Michael jackson grabs the first position in the list of richest persons worldwide by forbes

michael jackson news, michael jackson latest news, michael jackson forbes, michael jackson richest person, michael jackson richest people, forbes survey, forbes magazine, forbes richest survey, michael jackson forbes survey, michael jackson albums, michael jackson death news, michael jackson updates, michael jackson, elvis presley news, cartoonist charles schulz

michael jackson grabs the first position in the list of richest persons worldwide by forbes

మరణించి ఐదైళ్లైనా.. వేలకోట్ల డబ్బులు కొల్లగొట్టాడు!

Posted: 10/16/2014 09:14 PM IST
Michael jackson grabs the first position in the list of richest persons worldwide by forbes

వినడానికి విడ్డూరంగా వున్నా... ఇది మాత్రం నిజం! ఒక వ్యక్తి మరణించి ఇప్పటికే 5 సంవత్సరాలు పూర్తి అయ్యింది... అయినా కూడా అతను ఇప్పటికీ కొన్నివేల కోట్ల రూపాయలను బ్యాంక్ ఖాతాలో జమ చేసుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ధనికులు ఎవరన్న విషయంపై సర్వే నిర్వహించిన నేపథ్యంలో ఈ నిజం బయటపడింది. అయితే ఆ వ్యక్తి మరెవరో కాదు... వరల్డ్ వైడ్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న పాప్ స్టార్ - డాన్సర్ మైకేల్ జాక్సన్! మైకేల్ చనిపోయి ఐదు సంవత్సరాలు దాటినా కూడా.. ఇప్పటికీ అతని వన్నె తరగని ఆల్బమ్స్ ఏటా కొన్ని వందల మిలియన్ డాలర్లను సంపాదించి పెడుతున్నని తేలింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ధనవంతుల పేరిట పోర్బ్స్ నిర్వహించిన సర్వేలో మైకేల్ జాక్సన్ మరోసారి నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించేసుకున్నాడు. అతని ఎస్టేట్, తన్నె తరగని ఆల్బమ్స్ ద్వార జాక్సన్ కు ఏటా 141 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోందని తెలిసింది. దీంతో ఫోర్బ్స్ ఫోర్బ్స్ కీర్తిశేషుల జాబితాలో రెండోసారీ అతనే అగ్రస్థానంలో నిలిచాడు. అలాగే ఏటా 55 మిలియన్ డాలర్లతో ఎల్విస్ ప్రెస్లీ రెండవ స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. ఇక ఏటా 40 మిలియన్ డాలర్ల సంపాదనతో ప్రముఖ కార్టూనిస్ట్ - పీనట్ కామిక్ సృష్టికర్త ఛార్లెస్ షుల్జ్ మూడో స్థానంలో నిలిచాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : michael jackson  elvis presley  cartoonist charles schulz  forbes  telugu news  

Other Articles