Is central government backing black money issue

Black money, Switzerland, India, Swiss banks, Swiss black money, indian government, PM Narendra Modi, senior Advocate, Ram jatmalani. supreme court

Is central government backing Black money issue

ప్రధాని మోడీ గారు.. ఎదీ విదేశాల్లోని నల్లడబ్బు..?

Posted: 10/18/2014 12:04 PM IST
Is central government backing black money issue

విదేశాల్లోని బ్యాంకుల్లో భారతీయులు దాచిన నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం...యూపీఏ బాటలోనే నడించింది. విదేశాల్లో మగ్గుతున్న నల్లధనాన్ని వెనక్కు తీసుకువచ్చి దేశంలో అనేక సంస్కరణలు చేపడతామన్న నరేంద్రమోడీ హామీలు గాల్లో దీపాల మాదిరిగానే మారాయి. బీజేపికి అవకాశమిస్తే దేశ ప్రజల బతుకుల్లో మార్పలు తీసుకువస్తానన్న ప్రధాని మోడీపై పలు విమర్శలు వినబడుతున్నాయి. విదేశాల్లోని బ్యాంకుల్లో వున్న భారతీయ నల్ల కుభేరుల ధనాన్నే తీసుకురాలేని మోడీ.. దేశ ప్రజల బతుకుల్లో మార్పలు ఎలా తీసుకువస్తారని విమర్శలు జోరందుకున్నాయి.

ప్రధాని అయిన తరువాత మోడీ ప్రభుత్వం తీసుకున్న రైల్వే చార్జీల పెంపు నుంచి అన్ని నిర్ణయాలను ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. యూపీఏ ప్రభుత్వం అనుకరించిన విధానాలనే అనుసరిస్తే.. దేశ ప్రజల జీవితాల్లో మార్పు ఎలా సాథ్యమని ప్రశ్నఃలు ఉత్పన్నమవుతున్నాయి. అన్ని ప్రశ్నలకు యూపీఏ ఆ విధంగా ఒప్పందాలు చేసుకుంది.. అందుకే తాము అనుకరించాల్సి వస్తుందన్న బీజేపి మంత్రలు, నేతలు మాటలను కూడా ప్రజలు విశ్వసించడానికి కష్టమవుతోంది. అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ వెళ్లిన సందర్భంగా ఆయన చెప్పినట్టుగానే కనీసం ముఫై ఏళ్ల తరువాత దేశ ప్రజలు బీజేపికి ఏకపక్ష మోజారిటీని కట్టబెట్టారు. మైనారిటీలోని ప్రభుత్వాలు సమూల మార్పలు, సంస్కరణలు తీసుకురావడంలో విఫలం చెందవచ్చు. కానీ ఏకపక్ష మోజారిటీ వున్న ప్రభుత్వం కూడా మీనమేషాలు లెక్కించడం సమంజసంగా లేదని ప్రజలు అనుకుంటున్నారు.

పార్లమెంటులోని లోక్ సభలో కూడా ఎన్నడూ లేనంత కొత్తవారు ఎంపీలుగా ఎన్నికై అడుగుపెట్టారు. వారిలో డెభై శాతం మంది బీజేపి నుంచి గెలుపొందిన వారే. వీని అండగా చేసుకుని అధికారాన్ని అనుభవిస్తున్న ప్రధాని, గత ప్రభుత్వాల తరహాలోని పయనిస్తే.. అప్పటి ఒప్పందాలు అడ్డుగా నిలుస్తున్నాయంటే ఈయన కూడా రాజకీయ నాయకుడే.. అధికారంలోకి రాకముందు ఒకమాట. అధికారం చేపట్టాక మరోమాట చెబుతున్నాడని ప్రజలు విశ్లేషించుకునే ప్రమాదమూ వుంది. మోడీ అంటే మార్పుకు సంకేతమన్న విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలి. అప్పడే మార్పుకు నాంది పడుతుంది. ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. అందుకనే విదేశాల్లో వున్న నల్లడబ్బును వెనక్కి తీసుకువచ్చేందుక అసవరమైన మార్పలు ఈ ఐదేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం చేయాలని ప్రజలు కోరుతున్నారు. భారత నల్లకుభేరులు విదేశీ బ్యాంకుల్లో డబ్బులు దాచేందుకు వీలులేకుండా మోడీ సర్కార్ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు..

భారత్‌తో ద్వంద్వ పన్నుల నిరోధక ఒప్పందం (డీటీఏఏ) చేసుకున్న దేశాల నుంచి నల్లధనంపై అందిన సమాచారాన్ని బహిర్గతం చేయలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలపడంతో ప్రజలు విస్మాయానికి గురయ్యారు. అటువంటి సమాచారాన్ని బహిర్గతం చేయడానికి విదేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయని, బహిర్గతం చేస్తే మరే దేశమూ... భారత్‌తో అటువంటి ఒప్పందాలపై సంతకాలు చేయదని అధికారంలోని మోడీ ప్రభుత్వం కోర్టు విన్నవించడం సమజంసం కాదంటున్నారు. ఈ విషయంలో 800 అనుబంధ ప్రతులతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని మోడీ ప్రభుత్వం..సుప్రీంకోర్టుకు సమర్పించడం నల్లకుభేరులను వెనకేసుకు రావడమే అవుంతుందంటున్నారు. ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని కేంద్రం.. సర్వోన్నత న్యాయాస్థానాన్ని కోరడం కూడా సమంజసం కాదని ప్రజలు భావిస్తున్నారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న వైఖరిపై సీనియర్ న్యాయవాది రాంజఠ్మలానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని విచారించరాదని ధర్మాసనాన్ని కోరారు. ఇటువంటి విజ్ఞప్తి చేయాల్సింది నిందితులు... ప్రభుత్వం కాదు.'' అని జఠ్మలానీ అభ్యంతరం తెలిపారు. విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచిన వారిని రక్షించడానికి ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

గుజరాత్ లో మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా గెలిచిన మోడి అక్కడి రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని.. దేశమంతా చూపి దేశ ప్రజల అశీర్వచనాలు పోందడంలో.. తద్వారా ఓట్లను కొట్టగోట్టడంలో విజేయుడయ్యాడు. ఆయన ప్రధానిగా అన్ని రకాలుగా అర్హులని దేశ ప్రజలు బీజేపికే ఓటు వేశారు. పార్టీలోని సీనియర్లను పక్కనబెడుతున్నాడన్న విమర్శలు పెద్ద దుమారాన్ని లేపినా.. ప్రజలు వాటన్నింటినీ పక్కన బెట్టి మోడీకి పట్టం కట్టారు. మరి మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి.. భారత దేశ అర్థిక వ్యవస్థ గురించి తెలియదా..? అంతకు ముందున్న కేంద్ర ప్రభుత్వాల ఒప్పందం మేరకు నల్లదనకుబేరుల వివరాలు విదేశాలు వెల్లడించలేవని తెలియదా..? ఢిల్లీలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి అధికార పీఠాన్ని అధిరోహించి.. జన్ లోక్ పాల్ బిల్లు కోసం పదవినే త్యజించిన అరవింద్ కేజ్రీవాల్ అక్కడి ప్రజల్లో హీరోగా నిలుస్తున్నారు. అయన లాంటి రాజకీయాలకు కొత్తైన వ్యక్తికి నల్లధనం దేశంలోకి తిరిగి తీసుకురావడం కష్టమని తెలియక పొవడంలో అర్థముంటుంది కానీ.. మోడీ లాంటి మహారాజకీయ దిగ్గజానికి ఈ విషయాలు తెలియవా అంటూ ప్రశ్నలు వినబడుతున్నాయి. అంతేకాదు.. ఇవన్నీ తెలియకుండానే మోడీ ఎన్నికల్లో నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తానని ప్రకటించారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని వెనక్కు తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles