Delhi police started traffic clearance by watsapp

delhi police traffic clearance by watsapp, delhi police watsapp, delhi police, delhi news, traffic in india, hyderabad traffice, traffic rules and guidelines, latest updates, andhrapradesh latest updates watsapp status, watsapp download, watsapp updates

delhi police traffic clearance by watsapp application : india capital delhi city police started clearing traffice by using mobile application wats app by this app anyone can send a disturbed parking and unauthorised parking and also about traffic statements to police than they will come to clear that

వాట్సాప్ ఆన్ చెయ్., ట్రాఫిక్ క్లియర్ చెయ్

Posted: 10/18/2014 07:41 AM IST
Delhi police started traffic clearance by watsapp

ప్రజల వద్దకే పాలన.., ప్రజల చేతికే పగ్గాలు ఇవన్నీ మనం సినిమాల్లో చూస్తుంటాం నిజజీవితంలో అక్కడక్కడా వింటుంటాము. కాని టెక్నాలజీ అభివృద్ధి వల్ల ఇది సుసాధ్యం అవుతోంది. అక్రమాలకు చెక్ పెట్టడంలో ఇప్పుడు ప్రజలే కీలకంగా మారారు. జనం ఏం చెప్తే ప్రభుత్వాలు అవి చేసే స్థాయిలో మార్పు వచ్చింది. ఇక టెక్నాలజిని అందిపుచ్చుకోవటంలో వినియోగించుకోవటంలో భారతీయుల తర్వాతే ఎవరైనా. మొబైల్ ఒకప్పుడు వ్యక్తి హోదాను తెలిపే వస్తువు అయితే ఇప్పుడది అందరికి కనీస అవసరం అయింది. సెల్ ఫోన్ లేని యువతను చాలా తక్కువ సంఖ్యలో మనం చూస్తున్నాము.

సెల్ ఫోన్ తో మాట్లుడుకోవటం.. చాటింగ్, బ్రౌజింగ్, చివరకు బిల్ పేమెంట్ల వరకు అభివృద్ధి చెందాము. కాని ఇప్పుడిదే మొబైల్ ద్వారా ట్రాఫిక్ కూడా క్లియర్ చేయవచ్చట. ప్రస్తుతం ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వాట్సాప్ అప్లికేషన్ ఉంది. ఇది తప్పనిసరి అయింది కూడా. దీన్ని ఉపయోగించే ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఢిల్లీ పోలిసులు శ్రీకారం చుట్టారు. చిన్న గల్లీలు, రోడ్లు ఇలా ఎక్కడ ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగినా ఫోటో పెట్డండి.. వెంటనే అక్కడకు వచ్చి రూట్ క్లియర్ చేస్తాం అంటున్నారు.

మామూలుగా రోడ్లపై ఓ పక్కకు, గల్లీల్లో ఇష్టంవచ్చినట్లుగా వాహనాలు పార్కింగ్ చేసి వివిధ పనుల నిమిత్తం వెళ్తుంటారు. ఇలా చేయటం వల్ల ఆ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు వస్తుంటాయి. ఇలా ఇష్టంవచ్చినట్లు పార్కింగ్ చేసిన వాహనాల ఫొటోలను తీసి.. ఎక్కడ పార్కింగ్ చేశారో స్థలం వాట్సాప్ లో ఢిల్లీ పోలిసులకు పంపిస్తే వారు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేస్తారట. ఇది చాలా సులభంగా ఉంది కదా. ఇక్కడ కంప్లయింట్ చేసిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని అధికారులు చెప్తున్నారు. ఇక వాట్సాప్ అప్లికేషన్ లేదా.., మొబైల్ ఫోన్ ఉండి అందులో డబ్బులు ఉంటే 08750871493 నంబర్ కు ఫోన్ చేసినా సరిపోతుంది అని అధికారులు చెప్తున్నారు. వాట్సాప్ కామెంట్లకే కాదు కంప్లయింట్లకు కూడా ఉపయోగపడుతుంది అని ఇప్పుడిప్పుడే అర్ధం అవుతుంది. మీరు కూడా మీ వాహనాన్ని పార్కింగ్ చేసేటపుడు ముందు వెనక ఆలోచించండి.

 

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi police  traffic  watsapp  latest updates  

Other Articles