Comet siding spring set to have rare near miss with mars

comet mars NASA space, mom, mission on mars, isro, Siding Spring

Comet Siding Spring set to have rare near miss with Mars

మార్స్‌కు దగ్గరగా రానున్న తోకచుక్క.!

Posted: 10/19/2014 10:00 PM IST
Comet siding spring set to have rare near miss with mars

సైడింగ్‌ స్ర్పింగ్‌.. కొండంత తోక చుక్క! గంటకు 2 లక్షల కిలోమీటర్లకు పైగా వేగంతో... భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి.. కుజుడికి అత్యంత సమీపంగా.. 87వేల మైళ్ల దగ్గరగా రానుంది. పది లక్షల సంవత్సరాలకొకసారి జరిగే అత్యంత అరుదైన ఖగోళ వింత ఇది. సైడింగ్‌ స్ర్పింగ్‌ మన సౌర వ్యవస్థలోకి రావడం మానవుడికి తెలిసి ఇదే మొదటిసారి.

అయితే.. ప్రస్తుతం కుజుడి చుట్టూ ఐదు ఆర్బిటర్లు తిరుగుతున్నాయి. అవి.. మార్స్‌ రికన్నైజాన్స్‌ ఆర్బిటర్‌, 2001 మార్స్‌ ఒడిస్సీ, మావెన్‌ (ఈ మూడూ అమెరికావి), మార్స్‌ ఎక్స్‌ప్రెస్‌ (యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ), మామ్‌ (భారత్‌). తోకచుక్కతో పాటు వచ్చే ధూళి వల్ల కలిగే ముప్పు నుంచి తప్పుకోవడానికి.. ఈ ఆర్బిటర్లన్నిటినీ సైడింగ్‌ స్ర్పింగ్‌ మార్గానికి భిన్నంగా వేరొక మూలకు తరలించారు. ఇప్పటికే మార్స్‌పై అడుగిడి పరిశోధనలు చేస్తున్న ఆపర్చునిటీ, క్యూరియాసిటీ రోవర్లు ఈ తోకచుక్కను పూర్తిస్థాయిలో చూడగలవని అంచనా.

ఇంతకీ ఈ తోకచుక్కకు ఈ పేరే ఎందుకు పెట్టారంటే.. రాబర్ట్‌ హెచ్‌ మెక్‌నాట్‌ అనే స్కాటిష్‌ ఖగోళ శాస్త్రజ్ఞుడు 2013 జనవరిలో ఆసే్ట్రలియాలోని సైడింగ్‌ స్ర్పింగ్‌ అబ్జర్వేటరీ నుంచి దీన్ని తొలిసారి చూశారు. అందుకే ఆ అబ్జర్వేటరీ పేరును దీనికి పెట్టారు. భూమ్మీది నుంచి అత్యంత శక్తిమంతమైన టెలిస్కోపులతో దక్షిణాఫ్రికా, ఆసే్ట్రలియాల నుంచి ఈ తోకచుక్కను వీక్షించే అవకాశం ఉంది. భూమి ఉత్తరార్థ గోళం నుంచి దీన్ని చూసే అవకాశం లేదు.

సౌరవ్యవస్థ పుట్టిన తొలి పది లక్షల సంవత్సరాల కాలంలో ఈ తోక చుక్క పుట్టిందట. ఇది మళ్లీ సౌరవ్యవస్థలోకి రావడానికి పది లక్షల సంవత్సరాలు పడుతుంది. అంటే.. మన జీవితకాలంలో ఈ తోకచుక్కను చూడటమంటే, ఇదో జీవితాకాల అదృష్టం కిందే లెక్క!! కాగా.. ఈ తోకచుక్క మార్స్‌ మీదుగా వెళ్లే సమయంలో దాని ఆకృతి తదితరాలను విశ్లేషించడం ద్వారా.. గ్రహాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకునేందుకు ఖగోళ శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో.. ఈ తోక చుక్క తోకలోని కణాల వల్ల మార్స్‌ ఆర్బిటర్లు ఎక్కడ దెబ్బతింటాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : comet mars NASA space  mom  mission on mars  isro  Siding Spring  

Other Articles