినట్లు ఫిటిషన్ లో స్పష్టం చేసింది. దాంతో కుడి మోకాలికి తీవ్రంగా గాయమైనట్లు తెలిపింది.' కాంట్రాక్టర్ ఇంటి బాత్ రూంలోని టాయిలెట్ పనులు సరిగా చేయలేదు. టాయిలెట్ పనులు చేసే సందర్భంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఆ కారణంగానే నేను జారిపడిపోయాను' అంటూ పేర్కొంది.
దీనిపై విచారణ చేపట్టిన సర్క్యూట్ సివిల్ కోర్టు 28,000 యూరోలను ఆమెకు నష్టపరిహారంగా ఇవ్వాలని స్పష్టం చేసింది. టాయిలెట్ సరిగా లేకపోయిన కారణంగా ఆమె గాయమై బాధపడినందుకు 25,000 యూరోలు చెల్లించాలని, టాయిలెట్ పనులు తిరిగి చేయడానికి 2,500 యూరోలతోపాటు, అదనంగా మరో 350 యూరోలు చెల్లించాలని కోర్టు కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more