Government to reconsider the constrution of the capital on banks of river krishna

Andhra pradesh, Government, chief minister, chandrababu, reconsider, capital city, river Krishna

Government to reconsider the constrution of the capital on banks of river Krishna

నదీ తీరాన రాజధాని నిర్మాణంపై సర్కారు పునరాలోచన..

Posted: 10/17/2014 09:43 AM IST
Government to reconsider the constrution of the capital on banks of river krishna

కృష్ణా నది తీరాన ఆంధ్రప్రధేశ్ రాజధాని నిర్మాణంపై నీలినీడలు అలుముకున్నాయి. కృష్ణా నది తీరంలో రాజధాని నిర్మాణంతో వెలుగులు నింపాలని భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు సమాచారం. నదీముఖ రాజధాని (రివర్ వ్యూ) నిర్మాణం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. విశాఖ నగరాన్ని తుఫాను కబళించడంతో అక్కడ జరిగిన నష్టాన్ని కళ్లార చూసిన చంద్రబాబు ప్రభుత్వం కృష్ణా నది తీరాన రాజధాని నిర్మాణంపై నిపుణుల సలహాలు తీసుకోవాలని యోచిస్తోంది.

అకస్మిక వరదలు వచ్చిన తరుణంలో రాజధానికి, అక్కడ ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా కట్టడాలను నిర్మాంచాలని అలోచిస్తోంది. ఇందుకోసం నదీ తీరాలకు ఆనుకుని నిర్మించిన ఆమ్‌స్టర్‌డామ్, బాన్ నగరాలను పరశీలించి, అక్కడి ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారుల సలహాలు, సూచనలు పొందిన తరువాతే.. రాజధాని నిర్మాణంపై అడుగు ముందుకు వేఃయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నారు. అన్ని విధాలా లాభనష్టాలు బేరీజు వేసుకుని నిర్ణయానికి రావాలని యోచిస్తోంది.

హుదూద్ తుపాను సృష్టించిన బీభత్సం నేపథ్యంలో రాజధాని నిర్మాణంపై తర్జనభర్జనలు మొదలయ్యాయి. గుంటూరు జిల్లా అమరావతి మండలం హైవె కుంఠపురం నుంచి తాడేపల్లి మండలం సీతానగరం వరకు, కృష్ణా జిల్లాలో విజయవాడ సమీపంలోని గొల్లపూడి మొదలుకుని కంచికచర్ల వరకు కృష్ణా నదీ ముఖంగా రాజధాని నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు పలు సమీక్షా సమావే శాలు నిర్వహించారు. చివరకు ల్యాండ్ పూలింగ్ విధానంలో భూ సమీకరణ చేపట్టాలని  నిర్ణయించింది.

ఇందుకోసం కోసం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ మూడురోజుల పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే హుదూద్ తుపాను నేపథ్యంలో ఈ పర్యటన వాయిదా పడింది. అయితే హుదూద్ తుపాను నేపథ్యంలో రాజధాని విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు తెలిసింది. ప్రచండ వాయువేగంతో వచ్చిన హుద్ హుద్ తుపాను విశాఖ చేసిన నష్టం నుంచి కోలుకునేందుకు మూడు నుంచి నాలుగేళ్లు పట్టవచ్చని  అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సందర్భంగా కృష్ణా నది తీరాన రాజధాని నిర్మాణం చేపడితే.. అక్కడి అకస్మిక వరదులు వస్తే జరిగే నష్టాన్ని కూడా ముందుగానే ఊహిస్తున్నారు. గతంలో కృష్ణానదికి ఆకస్మిక వరదలు వచ్చిన ఘటనలు, వీటి వల్ల జరిగిన నష్టాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణాన్ని సంకల్పించిన ప్రాంతంలో సైతం భారీ వరదలకు ఆస్కారం ఉందని నిపుణులు హెచ్చరించినట్లు సమాచారం.

కృష్ణా నదీ ముఖ రాజధాని నిర్మాణానికి పరిస్థితులు అనుకూలం కాదని పలువురు నిపుణులు ఇప్పటికే ప్రభుత్వానికి సూచించారు. ఒకవేళ ఈ ప్రాంతంలోనే నిర్మించాలని భావిస్తే ఉధృతమైన వరదలను సైతం తట్టుకునే స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, ఇందుకు అనుకున్నదానికన్నా రెండింతల ఖర్చు అవుతుందన్న అభిప్రాయం ఉంది. గత చరిత్రను పరిశీలిస్తే కృష్ణా నదికి ప్రతి 20 లేదా 30 సంవత్సరాలకు ఒకసారి ఉధృతంగా వరదలు వస్తుంటాయి. 2009 సెప్టెంబర్ తొలి వారంలో కృష్ణా బ్యాక్ వాటర్ వల్ల కర్నూలు నగరం మునిగిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

విజయవాడ, ఏలూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తే అన్ని రకాలుగా సురక్షితమని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కృష్ణా జిల్లా నూజివీడు అయితే అటు విజయవాడ, ఇటు ఏలూరుకు మధ్యలో ఉంటుందని కొందరు రాజధాని వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మంత్రివర్గం ఉపసంఘానికి తెలిపినట్టు తెలిసింది. నూజివీడు విజయవాడకు 44 కిలోమీటర్లు, ఏలూరుకు 34 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్రమట్టానికి 88 మీటర్ల(288 అడుగులు) ఎత్తులో ఉంది. అదే మంగళగిరి 43 మీటర్లు(141 అడుగులు), విజ యవాడ 23 మీటర్లు (75 అడుగులు), అమరావతి 36 మీటర్లు(118 అడుగులు) ఎత్తులోనే ఉంటాయని, అందువల్ల నూజివీడు అనువైందని వివరించినట్లు సమాచారం. గతంలో వరదలు వచ్చినపుడు విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రంలోకి, పక్కనే ఉన్న రింగ్‌రోడ్‌లోకి నీరు రావటం, తుమ్మలపాలెం, పరిటాల, కంచికచర్ల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడటం, కీసర వద్ద అప్రోచ్ బ్రిడ్జి కూలిపోవటాన్ని వారు ప్రస్తావించినట్లు తెలిసింది.

తుపాను, వరదలు ఒకేసారి రావడం, సముద్రం ఆటుపోట్లకు గురైన సమయంలో ఒకవేళ నీటిని కృష్ణా నది నుంచి విడుదల చేసినా సముద్రంలో కలవకుండా వెనక్కు వచ్చే ప్రమాదముందని కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజధాని నిర్మాణానికి అనువైన స్థలం కోసం ప్రభుత్వం మరోమారు అన్వేషణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.


జి.మనోహర్a

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra pradesh  Government  chief minister  chandrababu  reconsider  capital city  river Krishna  

Other Articles